1963 లో వచ్చిన పౌరాణిక చిత్రం శ్రీ కృష్ణార్జున యుద్ధం. ఇది గయోపాఖ్యానం ఆధారంగా వచ్చిన చిత్రం. ఒకనాడు ఉదయాన శ్రీకృష్ణుడు సూర్యదేవునకు అర్ఘ్యం ఇస్తుండగా, మణిపురాన్ని ఏలే గయుడనే గంధర్వ రాజు పుష్పక విమానంలో ఆకాశమార్గాన వెళుతుంటాడు. అతడు విలాసవంతుడై, పరిచారికలతో సరస సల్లాపాలాడుతూ, భుజించి, తాంబూలం వేసుకుని, నమలిన పిప్పిని క్రిందికి ఉమ్మివేస్తాడు. అది అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుని దోసిలిలో పడుతుంది. దానికి కృష్ణుడు ఆగ్రహోదగ్రుడై ఆ గంధర్వుని శిరస్సు తన చక్రాయుధంతో ఖండిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ సన్నివేశం కోసం మాస్టారు పాడిన రెండు పద్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇందులో గల శ్లోకం రామాయణంలోని యుద్ధకాండంలో అగస్త్య మహర్షి శ్రీరామునకు ఉపదేశించిన "ఆదిత్య హృదయం" లోనిది.
Sincere Thanks to "Skyudyam" who posted this video in you tube.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత మరియు అంతర్జాలం
చిత్రం: | శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) | ||
శ్లోకం: | ఆదిత్య హృదయం నుండి | ||
గీత/పద్య రచన: | పింగళి నాగేంద్ర రావు | ||
సంగీతం: | పెండ్యాల నాగేశ్వర రావు | ||
గానం: | ఘంటసాల, బి.వసంత, స్వర్ణలత | ||
శ్లోకం: | ఘంటసాల: | నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః | |
జ్యోతిర్గణానాం పతయే దినాధి పతయే నమః | |||
జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమోన్నమః | |||
నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమోన్నమః | |||
పాట: | స్వర్ణలత: | నీకు సాటి రవితేజ నీవేలే మహరాజ | | నీకు సాటి | |
ఇద్దరు: | నీకు సాటి రవితేజ నీవేలే మహరాజ | ||
స్వర్ణలత: | అందచందాలలో జయంత వసంతులైనా | ||
వసంత: | ఐశ్వర్య వైభవాలలో అమరేంద్ర కుబేరులైనా | ||
స్వర్ణలత: | త్రిభువన పాలనలో త్రిమూర్తులైనా | ||
నీతో తులతూగరయా.. | | నీకు సాటి | | ||
పద్యం: | ఘంటసాల: | ధరణీ గర్భము దూరుగాక! వడి పాతాళంబునన్ చేరు గా | |
క! రహస్యంబుగ దిగ్గజేంద్రముల వెన్కన్ దాగునేగాక! ఆ | |||
హర బ్రహ్మాదులె వాని రక్షణకు తోడై వచ్చురే గాక! ము | |||
ష్కర గంధర్వు శిరంబు ద్రుంచెద మహోగ్ర కౄర చక్రాహతిన్ | |||
ఆ.. ఆ.. ఆ.. |
ధరణీగర్భము... అనే పద్యం మూడవపాదంలో వచ్చురే బదులు వత్తురే అని
రిప్లయితొలగించండినాల్గవ పాదంలో కౄర బదులుగా క్రూర అని ఉండాలి. కౄర అనే పదము లేదు, కౄర అనడం వలన గణభంగం కూడా అవుతుంది.