గానగంధర్వులు ఘంటసాల మాస్టారు ఎన్నో మధురమైన భక్తి గీతాలు తాదాత్మ్యంతో పాడారు. అందులో అనువాద చిత్రాలకు పాడినవి ఎక్కువగా ప్రసార మాధ్యమాలలో కనిపించవు.  అయితే ఆయన వీరాభిమానులు, ఆరాధకులు చేసిన ప్రయత్నాల వలన కొన్ని వెలుగు చూస్తున్నాయి. షణ్ముఖుడు లేదా సుబ్రహ్మణ్యస్వామి మరియు వల్లిల కల్యాణాన్ని తమిళంలో మొదట 1945 లో "శ్రీ వల్లి" అనే పేరుతోనిర్మించారు. ఆ చిత్రాన్ని అదే పేరుతో 1961 లో  శివాజీ 
గణేశన్ సుబ్రహ్మణ్య స్వామిగా, పద్మిని వల్లిగా, టి.ఆర్. మహాలింగం నారదునిగా
 పునర్నిర్మించారు. తదుపరి 1962 లో "శ్రీ వళ్ళీ (వల్లీ) కల్యాణం (సుబ్రహ్మణ్య స్వామి మహాత్మ్యం)" అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.  ఈ చిత్రంలో నారద పాత్రధారి అయిన మహాలింగంకు ఘంటసాల మాస్టారు, బృందం పాడిన పాట "సమ్మతి కోరితిరా". అనువాద గీతాలకు ఆద్యులు, మహాకవి శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ఈ భక్తి గీతాన్ని స్వరపరచినది టి. చలపతిరావు. 
Video Courtesy: Sri Rajasekhar Raju
| ఘంటసాల - | సమ్మతి కోరితిరా | |
| సమ్మతి కోరితిరా నిన్ సన్నుతి జేసెదరా షణ్ముఖా. ఆ ఆ -2 | ||
| సమ్మతి కోరితిరా | ||
| జన్మతరించెనయా ఆ ఆ ఆ ఆ | ||
| జన్మతరించెనయా, పాలన చేయవే అమృతమయా, షణ్ముఖా.. | ||
| ఏలవే అమృతమయా షణ్ముఖా ఆ ఆ | ||
| సమ్మతి కోరితిరా | ||
| ఘంటసాల - | నిను మది వేడితిరా ఆ ఆ స్వామీ! షణ్ముఖా.. ఆ ఆ ఆ | |
| నిను మది వేడితిరా, నాలో నిలిచిన జ్యోతివిరా, స్వామీ | ||
| నిను మది వేడితిరా, నాలో నిలిచిన జ్యోతివిరా | ||
| స్వామీ మరుపేలా, మందిర ద్వారము తెరువుమయా | ||
| షణ్ముఖా ఆ ఆ, షణ్ముఖా.. ఆ.. ఆ.. | ||
| షణ్ముఖా ఆ ఆ, షణ్ముఖా.. ఆ.. ఆ.. | ||
| బృందం | జయ జయ దీన మందార, భక్తజనముల కాచేటి జగదేక వీరా! | |
| జాలము చేసేవదేలా! జయ జగదేక వీరుడవె గౌరీ కుమారా | ||
| జయ జయ దీన మందార | ||
| నిను నమ్మి యున్నాము కాదా | ||
| నీవు కనిపించి కాపాడి కరుణించరాదా | ||
| నిరతమ్ము దేవాధిదేవా | ||
| నిన్ను వేనోళ్ళ కొనియాడ వేగగ రావా | ||
| జయ జయ దీనావతారా | ||
| ఘంటసాల - | మోహనమూర్తివిరా నినుగన ముచ్చటపడితినిరా స్వామీ -2 | |
| నాదము పొంగెనురా - 2 | ||
| మురిసి నా మది పాడెనురా | ||
| నాదము పొంగెనురా, మురిసి నా మది పాడెనురా | ||
| అద్భుత తేజముతో ఆ.. ఆ.. హా.. ఆ ఆ | ||
| అద్భుత తేజముతో వెలిగే, ఆనందజ్యోతివిరా స్వామీ | ||
| భక్తజనావళికే, | ||
| భక్తజనావళికే షణ్ముఖా ముక్తిప్రదాతవురా-2 | 


 
 

