1955 సంవత్సరంలో విడుదలైన అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థ నిర్మించిన దొంగ రాముడు చిత్రం నుండి ఘంటసాల పాడిన "చెరసాల పాలైనావా " అనే ఈ ఏకగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, సావిత్రి, జమున, ఆర్.నాగేశ్వరరావు, రేలంగి, జగ్గయ్య, సూర్యకాంతం,అల్లు రామలింగయ్య. ఈ చిత్రానికి నిర్మాత డి.మధుసూదనరావు మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 01.10.1955 న విడుదలైంది.
ఈ ఏకగళగీతానికి సాహిత్యం శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు సంకలనం చేసిన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" గ్రంథము నుండి సేకరించబడింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.