|  | 
| విమాన గోపురం (ఆనంద నిలయం) | 
తెలుగువారి గళవేల్పు అయిన ఘంటసాలకు కూడ మనందరివలె ఇలవేల్పు వేంకటేశ్వరుడు. రెండూ కలసి ఆయన ఘంటసాల వేంకటేశ్వరుడు. ఆ వేంకటేశునిపై మాస్టారు పాడిన భక్తి గీతాలు వింటుంటే మధురానుభూతి కలుగుతుంది. ఆ శ్రీనివాసుని నివాసం ఏడు కొండలు లేదా సప్త గిరులు. ఆది శేషుని ఏడు పడగలే ఏడు కొండలై వెలిసాయని పురాణ కథనం. గిరి, అద్రి, శైలము, అచలము... మొదలయినవి కొండకు పర్యాయ పదాలు. ఆ సప్తగిరులు - శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వేంకటాద్రి. ఆదిశేషుని పేరున శేషాద్రి, వైనతేయుని (అనగా వినత పుత్రుడైన గరుత్మంతుడు లేదా గరుడుడు) పేర గరుడాద్రి, స్వామికి మొట్ట మొదట జుట్టు సమర్పించిన మహిళ నీలాంబరి పేర నీలాద్రి గా వెలిసాయి. "తల నీలాలు" అన్న పేరు కూడ అలాగే వచ్చింది. ఇవి కాక స్వామి వారితో యుద్ధం చేసిన వృషభుడనే శివభక్తుని పేర వృషభాద్రి గా, సంతానం కోసం అంజనాదేవి తపసు చేసిన ప్రదేశం అంజనాద్రి గా, 'వేం' అంటే పాపములు, 'కట' అంటే హరించుంది, వెరసి వేంకటాద్రి గా, మరియు నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండ నారాయణాద్రి గా పేరు పొందాయి. ఇవి కాక, శ్రీదేవి వసించిన శిల శ్రీశైలముగా మరియు వృషము (ధర్మ దేవత) తపస్సు చేసిన గిరి వృషశైలము గ ప్రఖ్యాతి పొంది సప్తగిరులుగ పరిగణలోకి వచ్చాయి. ఈ గిరులలోని ఝరులలో భవ పాతకములను ప్రక్షాళనం చేసే జలపాతములలో స్నానమాచరించిన పునీతులౌతారని భక్తుల విశ్వాసం. ఇదే "పాప వినాశనం" అన్న పేర ప్రఖ్యాతి పొందినది. అలాగే తిరుమలలోని  వేంకటేశ్వరుని గుడి యొక్క విమాన గోపురాన్ని ఆనంద నిలయం అంటారు. దీనిని ఆకాశరాజు సోదరుడైన తొండమాన్ చక్రవర్తి కట్టించాడంటారు. ఏడుకొండలను ఈ పాట లో చక్కగా దర్శింపజేసే గీత రచన చేసినది వి.జి.కె.చారి. సప్తగిరుల వేల్పును షణ్ముఖప్రియలో కూర్చి తాదాత్మ్యంగా గానం చేసి శ్రవణానందం కలిగించారు ఘంటసాల మాస్టారు.   
ఓం! నమో వేంకటేశాయ నమః
 
 
 
 
 
  
  
  
  
 
  | 
 | 
 | మూలం: | ప్రైవేట్ ఆల్బమ్ | 
 | 
  | 
 | 
 | రచన: | వి.జి.కె.చారి | 
 | 
  | 
 | 
 | సంగీతం: | ఘంటసాల | 
 | 
  | 
 | 
 | గానం: | ఘంటసాల | 
 | 
  | 
 | 
 | 
 | 
 | 
 | 
  | 
 | 
 | సాకీ: | శ్రీశైలవాసా, శేషాద్రివాసా, | 
 | 
  | 
 | 
 | 
 | గరుడాద్రివాసా, వేంకటాద్రీశా | 
 | 
  | 
 | 
 | 
 | నారాయణాద్రీశ, వృషభాద్రివాసా, | 
 | 
  | 
 | 
 | 
 | వృషశైలవాసా సర్వలోకేశా | 
 | 
  | 
 | 
 | 
 | ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. | 
 | 
  | 
 | 
 | 
 | 
 | 
 | 
  | 
 | 
 | పల్లవి: | తిరువేంకటాధీశ జగదీశ! | 
 | 
  | 
 | 
 | 
 | కరుణనేలగ రావె కమలేశ! | | తిరు | | 
  | 
 | 
 | 
 | 
 | 
 | 
  | 
 | 
 | చరణం: | కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ | 
 | 
  | 
 | 
 | 
 | కోటి చేతులు నీకు కోరి జోతలు చేయ | 
 | 
  | 
 | 
 | 
 | కోరికల దీర్చేటి కొంగు బంగారమై | 
 | 
  | 
 | 
 | 
 | కొండలేడింటిపై కొలువు తీరేవయ్యా | | తిరు | | 
  | 
 | 
 | 
 | 
 | 
 | 
  | 
 | 
 | చరణం: | పాతకమ్ములదీర్చు పంచధారల నడుమ | 
 | 
  | 
 | 
 | 
 | బహు పుణ్యప్రదమైన స్వామిగ్రహ తీరాన | 
 | 
  | 
 | 
 | 
 | ఆనంద నిలయాన అందాన కొలువున్న | 
 | 
  | 
 | 
 | 
 | ఆనందరూప మమ్మాదరింపగ రావె | | తిరు | | 
  | 
 | 
 | 
 | 
 | 
 | 
  | 
 | 
 | చరణం: | శివరూపమీవంచు చెప్పుదురు కొందఱు | 
 | 
  | 
 | 
 | 
 | ఆదిశక్తివటంచు అందురింకొందఱు | | శివ | | 
  | 
 | 
 | 
 | నారాయణుండంచు నమ్ముదురు కొందఱు | 
 | 
  | 
 | 
 | 
 | మూడుశక్తులు గూడ ముచ్చటౌ రూపమ్ము | 
 | 
  | 
 | 
 | 
 | తిరువేంకటాధీశ జగదీశ! | 
 | 
  | 
 | 
 | 
 | కరుణనేలగ రావె కమలేశ! | 
 | 
| 
 | 
 | 
 | తిరువేంకటాధీశ జగదీశ! జగదీశ! జగదీశ! | 
 | 
మిత్రులు వేణుగోపాల్ తాతిరాజు ఈ పాటకు చక్కని విశ్లేషణ చేశారు. వారేమన్నారంటే "చారి గారి రచనలో అంకెలూ,సంఖ్యలూ ఉన్నాయి. అవి- మూడు శక్తులు, పంచ ధారలు, 
ఏడు కొండలు, కోటి గొంతులు/కోటి చేతులు. ఇన్ని ఉండగా మరి ఘంటసాల మాస్టారు 
గారు 'ఆరు'ముఖాల షణ్ముఖ ప్రియ రాగం  ఎంచుకోవడం సమంజసమే. అది కూడా ఇలా 
సంభవించి ఉంటుంది- సాకి,పల్లవి కలిపితే 'ఆరు' పంక్తులొస్తాయి.  
మొత్తం మూడు చరణాల్లో పన్నెండు పంక్తులున్నాయి  - అవి ఎవరికి అంకితం? ఆరు జగదీశుడికి, ఆరు కమలేశుడికి! 
ఏడాది పొడుగునా పన్నెండు జోతలు ఎవరికీ? ఆరు -గాయకుడికి, ఆరు- స్వరకర్తకి -వెరసి పన్నెండు ఘంటసాల వారికే!" - ఆవిధంగా చూస్తె అంకెలలో వేంకటేశ్వరుడు అనిపిస్తుంది కదా! 
ఏడు కొండల వాడా! వేంకట రమణా గోవిందా! గోవిందా!