#000 | పద్యం | భక్త శిఖామణి ప్రహ్లాదు |
---|---|---|
నిర్మాణం | శ్రీ సరస్వతీ మూవీస్ | |
చిత్రం: | శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965) | |
కలం: | రాజశ్రీ | |
స్వరం: | టి.వి.రాజు | |
గళం: | ఘంటసాల | |
భక్త శిఖామణి ప్రహ్లాదు కరుణించి | ||
ఆవిర్భవించిన ఆదిదేవ | ||
వరకల్పవల్లివై వసుధలో వెలసిన | ||
రమణీయరూప వరాహవదనా! | ||
దుష్టవిశిక్షణా! శిష్టసంరక్షణా! | ||
ఇంద్రాది వినుత సింహేంద్రమధ్యా! | ||
అణురూప బహురూప అఖిల లోకాధార | ||
వీరమోహన అవతారపురుషా | ||
ఆశ్రయించిన భక్తుల ఆర్తిదీర్చి | ||
పూజచేసెడివారికి ముక్తినిచ్చి | ||
దయతొ కాపాడునట్టి ఓ..ఓ..ద్వయతరూప | ||
సింహగిరివాస వరహనృసింహదేవా..ఆ...ఆ.. |
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
11, జనవరి 2025, శనివారం
భక్త శిఖామణి (పద్యం) - శ్రీ సింహాచలక్షేత్రమహిమ చిత్రం నుండి ఘంటసాల, బృందం

10, డిసెంబర్ 2024, మంగళవారం
మాస్టారు గానం చేసిన రామాయణ గాథ - వినరయ్యా రామకథా!
చిత్రం: | సతీ సులోచన (ఇంద్రజిత్) | |
రచన: | సముద్రాల రాఘవాచార్య | |
సంగీతం: | టి.వి.రాజు | |
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు | |
పల్లవి: | ఘంటసాల: | వినరయ్యా రామకథా! |
ఈ రఘుకుల మౌళి పుణ్యకథా | ||
వినరయ్యా రామకథా! | ||
బృందం: | రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం - 2 | |
చరణం: | ఘంటసాల: | దశరధ నృపతి సంతతి కోరి చేసె పుత్ర కామేష్టి |
దేవతలొసగిన పాయస మహిమా కలిగిరి నలుగురు సుతులూ | ||
బృందం: | వినరయ్యా రామకథా! | |
ఈ రఘుకుల మౌళి పుణ్యకథా | ||
వినరయ్యా రామకథా! | ||
చరణం: | ఘంటసాల: | దేవేరులు తమ కూరిమి సుతుల పెంచిరి కడు మురిపాన |
అరువది నాలుగు కళల నేర్చిరి గురువు వశిష్టుని కరుణా | ||
బృందం: | వినరయ్యా రామకథా! | |
ఈ రఘుకుల మౌళి పుణ్యకథా | ||
వినరయ్యా రామకథా! | ||
చరణం: | ఘంటసాల: | విశ్వామిత్రుడు దశరధ రాముని పంపగ కోరెను తనవెంటా |
క్రతు రక్షణకై రామలక్ష్మణులు కదలిరి కౌశికు వెంటా | ||
బృందం: | వినరయ్యా రామకథా! | |
చరణం: | ఘంటసాల: | యాగము గాచి, మిధిలకు సాగి, పతి శాపమున శిలయైయున్న |
సతి అహల్యకు తొలిరూపొసగె తన పదధూళి దాశరధి | ||
బృందం: | వినరయ్యా రామకథా! | |
చరణం: | ఘంటసాల: | జనకుని సభలో శివుని ధనువు చెరకుకోలవలె విరుగగజేసి |
సకల లోకములు సంతోషింప సీతను రాముడు పెండ్లాడె | ||
బృందం: | వినరయ్యా రామకథా! | |
చరణం: | ఘంటసాల: | చిననాడొసగిన వరముల బదులుగ కౌసల్యాసుతు కానలకంపి |
తన కొడుకునకు పట్టముగట్టగ దశరధునడిగెను కైకేయి | ||
తండ్రిమాట పరిపాలనసేయగ తమ్ముడూ, సీతయు వెంబడిరాగా | ||
సాకేతము విడి దినమొక చోటుగ చేరె పంచవటి రఘుమౌళి | ||
బృందం: | వినరయ్యా రామకథా! | |
చరణం: | ఘంటసాల: | సొంపుగ పర్ణకుటీరము వేసి, ఇంపగు పండ్లు, పూవులొసంగి |
అన్నమూ, నిదురా మాని లక్ష్మణుడు, అన్నావదినల సేవించే | ||
బృందం: | రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం | |
చరణం: | ఘంటసాల: | సౌమిత్రినిగని శూర్పణఖ, ప్రేమించుమని బాధింప |
చుప్పనాతి ముక్కు చెవులూ గోసి | ||
పంపెను మోహపు ఫలితముగా - 2 | ||
చరణం: | ఘంటసాల: | మారీచుడు బంగారు లేడియై, మసలగ ఆశ్రమ భాగానా |
పతిని లేడి కొనితెమ్మనె సీత, రాముడేగె కొని తేగా | ||
రాముడేగె కొని తేగా | ||
రాము గొంతుతో హా! లక్ష్మణా! హా! లక్ష్మణాయని | ||
అరచెను బిట్టుగా మాయావి | ||
అన్నకు తోడుగ పొమ్మని తమ్ముని ఆదేశించెను వైదేహీ..వైదేహి | ||
బృందం: | రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం | |
చరణం: | ఘంటసాల: | వదిన మాట కాదనగాలేక, వంచనయని నమ్మించగలేక |
గిరులు గీచి, ఇవి దాటి రాకుమని, వెడలెను మరది విధిలేక | ||
మారువేషమున సీతారాముల పర్ణశాల ముంగిట నిలచి | ||
భవతి బిక్షాందేహి! భవతి బిక్షాందేహి యటంచు | ||
రావణాసురుడు పిలచే… | ||
సాకీ: | ఘంటసాల: | బిచ్చము వేయగ వచ్చిన జానకి గడ్డతోడ పెకలించి హరించి |
ఆకశాన లంకాపురి జేరి అశోకవనిలో నుంచే.. | ||
బృందం: | రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం - 2 |

9, మార్చి 2024, శనివారం
ఇంతటి మొనగాడివని - కాంభోజరాజు కథ నుండి ఘంటసాల, సుశీల
1967
సంవత్సరంలో విడుదలైన అనంతలక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన కాంభోజరాజు కథ చిత్రం
నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన ఇంతటి మొనగాడివని అనే ఈ యుగళం రచన సినారె, స్వరపరచినది టి.వి. రాజు. ఈ చిత్రంలో తారాగణం శోభన్‌బాబు, ఎల్.
విజయలక్ష్మి, గుమ్మడి, రమణారెడ్డి,రాజశ్రీ, అంజలీదేవి. ఈ చిత్రానికి నిర్మాతలు డి.భాస్కరరావు-కె.భానుప్రసాద్ మరియు దర్శకుడు కె.కామేశ్వరరావు.
చిత్రం: | కాంభోజరాజు కథ (1967) | |||
---|---|---|---|---|
నిర్మాణం: | అనంతలక్ష్మీ ప్రొడక్షసన్స్ | |||
రచన: | సి. నారాయణరెడ్డి | |||
పాడినవారు: | ఘంటసాల, సుశీల | |||
సంగీతం: | టి.వి. రాజు | |||
అభినయం: | శోభన్ బాబు, రాజశ్రీ | |||
ప. | సు: | ఇంతటి మొనగాడవనీ ఇపుడే తెలిసిందిలే | ||
ఇపుడే తెలిసిందిలే | ||||
ఘ: | ఎంతటి మోనగాడవో ఇపుడేం తెలిసిందిలే | |||
ఇపుడేం తెలిసిందిలే | ||||
చ. | సు: | కన్నులు నిన్నుగని కలువలు ఆయెనూ | ||
తలపులు నిన్నుగనీ అలలై పోయెనూ | ||||
ఘ: | కన్నుల బాసలనూ కమ్మని ఆశలనూ | |||
నిన్న తెలుసుకున్నాను | ||||
నేడు కలుసుకున్నాను | ॥ ఇంతటి|| | |||
చ> | సు: | నున్నని బుగ్గలలో నిన్నే చూసుకో | ||
మెత్తని సిగ్గులనే మెల్లగ దోచుకో | ||||
ఘ: | బుగ్గన చిటికేసీ - సిగ్గుల తెరతీసీ | |||
నిన్ను దోచుకుంటానే - నిజం తెలుసుకుంటానే | ||||
సు: | ఇంతటి మొనగాడవనీ | |||
ఇపుడే తెలిసిందిలే - ఇపుడే తెలిసిందిలే | ||||
ఘ: | ఇంతటి నెఱజాణవని - ఎపుడో తెలిసిందిలే | |||
ఎపుడో తెలిసిందిలే |

1, మార్చి 2024, శుక్రవారం
సోదరులారా! ఒహో సోదరులారా - నిరుపేదలు చిత్రం నుండి ఘంటసాల, ఎం.ఎస్.రామారావు, పి.సుశీల పాట
1954 సంవత్సరంలో విడుదలైన గోకుల్ పిక్చర్స్ వారి సంస్థ నిర్మించిన నిరుపేదలు చిత్రం నుండి ఘంటసాల మాస్టారుఎం.ఎస్.రామారావు-పి.సుశీల తో పాడిన సోదరులారా! ఒహో సోదరులారా అనే ఈ బహుగళం రచన అనిసెట్టి, స్వరపరచినది టి.వి.రాజు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, జమున, ఆర్.నాగేశ్వరరావు, రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత దోనేపూడి కృష్ణమూర్తి మరియు దర్శకుడు టి.ప్రకాశరావు.
4, జులై 2020, శనివారం
ఓ ప్రియతమా! - సతీ సులోచన (ఇంద్రజిత్) చిత్రం నుండి ఘంటసాల, సుశీల

3, జులై 2020, శుక్రవారం
విరిసింది వింత హాయి - బాలనాగమ్మ నుండి ఘంటసాల, జిక్కీ

1, జులై 2020, బుధవారం
రంగు రంగుల పూలు - విచిత్ర కుటుంబం నుండి ఘంటసాల, సుశీల

30, జూన్ 2020, మంగళవారం
జననమందిన నాడె- పద్యం శ్రీ కృష్ణమాయ నుండి ఘంటసాల

25, జూన్ 2020, గురువారం
హాయిగా పాడనా - సప్త స్వరాలు నుండి ఘంటసాల, పి.బి.శ్రీనివాస్

24, జూన్ 2020, బుధవారం
రెండు చందమామలు - భామావిజయం నుండి ఘంటసాల, శోభారాణి పాడిన యుగళగీతం
చిత్రం: | భామావిజయం (1967) | |
రచన: | డా.సి.నారాయణ రెడ్డి | |
సంగీతం: | టి.వి.రాజు | |
గానం: | ఘంటసాల, శోభారాణి | |
పల్లవి: | ఘంటసాల: | రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే |
శోభారాణి: | ఊ..ఏవీ? | |
ఘంటసాల: | ఒకటి నీలి మొయిలులో -2 | |
వేరొకటి మేలిముసుగులో | ||
రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే | ||
చరణం: | ఘంటసాల: | ఓ జవ్వని! లోలోన ఏల నవ్వుకుందువే? |
తలిరాకులలో అందమేల దాచుకొందువే? | ||
శోభారాణి: | ఊ..హు.. ఊ..హు.. | |
ఘంటసాల: | ఓ జవ్వని! లోలోన ఏల నవ్వుకుందువే? | |
తలిరాకులలో అందమేల దాచుకొందువే? | ||
విరబూసిన పరువాలపు తెరచాటులేలనే? | ||
రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే | ||
చరణం: | శోభారాణి: | నీ చూపులు నను సోకగ మనసోపనైతిని |
నీ చేతులు నను తాకగ వికసించిపోతిని | ||
ఘంటసాల: | ఆహాహా.. ఓహో...ఊహు.. | |
శోభారాణి: | నీ చూపులు నను సోకగ మనసోపనైతిని | |
నీ చేతులు నను తాకగ వికసించిపోతిని | ||
ఏ దేవుని దీవెనయో నీదాననైతిని | ||
ఘంటసాల: | రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే | |
ఒకటి నీలి మొయిలులో, వేరొకటి మేలిముసుగులో | ||
రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే |

19, జూన్ 2020, శుక్రవారం
బలే బలే ఫలరసం - బాలనాగమ్మ నుండి ఘంటసాల, బృందం

17, జూన్ 2020, బుధవారం
ఈనాటి ఈ హాయి - జయసింహ చిత్రం నుండి ఘంటసాల, లీల

16, జూన్ 2020, మంగళవారం
విరిసింది వింత హాయి - బాలనాగమ్మ నుండి ఘంటసాల, జిక్కీ
నిర్మాణం | శ్రీ వేంకటరమణా ఫిలింస్ | |
---|---|---|
చిత్రం: | బాల నాగమ్మ (1969) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | టి.వి.రాజు | |
గానం: | ఘంటసాల, జిక్కీ | |
పల్లవి: | జిక్కీ: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి |
ఘంటసాల: | అందాల చందమామ చెంతనుంది అందుకే | |
జిక్కీ: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి | |
ఘంటసాల: | అందాల చందమామ చెంతనుంది అందుకే | |
ఇద్దరు: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి | |
చరణం: | ఘంటసాల: | వలపు పూబాలా చిలికించేను గారాలా -2 |
జిక్కీ: | అల చిరుగాలి సోకున మేను సోలి అందుకే | |
జిక్కీ: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి | |
ఘంటసాల: | అందాల చందమామ చెంతనుంది అందుకే | |
ఇద్దరు: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి | |
చరణం: | జిక్కీ: | జగతి వినుతించే యువ భావాల ఈసారి -2 |
ఘంటసాల: | ఇల పులకించె నే యెల సోయగాల అందుకే | |
జిక్కీ: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి | |
ఘంటసాల: | అందాల చందమామ చెంతనుంది అందుకే | |
ఇద్దరు: | విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి |

ఇంటిలోని పోరు ఇంతింత గాదయా - బాలనాగమ్మ నుండి ఘంటసాల

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం
కనుపించవా వైకుంఠవాసి - ఋష్యశృంగ నుండి ఘంటసాల, కోమల యుగళగీతం
నిర్మాణం: | గీతా పిక్చర్స్ వారి | ||
చిత్రం: | ఋష్యశృంగ (1961) | ||
రచన: | సముద్రాల జూనియర్ | ||
సంగీతం: | టి.వి.రాజు | ||
గానం: | ఘంటసాల, పి.లీల, ఎ.పి.కోమల | ||
నిర్మాత: | పి.ఎస్.శేషాచలం | ||
దర్శకత్వం: | ముక్కామల | ||
ఘంటసాల: | కనుపించవా వైకుంఠవాసి ననుబాసి పోయేవా | ||
ఆ..ఆ.. నీ బాస మరచేవా | | కనుపించవా | | ||
కోమల: | మునిబాలుని కనజాలనా నా యతనాలు సాగేనా | ||
ఓ.. అడియాస లాయేనా | |||
లీల: | స్వామి కరుణించెలే నేడు అరుదెంచులే | ||
ఇక పండేను నా నోములే | |||
ఓ..ఫలియించు నా ప్రేమలే | |||
ఘంటసాల: | వైకుంఠమాసలు చూపి నాలోన ఆశలు రేపి -2 | ||
నారాయణ ఈ తీరున మోసాలు చేసేవా ఆ..ఆ.. | |||
ననుబాసి పోయేవా ఆ..ఆ.. నీ బాస మరచేవా | |||
కోమల: | ఏ మౌన నా శపథాలే, ఇటులాయెనే ఫలితాలే -2 | ||
నారాయణ దయపూనవా, దరిచూపవా దేవా ఆ. | |||
యతనాలు సాగేనా, ఓ.. అడియాసలాయేనా | |||
లీల: | మాసిపోయేను ఈనాటి క్షామమే | ||
తాండవించేను ఏచోట క్షేమమే | | మాసిపోయేను | | ||
జగాలన్ని తేలేను ఆనందాలా..-2 | |||
పండేను నా నోములే, ఓ.. ఫలియించు నా ప్రేమలే | |||
ఘంటసాల: | కనుపించవా వైకుంఠవాసి ననుబాసి పోయేవా | ||
ఆ..ఆ.. నీ బాస మరచేవా |

11, జనవరి 2018, గురువారం
సిగలోన విరిసిన సౌగంధికా - భీమాంజనేయ యుద్ధం నుండి ఘంటసాల, సుశీల
నిర్మాణం: | మహాలక్ష్మీ మూవీస్ వారి | |
చిత్రం: | భీమాంజనేయ యుద్ధం (1961) | |
రచన: | డా. సి. నారాయణ రెడ్డి | |
సంగీతం: | టి.వి.రాజు | |
గానం: | ఘంటసాల, పి.సుశీల | |
పల్లవి: | ఘంటసాల: | సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందరయేల..ఆ.. |
సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందరయేల | ||
సుశీల: | సిగలోన విరిసిన సౌగంధికా చెలి జాగుచేయుట మేలా? | |
సిగలోన విరిసిన సౌగంధికా చెలి జాగుచేయుట మేలా? | ||
చరణం: | ఘంటసాల: | పసిడి కిరణములు మెరిసే వేళ -2 |
మిసిమి కోరికలు ఎగిసే వేళా..-2 | ||
మదిలో మరులేవొ కదిలే యీ వేళా -2 | ||
మాటైన కరువాయెనా..ఆ.. మాటైన కరువాయెనా | ||
సిగలోన విరిసిన సౌగంధికా చెలికింత తొందరయేల..ఆ.. | ||
చరణం: | సుశీల: | తనువు కోవెలగ వెలసిన వేళ - 2 |
ప్రణయవేదములు పలికే వేళా-2 | ||
మదిలో నాస్వామి కొలువైన వేళా-2 | ||
మాటలు ఇంకేలనో..ఓ..మాటలు ఇంకేలనో | ||
ఇద్దరు: | సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికి నీవే నవగీతిక | |
మా చెలిమికి నీవే నవగీతిక -2 |

15, జులై 2017, శనివారం
ఘంటసాల, బృందం గానం చేసిన వినరయ్యా రామకథా! - సతీ సులోచన నుండి
నిర్మాణం: | శ్రీకాంత్ ప్రొడక్షన్స్ | |
చిత్రం: | సతీ సులోచన (ఇంద్రజిత్) 1961 | |
రచన: | సముద్రాల రాఘవాచార్య | |
సంగీతం: | టి.వి.రాజు | |
గానం: | ఘంటసాల, బృందం |
పల్లవి: | ఘంటసాల: | వినరయ్యా రామకథా, శ్రీ రఘుకులమౌళీ పుణ్యకథా, వినరయ్యా రామకథా |
బృందం: | రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం (2) | |
చరణం: | ఘంటసాల: | దశరథ నృపతి సంతతి కోరి, చేసె పుత్రకామేష్టి |
దేవతలొసగిన పాయసమహిమా కలిగిరి నలుగురు సుతులూ.. | ||
బృందం: | వినరయ్యా రామకథా, శ్రీ రఘుకులమౌళీ పుణ్యకథా, వినరయ్యా రామకథా | |
చరణం: | ఘంటసాల: | దేవేరులు తమ కూరిమిసుతుల, పెంచిరి కడుమురిపాన |
అరువదినాలుగు కళలనేర్చిరి గురువు వశిష్టుని కరుణా..ఆ. | ||
బృందం: | వినరయ్యా రామకథా, శ్రీ రఘుకులమౌళీ పుణ్యకథా, వినరయ్యా రామకథా | |
చరణం: | ఘంటసాల: | విశ్వామిత్రుడు దశరథరాముని పంపగకోరెను తనవెంటా |
క్రతురక్షణకై రామలక్ష్మణులు కదలిరి కౌశికువెంటా..ఆ. | ||
బృందం: | వినరయ్యా రామకథా | |
చరణం: | ఘంటసాల: | యాగముగాచీ మిథిలకుసాగి, పతిశాపమున శిలయైయున్న |
సతి అహల్యకు తొలిరూపొసగే తనపదధూళీ దాశరథీ | ||
బృందం: | వినరయ్యా రామకథా | |
చరణం: | ఘంటసాల: | జనకునిసభలో శివునీధనువు చెఱకుకోలవలలే విరుగగజేసి |
సకలలోకములు సంతోషింప సీతను రాముడు పెండ్లాడె | ||
బృందం: | వినరయ్యా రామకథా | |
చరణం: | ఘంటసాల: | చిననాడొసగిన వరముల బదులుగ కౌసల్యాసుతు కానలకంపి |
తన కొడుకునకు పట్టమూగట్టగా దశరథునడిగెను కైకేయి | ||
తండ్రిమాట పరిపాలనసేయగ తమ్ముడూ, సీతయూ వెంబడిరాగా | ||
సాకేతమువిడి దినమొకచోటుగ చేరెపంచవటి రఘుమౌళీ | ||
బృందం: | వినరయ్యా రామకథా | |
చరణం: | ఘంటసాల: | సొంపుగ పర్ణకుటీరమువేసి, ఇంపగు పండ్లూ, పూవులొసంగి |
అన్నమూ, నిదురామాని లక్ష్మణుడు అన్నావదినల సేవించే | ||
బృందం: | రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం | |
చరణం: | ఘంటసాల: | సౌమిత్రినిగని శూర్పణఖా, ప్రేమించుమనీ బాధింపా |
చుప్పనాతి ముక్కుచెవులూగోసి పంపెను మోహపుఫలితముగా | ||
పంపెను మోహపు ఫలితముగా | ||
మారీచుడు బంగారులేడియై వదలగ ఆశ్రమభాగానా | ||
పతిని లేడి కొనితెమ్మనె సీతా, రాముడేగె కొనితేగా.ఆ., రాముడేగె కొనితేగా | ||
రాముబంటుతో "హా! లక్ష్మణా! హా! లక్ష్మణా"యని అరచెను బిట్టుగ మాయావి | ||
అన్నకు తోడుగ పొమ్మని తమ్ముని ఆదేశించెను వైదేహీ.ఈ. వైదేహీ | ||
బృందం: | రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం | |
చరణం: | ఘంటసాల: | వదినమాట కాదనగాలేక, వంచనయని నమ్మించగలేక |
గిరులుగీచి ఇవి దాటిరాకుమని వెడలెను మఱదీ విధిలేక | ||
మారువేషమున సీతారాముల పర్ణశాల ముంగిట నిలచీ | ||
"భవతీ భిక్షాందేహీ! భవతీ భిక్షాందేహి"యటంచు రావణాసురుడు పిలచే..ఏ.. | ||
సాకీ: | బిచ్చమువేయగ వచ్చిన జానకి, గడ్డతోడ పెకలించి హరించి | |
ఆకసాన లంకాపురిజేరి, అశోకవనిలో నుంచే | ||
బృందం: | రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం (4) |
