"పల్లె జీవితాన్ని యధాతధంగా చిత్రీకరించిన సాంఘిక చిత్రం" అనే వాక్యాన్ని పబ్లిసిటీకి పోస్టరుపై ముద్రించి 1950 లో విడుదలైన విజయా వారి షావుకారు చిత్రం. ఇందులో కథానాయకుడు (ఎన్.టి.ఆర్.) కథానాయిక (షావుకారు జానకి) ఇరుగు పొరుగు వారైనా వారి మధ్య మాటలు తక్కువే. కనులతో పలకరించి, ముఖకవళికలతో భావాన్ని గ్రహిస్తూ స్నేహితులౌతారు. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారుతుంది. "పలుకరాదటే చిలుకా" అని అతడు ఆమెను ప్రశ్నించాడు. కాని ఆమె బదులీయలేదు. తరువాత కొద్ది కాలానికి ఇద్దరికీ పెళ్ళయింది. అయితే పెళ్ళికి ముందు తన సఖుడు అడిగిన ప్రశ్నకు ఇపుడు బదులిస్తోంది నాయిక. తమలపాకుల కిళ్ళీలు భర్తకు అందిస్తూ సుతారంగా సమాధానమిచ్చింది నాయిక ఈ పాటలో. ఈ సన్నివేశ సందర్భానికి ఒక లఘు గీతం సముద్రాల రాఘవాచార్యులు వ్రాయగా ఘంటసాల మాస్టారు స్వరపరచి రావు బాలసరస్వతితో గానం చేసారు.
శ్రీశ్రీఅనువాదసినీగీతాలుగురించిడా. పైడిపాలగారుఆంధ్రభూమివ్యాసంలోఈవిధంగావ్రాసారు. "అభ్యుదయకవిగామహాప్రస్థానకర్తగాలబ్ధప్రతిష్ఠులైనతర్వాతేశ్రీశ్రీసినీరంగప్రవేశంచేసినట్టుచాలామందికితెలుసు.
కానిశ్రీశ్రీసినీగేయప్రస్థానంఅనువాదచిత్రంతోఆరంభమయిందని, అనువాదచిత్రరచనకుతెలుగులోశ్రీశ్రీయేఆద్యులనితెలిసినవాళ్లుతక్కువ.
ఆమాటకొస్తేశ్రీశ్రీసినిమాపాటలున్నమొత్తంచిత్రాల్లో (255) నేరుగాతెలుగులోతీసినచిత్రాల్లోనిపాటల
(450) కంటేఅనువాదచిత్రాల్లోనిపాటలసంఖ్యే
(500) ఎక్కువ! తనకుసినిమాసరదాపన్నెండేళ్లవయసులోనేవున్నట్టుశ్రీశ్రీ ‘అనంతం’
ఆత్మకథలోరాసుకొన్నారు. మహాప్రస్థానగేయంమార్పులతో ‘కాలచక్రం’ (1940) అనేచిత్రంలోరావడంతోశ్రీశ్రీసినీరంగంలోవేలుపెట్టినట్టయింది. అయితేశ్రీశ్రీఆకవితనుతనమొదటిసినిమాపాటగాపరిగణించలేదు. ఆకవితనుసినిమాలోవినియోగించుకోవడమేతప్పఆనిర్మాతతోముందుగామాట్లాడుకొన్నస్వల్పపారితోషికంకూడావారుచెల్లించలేదట! 1946లోఆర్.యస్.జునార్కర్నిర్మించిన ‘నీరాఔర్నందా’
అనేహిందీచిత్రాన్ని 1950లోనవీనాఫిలిమ్స్వారుజగన్నాథ్పర్యవేక్షణలో ‘ఆహుతి’
పేరుతోఅనువదించడంతోతెలుగులోఅనువాదచిత్రనిర్మాణశకంఆరంభమయింది. ఆహుతిచిత్రానికిమాటలుపాటలురాసేఅవకాశంశ్రీశ్రీకిలభించింది. అలాసినీరచయితగాతనపేరుతెరకెక్కించినతొలిచిత్రంఆహుతియేనని, అదేతనసినీరచనకుపునాదివేసిందనిశ్రీశ్రీయేస్వయంగారాశారు." తను వ్రాసిన "ప్రేమయేజననమరణలీలా/ మృత్యుపాశమేఅమరబంధమా/ యువప్రాణులమ్రోలా...అనేపాటగురించిశ్రీశ్రీయిలాగుర్తుచేసుకున్నారు - "సినిమాకునేనురాసినపాటలన్నింటిలోనూయిదిమొట్టమొదటిది. ట్యూన్కిమాత్రమేకాకపెదవులకదలికకుకూడాసరిపోయేవిధంగా ‘నీరాఔర్నందా’ అనేహిందీచిత్రానికిరాసినడబ్బింగ్పాటయిది...
ఆహుతిలోనిపాటలన్నీబాగున్నాయంటేఅందుకుసాలూరురాజేశ్వరరావుసంగీతంగొప్పగాతోడ్పడిందనిచెప్పకతప్పదు. హిందీఒరిజనల్లోనిట్యూన్లంటినీఅతడుపూర్తిగామార్చితనసొంతముద్రవేశాడు. సినిమాకుపాటలురాయడంచాలామందిఅజ్ఞానులనుకునేటంతసులభంకాదు. ఇకడబ్బింగ్కురాయడమనేదిమరీకష్టంతోకూడుకున్నపని. ఉదాహరణకు ‘ప్రేమయే’ అన్నపాటనేతీసుకుందాం. హిందీలోదీనిపల్లవి ‘ప్రేమ్హైజనమ్మరణ్ - కాఖేల్’. ఇందులోనిఆఖరి ‘కాఖేల్’ చాలాఇబ్బందిపెట్టింది. ‘ప్రేమయేజననమరణహేల’ అనిరాశాను. కాని ‘లీల’ మాటమొదట్లోస్ఫురించలేదు. ఆరాత్రికలతనిద్రలోరాజేశ్వరరావుట్యూనుమననంచేసుకొంటూవుంటేప్రేమయేజననమరణలీల’ అనేపల్లవిదొరికింది. మర్నాడుపాటంతాపూర్తిచేశాను." పాటను అమర గాయకుడు ఘంటసాల మరియు లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతి గానం చేసారు. ఈ చిత్రానికి సంగీత సారధి ర'సాలూరు రాజేశ్వర రావు.
చిత్రం:
ఆహుతి (1950)
సంగీతం:
సాలూరు రాజేశ్వర రావు
గానం:
ఘంటసాల, రావు బాలసరస్వతి
రచన:
శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)
ప:
ఘం:
జనన మరణలీల, ప్రేమయే
జనన మరణ లీల
మృత్యుపాశమే అమర బంధమౌ -2
యువప్రాణుల మ్రోలా..ఆ..ఆ..-2
ప్రేమయే జనన మరణ లీల -2
చ:
ఘం:
తనుసామ్రాజ్యము స్మృతియే కాదా
తనుసామ్రాజ్యము స్మృతియే కాదా
నిలచు దృఢముగా మానసగాధ -2
ఇ:
మృత్యుపాశమే
బా:
అమర బంధమౌ
మృత్యుపాశమే అమర బంధమౌ
యువప్రాణుల మ్రోలా
ప్రేమయే జనన మరణ లీల -2
లీలా..
కృతజ్ఞతలు: ఈ వ్యాసంలోని ఉపోద్ఘాతం శ్రీ డా. పైడిపాల గారు ఆంధ్రభూమి లో 03-06-2014 న ప్రచురించిన శ్రీశ్రీ అనువాద సినీగీతాలు వ్యాసం నుండి యధాతథంగా గ్రహించడమైనది.అదనపు వివరాలు ఘంటసాల గళామృతము - పాటలపాలవెల్లి బ్లాగులో పొందుపరచిన శ్రీ కొల్లూరు సుబ్బారావు గారికి మరియు Wikipedia వారికి, శ్రవ్యఖండికను ఘంటసాల గానచరిత లో పొందుపరచిన శ్రీ నూకల ప్రభాకర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
Thanks to GVS Sastry garu for the audio clip loaded to You Tube.
రిపబ్లిక్ ప్రొడక్షన్‌స్ పతాకంపై 1959 లో డి.యోగానంద్ దర్శకత్వంలో విడుదలైన సాంఘిక చిత్రం పెళ్ళిసందడి. ఇందులో ఎ.ఎన్.ఆర్., అంజలి, చలం నటించారు. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారే సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఒక చక్కని పద్యంతో ప్రారంభమయి తదుపరి వినిపించే ఘంటసాల, రావు బాలసరస్వతీ దేవి ఆలపించిన యుగళగీతం 'రావే ప్రేమలతా'. పద్యం బహుశా మాండ్ రాగం లోను, పాటను శంకరాభరణ రాగంలోను కూర్చారు మాస్టారు. ఈ చిత్రానికి సముద్రాల జూనియర్ చక్కని పాటలు వ్రాసారు. ఈ పాటలో అందమైన యువతిని అందవతి అనే అరుదైన ప్రయోగం చేసారు సముద్రాల జూనియర్. హాయిగా, ఆహ్లాదంగా సాగే మధురమైన శృంగార యుగళగీతమిది. వినండి.
Thanks to Volga Video for up loading the video clip to You Tube
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com