భగవదవతార ముఖ్యోద్దేశం దుష్టశిక్షణ మరియు శిష్టరక్షణ. అధర్మము వృద్ధిచెంది, ధర్మము నశించినపుడు తాను ప్రతియుగములో అవతరిస్తానని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో అర్జునునకు ఉపదేశించాడు. జగన్నాటక సూత్రధారియైన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో పదింటిని ముఖ్యమైన అవతారాలుగా పేర్కొంటారు. అవి మీన, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, మరియు కల్కి అవతారాలు. 1961 లో విడుదలైన సీతారామ కల్యాణం చిత్రంలో మీనావతారం నుంచి రామావతార ప్రారంభం వరకు గల సారాంశాన్ని చక్కని సముద్రాల రాఘవాచార్యుల వర్ణన తో "గోవింద మాధవ దామోదరా" అనే గీతంలో చక్కగా వర్ణించగా దాన్ని తన గళమాధుర్యం తో ఘంటసాల మాస్టారు గాలి పెంచల నరసింహారావు సంగీత దర్శకత్వంలో గానం చేశారు.
Thanks to ideal Dreams for uploading the video to You Tube
నిర్మాణం: | నేషనల్ ఆర్త్స్ థియేటర్స్ | ||
చిత్రం: | సీతారామ కల్యాణం (1961) | ||
రచన: | సముద్రాల రాఘవాచార్య | ||
సంగీతం: | గాలి పెంచలనరసింహారావు | ||
గానం: | ఘంటసాల వెంకటేశ్వరరావు | ||
ప: | గోవింద మాధవ దామోదరా | ||
జయ గోవింద మాధవ దామోదరా, జగదానంద కారణ నారాయణా | |||
జయ గోవింద మాధవ దామోదరా | |||
చ: | కృతులు హరించీ జలనిధి దాగిన (2) | ||
సోమక దానవు ద్రుంచీ.... వేదోద్ధరణము చేసిన వీరా.. | |||
మీనాకార శరీరా నమో మీనాకార శరీరా | |||
చ: | పాల సముద్రము బానగ జేసి (2), మందర శైలము కవ్వము జేసి | ||
వాసుకి కవ్వపు త్రాటిని జేసి (2) | |||
సురదానవులు తఱచగా గిరిని మోసిన కూర్మ శరీరా నమో | |||
గిరిని మూపున మోసిన కూర్మ శరీరా | |||
చ: | పుడమిని బట్టి చాపగా జుట్టి (2), కడలిని దాగిన హిరణ్యాక్షుని | ||
కోరను గొట్టీ ధారుణి గాచిన | |||
వీర వరాహ శరీరా నమో వీర వరాహ శరీరా | |||
చ: | సర్వమయుడవగు నిను నిందించే (2), హిరణ్య కశిపుని (2) వధియించీ | ||
ప్రహ్లాదుని పరిపాలన జేసిన నరసింహాద్భుత రూపా | |||
నమో నరసింహాద్భుత రూపా | |||
చ: | సురలబ్రోవ మూడడుగుల నేల (2) | ||
బలిని వేడి ఆ..ఆ..ఆ.. బలిని వేడి | |||
ఇల నింగిని నిండీ మూడవ పాదము బలి తలమోపిన | |||
వామన విప్ర కుమారా, నమో! వామన విప్ర కుమారా | |||
చ: | ధరణీ నాధుల శిరముల గొట్టీ (2) | ||
సురలోకానికి నిచ్చెనగట్టీ, తండ్రికి రుధిరము తర్పణ జేసిన | |||
పరశుధరా భృగురామా! నమో పరశుధరా భృగురామా! | |||
గోవింద మాధవ దామోదరా జయ గోవింద మాధవ దామోదరా | |||
జగదానంద కారణ నారాయణా గోవింద మాధవ దామోదరా |