మాస్టారి సొంతచిత్రం పరోపకారం లో నాలుగు పాటలు పాడారు. అన్నీ మాస్టారి ఏకగళ గీతాలే. ఇంతకు ముందు పోస్టులో ఒక చక్కని పాట "హృదయమా! సాగిపొమ్మా" చూసి, విని ఆనందించారు. మరొక రస గుళిక ఇక్కడ ఆస్వాదించండి. ఈ పాట కూడ శ్రీ ఆరుద్ర గారే వ్రాసారు. హాయిగా సాగే సంసారం అంటే పొద్దున్నే విలాసంగా సిగరెట్ కాలుస్తూ, పేపరు చదువుతూ, భార్య యిచ్చిన కాఫీ తాగుతూ తియ్యని ఈ కాపురమే (కాఫీయే) దివ్యసీమ అనుకుంటూ ముక్కామల గారు గ్రామఫోను రికార్డుతో మొదలుపెట్టి మెల్లగా పాట అందుకుంటే, అతని భార్యగా నటించిన శ్రీమతి జి.వరలక్షి ముసిముసి నవ్వులు నవ్వుతూ పిల్లాడ్నిఉయ్యాలలో వేసి ఊచే సన్నివేశాన్ని చాల సహజంగా చిత్రీకరించారు ఈ పాట నేపధ్యంలో. పాట మధ్య సంగీతం మొదటిసారి వింటే హీరోయిన్ ఆలాపనేమో అనిపిస్తుంది. అలా కూర్చారు మాస్టారు. ఈ పాట దృశ్య, శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆస్వాదించండి మరి!
Thanks to Sri Bollapragada Someswara Rao garu
for uploading the video to You Tube
చిత్రం: | పరోపకారం (1953) | ||
రచన: | ఆరుద్ర | ||
సంగీతం: | ఘంటసాల | ||
గానం: | ఘంటసాల | ||
పల్లవి: | తియ్యని ఈ కాపురమే దివ్య సీమ | | తియ్యని | | |
విరి తేనెలూరు ఈ సీమయె మధుర సీమా.. | |||
తియ్యని ఈ కాపురమే దివ్య సీమ | |||
చరణం: | కనువిందు కదా భార్యలు పసందు కదా లీలలు.. ఊ.. | ||
కనువిందు కదా భార్యలు పసందు గదా లీలలు | |||
కమ్మని లే ఊసులే జాతి మణి పూసలై | | కమ్మని | | ||
ఒలికే పాపల పలుకే హాయీ హాయి | |||
తియ్యని ఈ కాపురమే దివ్య సీమ | |||
విరి తేనెలూరు ఈ సీమయె మధుర సీమా.. | |||
తియ్యని ఈ కాపురమే దివ్య సీమ | |||
చరణం: | ఆలుమగల పొందిక, పాలు తేనె కలయికా.. ఆ.. | ||
ఆలుమగల పొందిక, పాలు తేనె కలయిక | |||
చిలకా గోరింకల వలె కులికే దంపతుల | | చిలకా | | ||
సంసారపు సరిసాటి లేనే లేదు | |||
తియ్యని ఈ కాపురమే దివ్య సీమ | |||
విరి తేనెలూరు ఈ సీమయె మధుర సీమా.. | |||
తియ్యని ఈ కాపురమే దివ్య సీమ |
కృతజ్ఞతలు: చిత్రం యొక్క సమాచారం పొందుపరచిన ఘంటసాల గళామృతం - పాటల పాలవెల్లి బ్లాగుకు, ఆడియో ఫైలు సమకూర్చిన సఖియా.కాం బ్లాగుకు, చక్కని సాంకేతిక నైపుణ్యంతో తమిళ చిత్ర వీడియోకు ఆడియోను జతపరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి కృతజ్ఞతాభివందనములు.
Thk u for up-loading a good song of Ghantasala. I am happy to note that still the song is very popular in the public.
రిప్లయితొలగించండి