ఘంటసాల మాస్టారు రేలంగి గారికి ఒక ప్రత్యేకమైన శైలిలో పాడతారు. 1956 లో విడుదలైన శ్రీ గౌరీ మహత్మ్యం చిత్రంలో మాస్టారు చాల పాటలు, పద్యాలు, శ్లోకాలు గానం చేసారు. ఈ చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు - శ్రీ ఓగిరాల రామచంద్ర రావు గారు, శ్రీ టి.వి.రాజు గారు. పాట వ్రాసింది శ్రీ మల్లాది గారు. ఈ పాటలో కొన్ని జంట పదాలను చాల బాగా వాడారు మల్లాది గారు. ఉదాహరణకు - హోరుగాలి-పైరగాలి, పూరి-చూరు, పకపక-బెకబెక లాంటివి. అవన్నీ రేలంగి పాత్రకు, నటనకు, మాస్టారి గొంతు మాడ్యులేషన్ కు మరింత పరిమళాన్నిచ్చాయి. ఇక్కడ ఈ పాట దృశ్య, శ్రవణ, సాహిత్యాలను పొందుపరుస్తున్నాను.ఈ చిత్రానికి దర్శకులు శ్రీ డి.యోగానంద్.
చిత్రం: శ్రీ గౌరీ మహత్మ్యం (1956)
రచన: మల్లాది రామకృష్ణ శాస్త్రి
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు, టి.వి.రాజు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
Thanks to Sri Bollapragada Someswara Rao garu for providing the video.
రచన: మల్లాది రామకృష్ణ శాస్త్రి
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు, టి.వి.రాజు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
పల్లవి: | నీవక్కడా నేనిక్కడా ఈ చిక్కు తీరేదెక్కడో | | నీవక్కడా | |
నీవక్కడా నేనిక్కడా! | ||
చరణం: | ఒక్కరుంటే హోరుగాలి, ఇద్దరుంటే పైరగాలీ.. ఈ… | | ఒక్కరుంటే | |
మాటకారీ! ఎక్కడే నీ నోటి ముత్యాలు | ||
నీవక్కడా నేనిక్కడా ఈ చిక్కు తీరేదెక్కడో | ||
నీవక్కడా నేనిక్కడా! | ||
చరణం: | తోటలో చిందూ పసందు, తోటలో నేనే | |
నా పాటకూ, నీ నీటుకూ జత కుదిరిపోయిందే | ||
పచ్చ పచ్చగ పిల్ల మెళ్ళో తాళి కడితే ముచ్చట | | పచ్చ పచ్చగ | | |
ముద్దు ముచ్చట తీరకుంటే నిద్దరే రాదే | ||
ఆ ముద్దూ ముచ్చట తీరకుంటే నిద్దరే రాదే | ||
నీవక్కడా నేనిక్కడా ఈ చిక్కు తీరేదెక్కడో | ||
నీవక్కడా నేనిక్కడా! | ||
చరణం: | చందమామకు కోక కడితే చిన్ని నువ్వేనే | |
వెన్నెలా పన్నీరు కలిపితె పూల నవ్వేనే | ||
నీవు నేనూ చేరువైతే పూరి గుడిశెలొ పకపక | | నీవు నేనూ | | |
నీకు నాకూ దూరమైతే చూరుకిందే బెకబెక | | నీకు నాకూ | | |
హెయ్! పూరి గుడిశెలొ పక పక | ||
హెయ్! చూరు కిందే బెకబెక | ||
పూరి గుడిశెలొ పక పక పక | ||
చూరు కిందే బెక బెక బెక | ||
పక పక పక పక బెక బెక బెక బెక | ||
పక పక పక పక బెక బెక బెక బెక | ||
పక పక బెక బెక పక పక బెక బెక | ||
బెక్! |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి