1949 లో విడుదలైన చిత్రం కీలు గుఱ్ఱం. ఈ జానపద చిత్రంలో ప్రసేనుడనే మహారాజు (ఏ.వి.సుబ్బారావు) వేటకు వెళ్ళి ఒక భువన సుందరిని (అంజలీదేవి) ని వెంటబెట్టుకొస్తాడు. నిజానికి ఈ సుందరి ఒక రాక్షసి. రాత్రి పూట రాజుగారి ఏనుగులను ఆరగిస్తుంటుంది. ఆ సుందరి మాయలో పడిపోతాడు రాజు. ప్రసేన మహారాజు, భువనసుందరి లపై చిత్రించిన పాట "తెలియ వశమా! పలుక గలమా!" అనే ప్రేమ గీతం. ఇందులో రాజు పెద్ద భార్య కొడుకుగా ఎ.ఎన్.ఆర్. నటించారు. ఈ చిత్రానికి ఘంటసాల గారి సంగీతం. మాస్టారితో శ్రీమతి సి.కృష్ణవేణి పాడిన యుగళ గీతం అంజలీదేవి ప్రసేన మహారాజు పై చిత్రీకరించారు. కృష్ణవేణి గారు ఈ చిత్ర నిర్మాత ఐన మీర్జాపురం రాజా (మేకా రంగయ్య) గారి సతీమణి. ఈవిడ గాయని, నటి, మరియు నిర్మాత. ఈ పాట రచన చేసినది శ్రీ తాపీ ధర్మారావు నాయుడు గారు. ఈయన చాల చిత్రాలకు సంభాషణలు, పాటలు వ్రాసారు.
చిత్రం: | కీలుగుఱ్ఱం (1949) | ||
రచన: | తాపీ ధర్మారావు నాయుడు | ||
సంగీతం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | ||
గానం: | ఘంటసాల, సి.కృష్ణవేణి | ||
పల్లవి: | కృష్ణవేణి: | తెలియ వశమా! పలుక గలమా! | |
ప్రేమ మహిమా! ఆహాహహా.. | |||
తెలియ వశమా! పలుక గలమా! | |||
చరణం: | కృష్ణవేణి: | తాకినంతనే శోక రహితమై | |
బ్రతుకంతా ఒక తృటి కాలములో..ఓ.. | | బ్రతుకంతా | | ||
ఘంటసాల: | రంగలరారే బంగారముగా.. | ||
మార్చు గదా! ముదమార్చు గదా! | |||
రంగలరారే బంగారముగా.. | |||
మార్చు గదా! ముదమార్చు గదా! | |||
ఇద్దరు: | తెలియ వశమా! పలుకగలమా! | ||
చరణం: | కృష్ణవేణి: | రాగ తంతువుల తీవెల వోలె..ఏ. | | రాగ తంతువుల | |
మేళవించి మన జీవిత వీణా.. | | మేళవించి | | ||
మోహన గీతము ముద్దులొలుకగా | | మోహన | | ||
పాడు గదా! చెరలాడుగదా! | |||
తెలియ వశమా! పలుకగలమా! | |||
చరణం: | ఇద్దరు: | మనసు మనసుతో మచ్చిక పెనగొని | |
మల్లె తీవెలటు అల్లిబిల్లిగా.. | | మనసు | | ||
జీవితమంతా పూవు పందిరిగ | |||
చేయు గదా! మది హాయి గదా! | | జీవితమంతా | | ||
తెలియ వశమా! పలుక గలమా! | |||
ప్రేమ మహిమా! ఆహాహహా.. | |||
ఆహహా! |
కృతజ్ఞతలు: చిత్రం గురించిన సమాచారము మరియు శ్రీ తాపీ ధర్మారావు నాయుడు గారి ఛాయాచిత్రము వికీపీడియా నుండి సేకరించడమైనది. సాంకేతిక నిపుణుల వివరాలు, శ్రీమతి కృష్ణవేణి గారి ఛాయాచిత్రము ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి నుండి సేకరించడమైనది. వీడియో ను యూ ట్యూబ్ లో లభ్యం చేసిన ప్రణీత్ గారికి ధన్యవాదాలు. ఆడియో ఫైలు మూలం - ఓల్డ్ తెలుగు సాంగ్స్.కాం. All the content in this blog is for Entaertainment purpose only.
Good (g)old song
రిప్లయితొలగించండి