1957 లో పద్మశ్రీ భానుమతి గారి స్వంత సంస్థ, వారి కుమారుని పేరు మీద నెలకొల్పిన భరణీ పిక్చర్సు ద్వారా విడుదలైన చిత్రం "వరుడు కావాలి". ఈ సినిమాలో శ్రీ కొంగర జగ్గయ్య గారు, శ్రీమతి భానుమతి గార్లు నటించారు. సంగీత దర్శకులు శ్రీ రామనాథన్ గారు. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు పాడిన ఒకే ఒక పాట శ్రీమతి భానుమతి, శ్రీ పిఠాపురం నాగేశ్వర రావు గార్లతో కలసి పాడిన ఆహ్లాదకరమైన రావూరి సత్యనారాయణ గారి గీతం "అందచందాల ఓ! తారకా". రావూరి వారు 50 లలో చింతామణి, చక్రపాణి, వరుడు కావాలి చిత్రాలకు మాటలు కూడ వ్రాసారు. ఇదే చిత్రానికి భానుమతి గారు శ్రీ వ్యాసతీర్థ వ్రాసిన "కృష్ణా నీ బేగన బారో" అనే సుప్రసిద్ధమైన కన్నడ భక్తి గీతాన్ని, శ్రీమతి ఎమ్.ఎల్.వసంత కుమారి గారు "నమ్మించి మరి రాడే" అనే లలిత గీతాన్ని పాడారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి నిర్మించారు. తెలుగులో జగ్గయ్య గారు, తమిళంలో శివాజీ గణేశన్ నటించారు. అయితే తెలుగు వీడియో లభ్యంకాలేదు. తమిళ చిత్రం అందుబాటులో వుంది. అందువలన తమిళ వీడియో పై తెలుగు డబ్బింగు చేసి ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఈ సన్నివేశంలో శివాజీకి బదులు జగ్గయ్య గారిని ఊహించుకోండి. ఈ సన్నివేశంలో శివాజీ గారు గిటారు (అనుకుంటా) వాయిస్తూ పాడుతుండగా, మధ్యలో కాంపిటీషనుగా మరొక ప్రేమికుడు ప్రవేశిస్తాడు. ఇతనికి శ్రీ పిఠాపురం నాగేశ్వర రావు గారు నేపథ్య గానం చేశారు.
| చిత్రం: | వరుడు కావాలి (1957) | ||
| రచన: | రావూరి సత్యనారాయణ | ||
| సంగీతం: | జి.రామనాథన్ | ||
| గానం: | ఘంటసాల, భానుమతి, పిఠాపురం | ||
| ఘంటసాల: | ఆ..ఆ..ఆ.. | ||
| పల్లవి: | అందచందాల ఓ! తారకా, చేరరావే చెలీ నా దరీ | ||
| నా మదీ దోచినా రాణివీ | |||
| భానుమతి: | అందచందాల ఓ! జాబిలీ, చేరరావా ప్రియా నా దరీ | ||
| నామదీ దోచినా రాజువై | |||
| చరణం: | ఘంటసాల: | పూల తీరాల తూగాడు డోలవై | |
| డోలలూగే సరాగాల మాలవై | | పూల తీరాల | | ||
| తేలి రాగాలుగా తూలిరా పూవులా | |||
| తేనెలా సోనలా జాలువై | |||
| భానుమతి: | పూల తీరాల తూగాడు తేటివై | ||
| ఏటి రాగాల సాగేటి పాటవై | పూల తీరాల | | ||
| తేలిరా గాలుల తూలిరా పూవులా | |||
| తేనెలా సోనలా జాలువై | |||
| ఘంటసాల: | అందచందాల ఓ! తారకా, చేరరావా ప్రియా నా దరీ | ||
| నామదీ దోచినా రాజువై | |||
| అందచందాల ఓ! తారకా! చేరరావే చెలీ నా దరీ | |||
| నా మదీ దోచినా రాణివీ | |||
| పిఠాపురం: | ఆహహా.. ఓహొహో...ఆహహా.. ఓహొహో.. | ||
| ఓ ప్రేయసీ, నా ప్రేయసీ సిసలైన గోల్డు మన ప్రేమ | |||
| నా కోహినూర్ డైమండువే నా తలపైన కూర్చోవే | |||
| తన్నన్ననానా.. తన్నన్ననానా | |||
| ఓ ప్రేయసీ, నా ప్రేయసీ సిసలైన గోల్డు మన ప్రేమ | |||
| నా కోహినూర్ డైమండువే నా తలపైన కూర్చోవే | |||
| భానుమతి: | తన్నన్ననానా.. తన్నన్ననానా | ||
| సందేహమా! ఓ దేహమా! మరి ప్రేమంటే లోహమా! | |||
| నీ అందము, నా చందము మెచ్చేనోయి ఓ వామనా! | |||
| తన్నన్ననానా.. తన్నన్ననానా | |||
| తన్నన్ననానా.. తన్నన్ననానా | |||
| సందేహమా! ఓ దేహమా! మరి ప్రేమంటే లోహమా! | |||
| నీ అందము, నా చందము మెచ్చేనోయి ఓ వామనా! | |||
| ఒహ్హొహొ హోహో.. అహ్హహ్హ హాహా.. | |||
| పిఠాపురం: | ప్రేమించవా, పాలించవా, దయరాదా నా మీద | ||
| సంసారమో, సన్యాసమో ఇక తేల్చాలే ప్రియరాలా | |||
| భానుమతి: | అహ్హహ్హ హాహా.. | ||
| పిఠాపురం: | ఒహ్హొహ్హొ హోహో.. |
కృతజ్ఞతలు: సినిమా పోస్టరు, వివరాలు పొందుపరచిన ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి, ఆడియో ఫైలు సమకూర్చిన సఖియా.కాం కు, వీడియో అందుబాటులో ఉంచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి.


పాట చాలా మధురముగా ఉన్నది.. మంచి పాటను వినిపించారు ధన్యవాదములు...
రిప్లయితొలగించండిధన్యవాదములు Prince గారు.
తొలగించండివరుడు కావాలి చిత్రంలోని ఘంటసాల భానుమతి గారలు పాడిన అందచందాల ఓ తారక ప్రెసెంట్ చేసినందులకు ధన్యవాదాలు.చాల బాగుంది. తెలుగు వెర్షన్ దొరకక పోయినా తమిళ్ వెర్షన్ తీసుకొని పోస్ట్ చేసారు. మీకు అభివందనలు. వెంకోబ రావు
రిప్లయితొలగించండిధన్యవాదాలు వెంకోబ రావు గారు.
తొలగించండిThank you for the trouble taken to print Telugu song on Tamil Video for us.We enjoyed a lot
రిప్లయితొలగించండిRadharao garu, glad you liked it. Thanks for your response.
తొలగించండిin telugu movie it is Ramana reddy for whom pithapuram sang.
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారు, కొత్త విషయం చెప్పినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిPlease upload this movie varudu kavali it's a thank u🙏🙏🙏🙏
రిప్లయితొలగించండిపాత పాటలు ప్రేమికుడు గా మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను ��������
రిప్లయితొలగించండిఆహ్లాకరమైన ఈ పాట విని చాలా ఆనందపడ్డారు.
రిప్లయితొలగించండి