1972 లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రం శ్రీ వేంకటేశ్వర వైభవం. ఈ చిత్రంలో తిరుమల మరియు తిరుపతిలో గల యాత్రా స్థల విశేషాలు, యాత్రికులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, చూడవలసిన ప్రదేశాలు, ఆలయములో స్వామివారికి జరిగే నిత్య సేవల వివరాలు కళావాచస్పతి శ్రీ కొంగర జగ్గయ్య గారి వ్యాఖ్యానంతో వివరించబడ్డాయి. సంగీతాన్ని శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు సమకూర్చారు. ఘంటసాల, మంగళంపల్లి, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలు, సుశీల, విజయలక్ష్మి, శ్రీరంగం గోపాలరత్నం, బి.వసంత తదితరులు నేపథ్య గానం అందించారు. ఆచార్య ఆత్రేయ, సి.నా.రె., ఏడిద కామేశ్వరరావు గార్లు పాటలు, డి.రామారావు గారు పద్యాలు వ్రాసారు. ఆచార్య ఆత్రేయ వ్రాయగా, ఘంటసాల మాస్టారు పాడిన ఏడుకొండల శ్రీనివాసా అనే భక్తిగీతం నాలుగవ భాగం వీడియోలో వస్తుంది. వెంకటేశ్వర సుప్రభాతం మొదటినుండి వినడానికి ఇంతకు ముందు పోస్టు చేసిన
మొదటి, రెండవ భాగాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మూడవ భాగం
Thanks to "nikilkvn" for kindly loading this video to You Tube.
నాలుగవ భాగం
Thanks to "nikilkvn" for kindly loading this video to You Tube.
చిత్రం: శ్రీ వేంకటేశ్వర వైభవం (1971)
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: సాలూరు రాజేశ్వర రావు
గానం: ఘంటసాల, బృందం
ఈ పాట వీడియో నాలుగవ భాగంలో 3 నిముషాల 10 సెకండ్లకు మొదలవుతుంది.
| పల్లవి: | ఘంటసాల: | ఏడుకొండల శ్రీనివాసా! |
| ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా! | ||
| ఏడేడు జన్మల పాపముల నెడబాపి బ్రోచే వేంకటేశా! ఆ.. ఆ.. | ||
| చరణం: | ఘంటసాల: | కోటికీ పడగెత్తినా ధనవంతుడూ |
| బృందం: | కోటికీ పడగెత్తినా ధనవంతుడూ | |
| నీ గుడి ముంగిటా సామాన్యుడూ | ||
| కూటికోసం శ్రమపడే నిర్భాగ్యుడూ | ||
| బృందం: | కూటికోసం శ్రమపడే నిర్భాగ్యుడూ | |
| నీ కృపకెప్పుడూ సమ పాత్రుడూ | ||
| బృందం: | ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా! | |
| గోవిందా! గోవిందా! | ||
| చరణం: | ఘంటసాల: | మమకారాలూ వుండరాదని మా తలనీలాలు తీసుకొందువు |
| నీది నాదని ఏది లేదని నిలువుదోపిడి వొలుచుకొందువు | ||
| వెళ్ళునపుడూ వెంటరాదని ముడుపులన్నీ ఊడ్చుకొందువు | ||
| అడుగడుగునా.. అడుగడుగునా వేదాంతమున్నది | ||
| నీ ఆరాధనలో సాధనున్నది | ||
| బృందం: | ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా! | |
| గోవిందా! గోవిందా! | ||
| చరణం: | ఘంటసాల: | ఆసేతు సీతాచలము నీవే దైవము |
| బృందం: | ఆ..ఆ..ఆ..ఆ.. | |
| ఘంటసాల: | ఆబాల గోపాలమ్ము నిన్నే కొల్తుము | |
| బృందం: | ఆ..ఆ..ఆ..ఆ.. | |
| ఘంటసాల: | నీ దివ్య మంగళ రూపము | |
| బృందం: | ఆ..ఆ..ఆ..ఆ.. | |
| ఘంటసాల: | మా నిత్య దర్శన తేజము | |
| బృందం: | ఆ..ఆ..ఆ..ఆ.. | |
| ఘంటసాల: | నీ పాద పద్మ యుగళము | |
| బృందం: | ఆ..ఆ..ఆ..ఆ.. | |
| ఘంటసాల: | సంసార సాగర తరళము | |
| బృందం: | ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా! | |
| ఘంటసాల: | ఏడేడు జన్మల పాపముల నెడబాపి బ్రోచే వేంకటేశా! ఆ.. ఆ.. | |
| బృందం: | ఏడుకొండల శ్రీనివాసా! మూడు మూర్తుల తిరుమలేశా! |


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి