పెళ్ళి నాటి ప్రమాణాలు (1958) చిత్రానికి ఘంటసాల మాస్టారు సంగీత దర్శకత్వం వహించారు. చక్కని ప్రేమకథ ఇది. పెళ్ళికి ముందు చేసుకున్న వాగ్దానాలు పెళ్ళి అయిన తరువాత తప్పితే ఎలావుంటుందో ఆ సంసారం అన్న కధాంశం పై ఎ.ఎన్.ఆర్., జమున జంటగా నటించిన చిత్రమిది. చాల మంచిపాటలు పింగళి నాగేంద్ర రావు గారి కలం నుండి జాలువారాయి. మాస్టారు మూడు యుగళ గీతాలు శ్రీమతి పి.లీల గారితోను, ఒక ఏక గళ గీతము పాడారు. ఈ పోస్టులో మాస్టారి ఏకగళ గీతం "చల్లగ చూడాలి పూలను" దృశ్య, శ్రవణ, సాహిత్యాలతో అందిస్తున్నాను. మాస్టారి పాటకు ముందు అక్కినేని కూని రాగంతో నుయ్యి దగ్గర స్నానం చేస్తూ పాడతారు.
చిత్రం: | పెళ్ళినాటి ప్రమాణాలు (1958) | ||
రచన: | పింగళి నాగేంద్రరావు | ||
సంగీతం: | ఘంటసాల | ||
గానం: | ఘంటసాల | ||
సాకీ: | కావనగానే సరియా | ||
ఈ పూవులు నీవేగా.. దేవీ.. | |||
పల్లవి: | చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి దేవీ.. | ||
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి | |||
మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా.. | |||
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి | |||
చరణం: | మలయానిలముల లాలన వలెనే | ||
వలపులు హాయిగ కురిసీ.. | | మలయానిలముల | | ||
కలికి చూపులను చెలిమిని విరిసి | |||
చిలిపిగ దాగుట న్యాయమా? .. | |||
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి | |||
చరణం: | తెలి మబ్బులలో జాబిలి వలెనే | ||
కళకళ లాడుచు నిలిచీ.. | | తెలి మబ్బులలో | | ||
జిలిబిలి సిగ్గుల పిలువక పిలిచి | |||
పలుకక పోవుట న్యాయమా?.. | |||
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి | |||
మల్లె సుగంధం మనసున జల్లి మళ్ళీ అల్లరి తగునా.. | |||
చల్లగ చూడాలీ పూలను అందుకు పోవాలి |
Sincere thanks to Ghatasala Galamrutamu Patala Palavelli for providing useful information.
ఇది ఎంతో అద్భుతమైన పాట.పింగళి వారి సునితమైన సాహిత్యానికి మాస్టారి స్వర గానం ఆహా ఆహా ఆహా....ఈ పాట అంటే నాకు ప్రాణం.
రిప్లయితొలగించండి