1953 సంవత్సరంలో విడుదలైన వినోదా సంస్థ నిర్మించిన దేవదాసు చిత్రం నుండి ఘంటసాల పాడిన "పల్లెకు పోదాం పారును చూదాం" అనే ఈ ఏకగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది సి.ఆర్.సుబ్బురామన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, సావిత్రి, ఎస్.వి.రంగారావు, ఆర్.నాగేశ్వరరావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, పేకేటి, లలిత. ఈ చిత్రానికి నిర్మాత డి.ఎల్.నారాయణ మరియు దర్శకుడు వేదాంతం రాఘవయ్య. దీనిని అక్కినేని పై చిత్రీకరించారు. ఈ చిత్రం 26.06.1953 న విడుదలైంది.
| చిత్రం | దేవదాసు-1953 | |||
| రచన | సముద్రాల రాఘవాచార్య | |||
| సంగీతం | సి. ఆర్. సుబ్బరామన్ | |||
| గానం | ఘంటసాల | |||
| ప. | పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో ||2|| | |||
| అల్లరి చేదాం చలో చలో | ||పల్లెకు|| | |||
| ప్రొద్దు వాలే ముందు గానే ముంగిట వాలేమూ | ||పల్లెకు|| | |||
| చ. | ఆటా పాట లందు కవ్వించు కొంటె కోణంగీ ||2|| | |||
| మనసేమో మక్కువేమో..మనసేమో మక్కువేమో | ||||
| నగవేమో వగేమో కనులార చూతమూ | ||పల్లెకు|| | |||
| చ. | నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో ||2|| | |||
| నా దరికి దూకునో.. నా దరికి దూకునో | ||||
| తానలిగి పోవునో ఏమౌనో చూతమూ | ||పల్లెకు|| | |||
| ప్రొద్దు వాలే ముందు గానే ముంగిట వాలేమూ | ||||
| పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో | ||||
| అల్లరి చేదాం చలో చలో...ఛలో... ఛలో... |




