ఘంటసాల మాస్టారు చలన చిత్ర రంగ ప్రవేశం చేసేనాటికి చిత్తూరు వి. నాగయ్య గారు అప్పటికే పరిశ్రమలో నిలదొక్కుకున్న సుప్రసిద్ధ సంగీత దర్శకులు. అంతేకాక శ్రీ నాగయ్య గారు నటుడిగా కూడ రాణించారు. వందే మాతరం, గృహలక్ష్మి వంటి సాంఘిక చిత్రాలైతేనేమి, యోగి వేమన, భక్త రామదాసు, త్యాగయ్య వంటి సందేశ, సంగీత, భక్తి ప్రధానమైన చిత్రాలలోను నటించారు. చాల మటుగు తన పాత్రకు తానే స్వయంగా పాడేవారు. అంతటి విద్వాంసుడు రామారావు గారితో నటించిన రాము చిత్రంలో ఘంటసాల మాస్టారు ఇద్దరికీ నేపథ్యం పాడిన పాట రారా కృష్ణయ్యా. ఇది 1964 లో విడుదలైన "రాము" చిత్రం లోనిది. భగవంతుని నమ్మితే అసాధ్యమైనది లేదని చెప్పే అలనాటి శ్లోకం "మూకం కరోతి వాచాలం" ఆధారంగా దాశరధి వ్రాసిన గీతమిది.
చిత్రం: | రాము (1968) | |
రచన: | దాశరధి | |
సంగీతం: | ఆర్.గోవర్ధనం | |
గానం: | ఘంటసాల | |
సాకీ: | దీనుల కాపాడుటకు దేవుడే వున్నాడు | |
దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు | ||
ఆకలికి అన్నము, వేదనకు ఔషధం | ||
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా! | ||
పల్లవి: | రారా! కృష్ణయ్యా! రారా! కృష్ణయ్యా! | |
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా | | రారా కృష్ణయ్యా | | |
చరణం: | మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా | |
ఎదురు చూచు కన్నులలో కదిలేమయ్యా | | మా పాలిటి | | |
పేదల మొర లాలించే విభుడవు నీవే | ||
కోరిన వరముల నొసగే వరదుడ వీవే | | పేదల | | |
అజ్ఞానపు చీకటికి దీపము నీవే | ||
అన్యాయము నెదిరించే ధర్మము నీవే | ||
నీవే కృష్ణా! నీవే కృష్ణా! నీవే కృష్ణా! | | రారా కృష్ణయ్యా | | |
చరణం: | కుంటివాని నడిపించే బృందావనం | |
గుడ్డివాడు చూడగలుగు బృందావనం | | కుంటివాని | | |
మూఢునికి జ్ఞానమొసగు బృందావనం | ||
మూగవాని పలికించే బృందావనం | | మూగవాని | | |
అందరినీ ఆదరించు సన్నిధానం | ||
అభయమిచ్చి దీవించే సన్నిధానం | ||
సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం | | రారా కృష్ణయ్యా | | |
చరణం: | కరుణించే చూపులతో కాంచవయ్యా | |
శరణొసగే కరములతో కావవయ్యా | | కరుణించే | | |
మూగవాని పలికించీ బ్రోవవయ్యా | ||
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా | | మూగవాని | | |
నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా | ||
ఆధారము నీవేరా రారా కృష్ణా | ||
కృష్ణా కృష్ణా రారా కృష్ణా | | రారా కృష్ణయ్యా | |