8, ఏప్రిల్ 2024, సోమవారం

భగవద్గీతాగానంలో ఘంటసాల శాస్త్రీయ సంగీత భావ రాగ రసావిష్కరణ

 

 భగవద్గీతాగానంలో ఘంటసాల శాస్త్రీయ సంగీత భావ రాగ రసావిష్కరణ

                        


                                 
ఎం.ఆర్.చంద్రమౌళి


కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగ వీచినట్లు, తీ

వలు తల లూచినట్లు , పసిపాపలు చేతులు చాచినట్లు , క్రొ

వ్వలపులు లేచినట్లు, చెలువల్ కడకన్నుల చూచినట్లు నీ

జిలిబిలి పాటలో పరవశించినవీ రసికప్రపంచముల్  (అమృతవర్ణిణి)

 

 ఇది ఘంటసాల గురించి తమ పద్యంలోని నాల్గవ పంక్తిని మార్చి కరుణశ్రీ కావ్యనామాంకితులైన జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు అన్న మాట. కలువలు పూచి కలిగించే కోమల భావం, పిల్లగాలులు వీచి అందిచ్చే హాయి ఘంటసాల గళంలో ఉంది. శిలనే కరిగించు ’శివశంకరి’ ని ఇప్పటికీ జగత్తు మెచ్చుకొని, అనుకరించి అరాధిస్తున్నదంటె ప్రకృతియే పరవశమై ఆహా! ఇదికదా, నాదమంటే అని ’తీవలు తలలూపుతాయి’. ఈ గంధర్వకంఠుడు తన జీవన సంధ్యలో ఆంధ్రులకు అవిస్మరణీయమైన కానుకగా భగవద్గీతను ఇచ్చి తన గాత్రవిశ్వరూపాన్ని మనకు మిగిల్చిపోయిన స్వరచిరంజీవి.

ఘంటాసాలలో ఒక్క మహాగాయకుడు, ఒక శాస్త్రీయ సంగీత వేత్త, ఒక కవి, ఒక దేశభక్తుడు, ఒక్క హరికథా విద్వాంసుడు ఉండడమే గాక, తన గాత్రంలో నవరస భావాలను అపరోక్షంగా చూపగల నాట్యకోవిదుడూ ఉన్నాడు. ఈ ప్రతిభా విశేషాలన్నీ కృష్ణార్జున సంవాదరూపంలో నాటకీయ భావనిర్మాణంతో, రాగ రత్నాలతో పండించబడినదే భగవద్గీతాగానం.

 భగవద్గీతనూ ఎందరెందరో ఎన్నెన్నో విధాలుగా పాడినా, ఇప్పటికీ  చెవులకు ఘంటసాల గీతాలాపమే అందరి వీనులవిందుగా ప్రతిధ్వనిస్తున్నది.  దానికి కారణం, నాదోపాసనతో జీవించి నాదోపాసనతో జీవితాన్ని ముగించి, తన నాదోపాసన పూర్ణఫలాన్ని గీతామృతంలో పండించుకొనడం. భగవద్గీతలో ప్రముఖమైన అష్టోత్తరశత శ్లోకాలను ఎంపికచేసుకొని, తన ప్రత్యేకమైన పద్యాలాపన పద్ధతిలో సుమారు 50 రాగాలలో ఆ శ్లోకాలను స్వరబద్ధంచేసి ఆలపించారు.

చిన్నతనంలో తండ్రిగారితో నారాయణ తీర్థ తరంగాలను భజన సంప్రదాయంలో పాడుకొనుటయే ఘంటసాల సంగీతానికి పునాది. మృదంగ వాదనాన్ని తండ్రివద్ద నేర్చుకొని ముద్దుగా నర్తించే చిన్నఘంటసాలను ’బాల భరతు’డనేవారట. విజయనగరం సంగీత కళాశాలలో మరియు పట్రాయనివారివద్ద  ప్రాప్తించిన శిక్షణఫలము, స్వశక్తితో సాధించిన నాదోపాసన రహస్య గ్రహణం, జీర్ణించుకొన్న శాస్త్రీయ సంగీత పరిమళం, ఇవన్నీ ఆయన ప్రవైటు పాటలలో, పద్యాలలో – చలనచిత్ర లలిత సంగీతంలో గుబాళిస్తూనే ఉండేది. అల్లరి పాటలైనా అష్టపదులైనా, జానపద గీతియైనా, జావళియైనా, హరికథలైనా, కీర్తనలైనా, యుగళగీతాలైనా, లఘుసంగీతమైనా ఆయన కంఠంలో జీవంపోసుకొని స్వరాల వరాలనిచ్చి మనసును దోచుకొంటాయి. మనమే ఆ పాటలను పాడుకొనేలా చేస్తాయి. ఈ వైవిధ్యాలకు మూలకారణం ఆయన శాస్త్రీయ సంగీత జ్ఞానాన్ని శోధించి మనోరంజకంగా మలచుకొన్నరీతి. అంతేనా? దానికి తోడుగా దైవదత్తమైన మూడుస్థాయిలలో ముద్దుగా పలికే అనితరసాధ్యమైన కంచుకంఠం? ఆ రసాద్ర స్వరాలకు వన్నెతెచ్చే పరిశుద్ధమైన ఉచ్ఛారణ!  సాహిత్యంలోని పదాలకు సందర్భోచితంగా భావగంగాజలంతో అక్కడే అభిషేకం చేసి, కలిగించే అద్భుతమైన ఆప్యాయత. అంతేనా? ఘంటసాల గానరసావిష్కరణ మాటలకందనిది. ఆయన  పలికింది గీతమైనా శ్లోకమైనా ఆ గానంతో సమ్మిళితంగా ఒక్క నటన, అభినయము కూడా అగోచరంగా  అనుభవానికి వస్తుంది. తెరమీద కథానాయకులు ఘంటసాల గానానికి పెదవులు కలిపి రసానుభూతిని కలిగించే నటనలో సగంపాలు నటన ఘంటసాల గానంలోనే ఉంటుంది అన్న మాట తథ్యమే.

కర్ణాటశాస్త్రీయ సంగీతంలోని రాగాలన్ని ఘంటసాలకు వెన్నెతో పెట్టిన విద్య. హిందూస్థాని సంగీతపు మధురమైన ఎన్నో రాగాలను తన సాధన మరియు ప్రతిభతో స్వంతంచేసుకోవడం జరిగింది. ప్రారంభదశలో ఆకాశవాణిలో తను గానంచేసింది కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నే. కర్ణాటక శుద్ధరాగాలైన హిందోళ, ఆరభి, ఆభోగి, అమృతవర్షిణి, హంసధ్వని, మోహన, ఉదయరవిచంద్రిక లాంటి ఔడవరాగాలను, బిలహరిలాంటి ఔడవ-సంపూర్ణ రాగాలను, శంకరాభరణం, కల్యాణి, చారుకేశి, సింహేంద్రమధ్యమం, షణ్ముఖప్రియ, తోడి మొదలైన మనోధర్మానికి తగిన మేళకర్తరాగాలను, రసప్రధానములైన అఠాణా, కేదారగౌళాది రాగాలను,  భగవద్గీలో సందర్భానుసారంగా ప్రయోగించారు. 20-30 సెకెండ్లలోనే ఆ రాగాన్ని ఆలపించి అందులోని జీవస్వరాలను పట్టి శ్లోకంలోని భావాన్ని, రసాన్వితంగా ఆవిష్కరించడం ఆయనకే చెల్లు. ఇంతేగాక,  గుర్జరి తోడి, జోన్పురి, మాల్కౌంస్, మధువంతి, దుర్గా, దేశ్, చంద్రకౌంస్, రాగేశ్వరి లాంటి అపురూపమైన హిందూస్థాని రాగాలనూ తన బాణీకి మార్చుకొని శ్లోకాలను గానంచేయండం ఒక ఎత్తైతే, అందులో వీర, కరుణ, అద్భుత, శాంత రసాలనూ, వైరాగ్య, ఉపదేశ, నిర్వేదాది భావాలను పండించింది మరొక ఎత్తు. గీతాగానాన్ని వింటునట్టే మన కళ్ళముందర కృష్ణార్జున సంవాదమూ, ఉభయసైన్యాల కోలాహలమూ, విశ్వరూపముయొక్క అద్భుతానుభవము తారసిల్లుతాయి.   తన గాత్రంలో ’నాభి హృత్ కంఠ రసన నాసాదులలో శోభిల్లు సప్తస్వర’ అన్న త్యాగరాయ వచనంలా ఘంటసాల తన నాదసర్వస్వాన్ని గీతాగానంలో పరిపాకంచేశారు.

  తనకు అతి ప్రియమైన రాగాలలో పంతువరాళి (కామవర్థిని) ఒకటి.  గాంధార దైవత పంచమాలు ఈ రాగానికి జీవస్వరాలు. సనిదపా మగమపా - దినకరా శుభకరా గమగా దేవ రిగగమ గరిసా దీనాధార రిగగ మాపాద తిమిర సంహార (దినకరా శుభకరా). పుష్పవిలాపంలోని " గాలిని గౌరవింతుము సుగంధము పూసి", శ్యామలాదండకంలో " కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతా పుష్పసందోహ సందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారు గోరోచనాపంక కేళీ లలామాభిరామే సురామే రమే", పల్నాటియుద్ధంలో నిర్వేదభావాన్ని పండించి పాడిన "పుట్టింపగలవు నిప్పుకల కుప్పల మంట, దరిలేని జలధి మధ్యంబునందు, కల్పించగలవు మేఘములేని పిడుగులు, అవధి లేనట్టి బ్రహ్మాండమందు, సృష్టించ గలవు దాక్షిణ్య పుణ్యగుణంబు కోడె బెబ్బులి మునికోరలందు…" . కామవర్ధిని  అంటే కోరికలను పెంచేది అని శబ్దార్థం. ఆ మాట అక్షరాల సత్యమయ్యేది ఆ రాగాన్ని ఘంటసాల పాడితే మళ్ళి మళ్ళీ వినాలనే కోరిక వర్ధిస్తుంది.  భగవద్గీతాగానం ఈ రాగంతోనే మొదలవుతుంది.  పాపాప మమపా మపా మపమగా గగమాగ రీరీససా (పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం) నీగాగ గగగా రిగామమమా (వ్యాసేన గ్రథితాం పురాణమునినాం) మాపా మపాదాపపా( మధ్యే మహాభారతమ్) మపదనీ నీనిని మా పమప నీ సాసాస సారీససా (అద్వైతామృత వర్షిణీం, భగవతీం అష్టాదశాధ్యాయినీం) నిసరిగా….(రిగరిగామగరిస).. దనిసగామగరిమ ..గరిసా (అంబా..) సా గరిసాససాస (త్వా మనుసంధదామి) ససస పసనిపా (భగవద్గీతే)  మప మాపగ (భవద్వేషిణీమ్) గగగ సానిదపమగా సగా గారిసా ( భగవద్గీతే భవద్వేషిణీమ్).  గానంచేసిన అన్ని శ్లోకాలకూ ఘంటసాల స్వరాలను రాసుకొనేవారు. అంటే పాటలకు బాణి కట్టినట్టే, శ్లోకాలనూ స్వరపరిచియుంటారు. స్వరాలను రాసుకొన్న ఆ పుస్తకం ప్రజలకు అందితే సంగీత విద్యార్థులకు అదొక మహోపకారమే ఔతుంది.

మాస్టారు,ఒకే రాగంలో రెండు మూడు శ్లోకాలను గానంచేసినపుడు, ఆ రాగంయొక్క జీవస్వరాలను అందుకొని ప్రతిశ్లోకాన్నీ విభిన్న స్వరాలతో ప్రారంభిస్తారు. సింహేంద్రమధ్యమ రాగంలో ’ సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం’ ’సనీ సరీరి గరిరీస సాసానిపా దనీదపా’ అని పై షడ్జంతో ప్రారంభించి అందరిలో భగవంతుడు సమంగా నివసించియున్నాడు అనే ఘోషవాక్యంలా ఆ శ్లోకం మనకు వినిపిస్తే,  యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోక ఇమం రవిః’ – గరీ సరీగ రీగరిరి  రీసానీస రిసా సససా..  ఒక అద్భుతమైన సంగతిని ఇప్పుడు చెప్పుతున్నాను’ వినండి అనే భావం ప్రారంభంలోని పై స్థాయి గాంధారంలో పలికి, మన మనస్సును తాకి, రెందు మూడు స్వరాల విన్యాసక్రీడలో సిద్ధాంతాన్ని నొక్కి చెప్పే విధానం వినేవాళ్ళకు అనుభవానికి వస్తుంది.

గీతాగానంలో ఘంటసాల ప్రయోగించిన సరికొత్త రాగాలాలో హేమంత్ రాగం బహురంజకమైనది. ఆ రాగంలో ఆలపించిన గీతాశ్లోకాలే  “ అహమాత్మా గుడాకేశ (సససాసా దనీసాస) సర్వభూతాశయస్థితః (సానిదాదా నిదా మమమా) అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ|| వేదానాం సామవేదోస్మి (మామామా గాగమామామా) దేవానామస్మి వాసవః. ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా৷.  ఇక్కడి ఆలాపనలో పూర్ణమైన రాగభావాన్ని నింపియున్నారు. తెలుగు సినిమాలలో గాని కర్ణాటక సంగీతంలో ఒక కాల పరిధిలో అంటే 1960-75 ప్రాంతంలో ఘంటసాల తప్ప దాక్షిణాదిలోని అన్య సంగీతదర్శకులలో ఈ రాగం వినబడదు. ’అమ్మ” సాక్షచిత్రంలో “యేమి వర్ణింతువోయి కవిరాజ” అనే పద్యం ఈరాగంలోనిదే. “హేమంత్” ఘంటసాలకు ప్రియమైన అపరూప రాగం. ఇది మాండ్ రాగంలా వినిపించినా ఒక చిన్నతేడా ఉంది. మాండ్ ఆరోహణంలో ఉన్న పంచమం హేమంత్ లో లేదు. సగమదనిస’ ’సనిదపమగరిస’ అనే శంకరాభరణ జన్య రాగస్వరాలు గల రాగమిది. గాంధార మధ్యమాలు రాగానికి జీవస్వరాలు. రహస్యం చిత్రంలోని ’సాధించ నౌన జగాన’, ’శకుంతల’ చిత్రం లోని సరసన నీవుంటే జాబిలి నాకేల,  పుణ్యవతి చిత్రంలో “మనసు పాడింది సన్నాయి పాట, వేంకటేశ్వర వైభవం లోని  శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే" శ్లోకం, ఇవన్నిటినీ మాస్టారు హేమంత్ రాగంలో స్వరబద్ధం చేశారు. ఇందులోని హేమంత్ రాగాన్ని గురించిన ప్రత్యేకమైన వ్యాసంలో మరింత వివరాలను చూడవచ్చు.  ఘంటసాల పద్యాలాపన సర్వదా శాస్త్రీయ పద్ధతిలోనే నడుస్తుంది. శాస్త్రీయ పద్ధతి అంటే ఆరోహణ అవరోహణ నిబద్ధమైన ఆలాపన. ఒక చిత్రంలోని పాటలు ఇతర సంగీత దర్శకులచే స్వరబద్ధం చేయబడిననూ ’పద్యాలను మాత్రం’ ఘంటసాలగారే స్వరబరుచుకొన్నారేమో అనిపిస్తుంది. హేమంత్ రాగం శాస్త్ర్రీయంగా అంత ప్రసిద్ధికిరాలేదు. ఇప్పటి ఘంటసాల స్వరయుక్తం చేసిన పాటలు పద్యాలు మాత్రమే ఆ రాగనికి మాతృకలై నిలిచాయి అనడం అతిశయోక్తికాదు.

సంగీత దర్శకుడిగా ఘంటసాల సృష్టించిన బాణీలలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. శాస్త్రీయ, జానపద, ప్రేమ, విషాదాది భావాలొలికించే ఏ పాటగాని, ఆయన చేసిన స్వరసంయోజన ఆ పాటలను సరాగంగా పాడుకొనేదాని అనువుగా ఉంటుంది .  శ్లోకాలను పాడే పద్ధతికి ఒక పాఠ్యక్రమాన్ని ఆయన సృష్టించారు. కంద, వృత్త, సీసపద్యాలను పాడే వేళ అందులోని పదాలు, అర్థము రాగాలాపనాప్రవాహంలో కొట్టుకుపోక,  సాహిత్య భాగాన్ని సుస్పష్టంగా పలికి, అర్థపుష్టికి ఏ మాత్రమూ భంగము వాటిల్లక, క్లుప్త గమకాల స్పర్శతో రాగస్వరాలను అమర్చి, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా పద్యగాన పద్ధతిని సంస్కరించారు. ఎంతో ఆలోచన, సాధన, సంస్కారము లేనిదే ఇలాంటి మార్పు సాధ్యంకాదు. ఈ సిద్ధి ఆయనకు ఎలా కలిగిందని ఆలోచిస్తే, ఆయన మాటలలోనే ఆ సిద్ధికి కారణం మనకు గోచరిస్తుంది. ఈ క్రిందనున్న మాటలు ఘంటసాలగారివి. ఆయన మాటలలోని లోతుని, సంగీతపరంగా చెప్పిన సూక్ష్మాలనూ గమనిస్తే, లలితసంగీతానికి, పద్యవాచన పద్ధతికి కావలసినదేమో, శాస్త్రీయతను వదలక, రంజకత్వాన్ని ఎలా సాధించారో మనకు తెలుస్తుంది.

“సంగీత గాయకులు, బోధకులు, గురువులు ఎందరో ఉన్నా, నాదాన్ని ఎలా ఉపాసన చేయాలి, భగవంతుడు మెచ్చే నాదం ఎలా ఉపాసన జేస్తే వస్తుంది, ఆ ప్రణవనాద సాధన ఎలా చేయాలి, ఆ ఉపాసన విధానమేమి అనేదాన్ని నా గురువు రేయనక పగలనక నాకు వినిపించి భోధించారు. నన్ను కూర్చోబెట్టుకొని “ సాంబసదాశివ సాంబసదాశివ” అంటూ దానిలో నాదాన్ని ఎలా పూరించాలి, నాభిస్థానం నుండి ఎలా నాదం రావాలి” అనే రహ్యస్యాన్ని వంటబట్టించారు. అప్పుడే మన పాట జనరంజకమూ భగవత్ప్రియమూ కాగలదు అనే సత్యాన్ని గ్రహించాను. ఈ సాధనక్రమం రెండు మూడు సంవత్సరాలు సాగింది."  "త్యాగరాజస్వామి ఏయే రాగాలను ఏయే భావాలకు వాడాడో, అలా రాగాలను ఏ భావానికి ఏ రాగం అని ఆయనకు భగవద్దత్తమై స్ఫురించిందొ, (దానిమూలంగా) ఈ రోజుకూ త్యాగయ్య సంగీతం నిలుచుందో అలా ఏ భావానికి ఏరాగం వాడాలి, ఎలా పాడితే అవి శాశ్వతంగా నిలుస్తాయి అని ఆలోచించి, ఆ భావాన్ని ఆధారం చేసుకొని, (ఎన్నో పాటలను శుద్ధ శాస్త్రీయంగా చేసి), ఆధునికంగా కలగలుపు వచ్చినా ప్రముఖంగా ఏదో ఒక్క రాగాన్ని తీసుకొని, దానికి భావప్రకటనకు సంబంధించిన కొన్ని అన్యస్వరాలను చేర్చినా" ..." నేను చేసినదాంట్లో శాస్త్రీయత లేదు అనేదానికి అవకాశం లేకుండా (నా సంగీత సంయోజన జరిగింది)".

ఈ వ్యాసం కరుణశ్రీ పద్యంతో ఆరంభమైనది. ఆ కవివాణితోనే ముగిస్తున్నాను. ఘంటసాల  హృదయం రసరంజిని, ఆయన బాణీ మేఘరంజని, ఆయన వాణి జనరంజని. ఆయన మధుర మనోజ్ఞ సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు. ఏంతో ఇచ్చిన ఆయనకు మనమేమివ్వగలం- ఘంటసాల శతజయంతి సందర్భంగా ఆ మహాగాయకునికి మన కృతజ్ఞతను సమర్పించుకొందాం.

14, మార్చి 2024, గురువారం

ఆ మనసులోన ఆ చూపులోన - పల్లెటూరు నుండి ఘంటసాల

ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో తాతినేని ప్రకాశరావును దర్శకునిగా పరిచయం చేస్తూ 1952 లో నిర్మించిన చిత్రం పల్లెటూరు.



Thanks to RajasriTelugu for providing the video inYou Tube.




పల్లవి: ఆ మనసులోన ఆ చూపులోన


ఆ మనసులోన ఆ చూపులోన


పరుగులెత్తే మృదుల భావనా మాలికల


అర్థమేమిటొ తెల్పుమా!


ఆశ యేమిటొ చెప్పుమా!





చరణం: ఆ నడకలోన,


ఆ నడకలోన


దొరలు ఆ నునుసిగ్గు దొంతరలపై యొగ్గు


అంతరార్థము తెలుపుమా!


ఆశయము వివరింపుమా!





చరణం: ఆ కులుకులోన ఆ పలుకులోన


పెనవేసికొనియున్న


వెలికి రాలేకున్న


పెనవేసికొనియున్న, వెలికి రాలేకున్న 


తలపులేవో తెల్పుమా!


వలపులేవో చెప్పుమా!


వలపులేవో చెప్పుమా!





చరణం: ఆ సొగసులోన ఆ నగవులోన


తొగరువా తెర గప్పి చిగురించు కోరికల


ఆ..ఆ..ఆ..


తొగరువా తెర గప్పి చిగురించు కోరికల


మరుగదేమిటొ తెల్పుమా!


తెరగదేమిటొ చెప్పుమా!





చరణం: ఆ హృదిలో, నీ మదిలో


పొటమరించిన ప్రేమ దిటవుగా పాడుకొని


పరిమళించునె తెల్పుమా!


ఫలితమిత్తునె చెప్పుమా!


ఫలితమిత్తునె చెప్పుమా!


ఆ.. మనసులోన..


టౌను పక్కకెళ్ళొద్దురో - ఘంటసాల, జిక్కీ తోడికోడళ్ళు చిత్రం నుండి







11, మార్చి 2024, సోమవారం

శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ నుండి కుశలమా!

1966 సంవత్సరంలో విడుదలైన శ్రీ శంభు ఫిలింస్ సంస్థ నిర్మించిన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ చిత్రం నుండి ఘంటసాల మాస్టారు ఎస్.జానకి తో పాడిన కుశలమా నీకు (సంతోషంఅనే యుగళం  రచన  పింగళి, స్వరపరచినది  పెండ్యాల. చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, రేలంగి, లింగమూర్తి, జమున, గిరిజ, ఛాయాదేవి చిత్రానికి నిర్మాత డి.లక్ష్మీనారాయణ చౌదరి మరియు దర్శకుడు .కె.శేఖర్.




 యుగళగీతం:కుశలమా..కుశలమా..
  నిర్మాణం:శ్రీ శంభు ఫిలింస్
  చిత్రం : శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)
  సంగీతం : పెండ్యాల
  రచన : పింగళి నాగేంద్ర రావు
  గానం : జానకి, ఘంటసాల
    
 పల్లవి :జానకి:కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ.
   కుశలమా.. ఆ ఆ ఆ కుశలమా.. ఆ ఆ ఆ
   ఎటనుంటివో ప్రియతమా..
   నీ విలాసము, నీ ప్రతాపము, కుశలముగా..సిరి సిరి..
    
 చరణం:జానకి:నను నీ...వు, నిను నే...ను, తనివితీరగా, తలచుకొనీ.. ఈ. ఈ
   నను నీవు, నిను నేను, తనివితీరగా తలచుకొనీ
   పెనగొను ప్రేమలు విరిసికొనీ, తనువులు మరచేమా..ఆ ఆ ఆ
  ఘంటసాల:కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ.
   ఎటనుంటివో ప్రియతమా..
   నీ పరువము, నీ పరవశమూ, కుశలముగా..సిరి సిరీ..
    
 చరణం :ఘంటసాల:కలలోనో, మదిలో..నో.. ఓ పిలచినటుల నే, ఉలికిపడీ..
   కలలోనో, మదిలోనో, పిలచినటులనే ఉలికిపడీ
   ఉల్లము విసిరే, వలపుగాలిలో, మెల్లగ కదిలేమా..ఆ..ఆ ఆ
  జానకి:కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ.
   ఎటనుంటివో ప్రియతమా..
   నీ విలాసము..నీ ప్రతాపము కుశలముగా..సిరి సిరి..
    
 చరణం 3 :జానకి:కొలనెటనైనా కనుపించగనే ..ఏ ఏ ఏ.., తలతువా, నీ.. విజయేశ్వరినీ
   కొలనెటనైనా కనుపించగనే, తలతువా నీ విజయేశ్వరినీ
  ఘంటసాల:కలగానముతో నీ చెలి నేనని నాలో నిలీచితివే...
  ఇద్దరు:కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ.
   ఎటనుంటివో ప్రియతమా..కుశలమా..
   కుశలమా. ఆ ఆ

అనురాగరాశీ ఊర్వశీ–శభాష్ పాపన్నచిత్రం నుండి ఘంటసాల పి.సుశీల పాట

1972 సంవత్సరంలో విడుదలైన సౌభాగ్య కళా చిత్ర సంస్థ నిర్మించిన శభాష్ పాపన్న చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన అనురాగరాశీ ఊర్వశీ అనే యుగళగీతం  రచన ఆరుద్ర, స్వరపరచినది  ఎస్.పి.కోదండపాణి. చిత్రంలో తారాగణం జగ్గయ్య, సావిత్రి, విజయనిర్మల, నాగయ్య, రాజబాబు, విజయభాను చిత్రానికి నిర్మాత డి.రామారావు మరియు దర్శకుడు షహీద్ లాల్.


యుగళగీతంఅనురాగ రాశి.. ఊర్వశి
 చిత్రం:శభాష్ పాపన్న  (1972)
 సంగీతం:కోదండపాణి
 గీతరచయిత:ఆరుద్ర
 నేపధ్య గానం:ఘంటసాల, పి.సుశీల  
   
పల్లవి :ఘ:అనురాగ రాశి.. ఊర్వశి
  నా ఆనంద  సరసి..  ప్రేయసి
  నా ఆనంద  సరసి.. ప్రేయసి
 సు:మనసార వలచే మన్మధ..
  నా కనులందు వెలిగే దేవతా
  నా కనులందు వెలిగే దేవతా
   
చరణం:ఘ:మనసే పూచిన మధువనమైతే..  మమతే కమ్మని తావి సుమా.. 
  ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ
 సు:ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ
 ఘ:మనసే పూచిన మధువనమైతే.. మమతే కమ్మని తావి సుమా
  తనువే పొంగి తరంగమైతే..
  తనువే పొంగి తరంగమైతే.. తలపే నురగల జిలుగు సుమా..
 సు:మనసార వలచే మన్మధ.. నా కనులందు వెలిగే దేవతా
   
చరణం:సు:వయసే మంజుల వేణువు అయితే.. హొయలే మోహన గీతి సుమా
 ఘ:ఆ..... ఆ..... ఆ..... ఆ...... ఆ..... ఆ...... ఆ..
 సు:ఆ..... ఆ..... ఆ..... ఆ...... ఆ..... ఆ...... ఆ..
  వయసే మంజుల వేణువు అయితే.. హొయలే మోహన గీతి సుమా
  సొగసులు కర్పూర శిలలే అయితే
  సొగసులు కర్పూర శిలలే అయితే... వగలే అరని జ్యోతి సుమా.. 
 ఘ:అనురాగ రాశి.. ఊర్వశి ... నా ఆనంద  సరసి..  ప్రేయసి
   
చరణం:సు:మేఘము నీవై.. మెరుపును నేనై.. మృదుమాధుర్యం కురవాలి
 ఘ:రాగము నేనై..  రాగిణి నీవై...  రసవాహినిగా సాగాలి 
 సు:మనసార వలచే మన్మధ.. నా కనులందు వెలిగే దేవతా
  నా కనులందు వెలిగే దేవతా
 ఇద్దరు:ఆహహాహా హాహా హ హా
  ఊ హు హూ హు హూ హూ హు హూ

9, మార్చి 2024, శనివారం

ఇంతటి మొనగాడివని - కాంభోజరాజు కథ నుండి ఘంటసాల, సుశీల

1967 సంవత్సరంలో విడుదలైన అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన కాంభోజరాజు కథ చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన ఇంతటి మొనగాడివని అనే ఈ యుగళం  రచన సినారె, స్వరపరచినది  టి.వి. రాజు. ఈ చిత్రంలో తారాగణం శోభన్‌బాబు, ఎల్. విజయలక్ష్మి, గుమ్మడి, రమణారెడ్డి,రాజశ్రీ, అంజలీదేవి. ఈ చిత్రానికి నిర్మాతలు  డి.భాస్కరరావు-కె.భానుప్రసాద్ మరియు దర్శకుడు కె.కామేశ్వరరావు.

 చిత్రం:కాంభోజరాజు కథ (1967) 
  నిర్మాణం:అనంతలక్ష్మీ ప్రొడక్షసన్స్ 
  రచన: సి. నారాయణరెడ్డి 
  పాడినవారు: ఘంటసాల, సుశీల 
  సంగీతం: టి.వి. రాజు 
  అభినయం: శోభన్ బాబు, రాజశ్రీ 
     
 ప.సు:ఇంతటి మొనగాడవనీ ఇపుడే తెలిసిందిలే 
   ఇపుడే తెలిసిందిలే 
  ఘ: ఎంతటి మోనగాడవో ఇపుడేం తెలిసిందిలే 
   ఇపుడేం తెలిసిందిలే 
 చ.సు: కన్నులు నిన్నుగని కలువలు ఆయెనూ 
   తలపులు నిన్నుగనీ అలలై పోయెనూ 
  ఘ: కన్నుల బాసలనూ కమ్మని ఆశలనూ 
   నిన్న తెలుసుకున్నాను 
   నేడు కలుసుకున్నాను॥ ఇంతటి||
 చ>సు: నున్నని బుగ్గలలో నిన్నే చూసుకో 
   మెత్తని సిగ్గులనే మెల్లగ దోచుకో 
  ఘ: బుగ్గన చిటికేసీ - సిగ్గుల తెరతీసీ 
   నిన్ను దోచుకుంటానే - నిజం తెలుసుకుంటానే 
  సు: ఇంతటి మొనగాడవనీ 
   ఇపుడే తెలిసిందిలే - ఇపుడే తెలిసిందిలే 
  ఘ: ఇంతటి నెఱజాణవని - ఎపుడో తెలిసిందిలే 
   ఎపుడో తెలిసిందిలే

2, మార్చి 2024, శనివారం

పిలిచెనొక చిలుకా - ఘంటసాల, సుశీల పాడిన "దొంగనోట్లు" అనువాద చిత్రం నుంచి

 1964 సంవత్సరంలో విడుదలైన ఉషా సంస్థ నిర్మించిన దొంగ నోట్లు అనువాద చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన పిలిచెనొక చిలుకా అనే ఈ యుగళగీతం రచన అనిసెట్టి, స్వరపరచినది  పెండ్యాల శ్రీనివాస్. ఈ చిత్రంలో తారాగణం ఎం.జి.ఆర్, బి.సరోజ. ఈ చిత్రానికి నిర్మాత అలభ్యం మరియు దర్శకుడు కె.శంకర్. ఈ పాటను భద్రపరచి అందించిన “బ్యాంక్ ఆఫ్ ఘంటసాల” వారికి ప్రత్యేక ధన్యవాదాలు.



నిర్మాణం:ఉషా వారి
 చిత్రం:దొంగనోట్లు (1964) - అనువాద చిత్రం
 రచన : అనిసెట్టి
 పాడినవారు : ఘంటసాల, సుశీల
 అభినయం : యం.జి. రామచంద్రన్, బి.సరోజాదేవి
 సంగీతం: పెండ్యాల శ్రీనివాస్
   
ప.ఘ: పిలిచెనొక చిలుక, చెలియే మల్లియల మొలక
  హంసవలె నడకా.., అందముల నొలుకా.., హోయ్
  పిలిచెనొక చిలుకా... ఆ.. మల్లియల మొలకా
 సు: పాడెనొక కవియే - నన్నే, పాటవినమనియే
  కాంతునకు గురువా-స్నేహముల నెలవా.. హో..య్
  పాడెనొక కవియే - నన్నే, పాటవినమనియే
  కాసులకు గురువా-స్నేహముల నెలవా.. హోయ్, హోయ్, హోయ్, హోయ్
  పాడెనొక కవియే - నన్నే, పాటవినమనియే
   
చ.ఘ: నాలోన మైకం నించు సోయగమే..ఏ.. యెదను
  లాలించే చల్లని రాగం మంజులమే
 సు:విరహిణియౌ కలువను గాంచి
  వెలుగులతో చంద్రుడు నించె
  ఒక చూపును హృదయమ్మంతా దోచెడువాడు
  నా ప్రియుడేలే
 ఘ:పిలిచెనొక చిలుకా చెలియే మల్లియల మొలకా
  హంసవలె నడకా..ఆ. అందముల నొలుకా హోయ్, హోయ్, హోయ్, హోయ్
 సు:పాడెనొక కవియే, నన్నే పాట వినమనియే
   
చ.సు: మధురాశల జ్యోతుల వెలిగే మందిరమా - హృదయం
  మన ప్రేమ దేవతలాడే మంటపమా.ఆ. హో.య్
 ఘ:గగనంలో తారకయేనా, కనువిందౌ చంద్రికయేనా
  నా కోసం చెలియగ మారి నవ్వుల పువ్వుల నర్పించేనా
 సు:పాడెనొక కవియే, నన్నే పాట వినమనియే
  కాంతునకు గురువా, స్నేహముల నెలవా, హోయ్, హోయ్, హోయ్, హోయ్
 ఘ:పిలిచెనొక చిలుకా చెలియే, మల్లియల మొలకా
  హంసవలె నడకా, అందములనొలుకా, హోయ్, హోయ్, హోయ్, హోయ్
 సు: ఆహహ్హహహహా
 ఘ:ఓహో
 సు:లల్లలల లలలా
 సు: ఆహహ్హహహహా
 ఘ:ఓహో
 సు:లల్లలల లలలా

1, మార్చి 2024, శుక్రవారం

సోదరులారా! ఒహో సోదరులారా - నిరుపేదలు చిత్రం నుండి ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, పి.సుశీల పాట

 1954 సంవత్సరంలో విడుదలైన గోకుల్ పిక్చర్స్  వారి సంస్థ నిర్మించిన నిరుపేదలు చిత్రం నుండి ఘంటసాల మాస్టారుఎం.ఎస్.రామారావు-పి.సుశీల తో పాడిన సోదరులారా! ఒహో సోదరులారా అనే ఈ బహుగళం రచన అనిసెట్టి, స్వరపరచినది  టి.వి.రాజు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, జమున, ఆర్.నాగేశ్వరరావు, రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత దోనేపూడి కృష్ణమూర్తి మరియు దర్శకుడు టి.ప్రకాశరావు.



దేవీ నీ కరుణాకటాక్షమునకై - అంతస్తులు నుంచి ఘంటసాల పద్యం

 




పైకంతో కొనలేనిది - అంతస్తులు చిత్రం నుండి ఘంటసాల, సుశీల గీతం

 







విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)