1960 లో విడుదలైన జానపద చిత్రం రాజ మకుటం. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్., రాజసులోచనల పై "ఊరేది పేరేది ఓ చందమామా" అనే ఆహ్లాదకరమైన యుగళ గీతాన్ని చిత్రీకరించారు. దీనిని ఘంటసాల, పి.లీల పాడారు. ఈ పాటను చారుకేశి రాగంలో ప్రధానంగా కూర్చి దానిలో మాయామాళవ గౌళ, రేవతి, మరియు సావేరి రాగాల మిశ్రమ ఛాయలు ఏర్పరిచి సంక్లిష్టమైన రాగమాలికగా కూర్చినది శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు గారు. ఆర్కెకెస్ట్రేషన్ సమకూర్చినది సంగీత దర్శకులు శ్రీ మాస్టర్ వేణు. రజనీకాంత్ గారి తండ్రిగారు ఆధునిక కవి ద్వయమైన వెంకట పార్వతీశ కవులలో ఒకరైన శ్రీ బాలాంత్రపు వెంకటరావు గారు. ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది వినడానికి. చక్కని బాణీలో కూర్చిన ఈ పాట వింటుంటే ఏదో ఊహాలోకాల్లో తేలిపోతున్నట్లనిపిస్తుంది. ఈ పాట దృశ్య, శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. శ్రీ రజనీ గారిపై శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు ఈ మాట వెబ్‌జైన్ కు వ్రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.
Thanks to "Kotaonline" for uploading this video.
ఆడియో ఫైలు మూలం: ఘంటసాల గాన చరిత
సాకీ: | పి.లీల: | ఎందుండి వచ్చేవో! ఏదిక్కు పోయేవో! ఓ...ఓ.. | |
పల్లవి: | ఊరేది? పేరేది? ఓ చందమామ! (2) | (చారుకేశి) | |
నిను జూచి నీలి కలువ పులకింపనేల? | |||
ఊరేది పేరేది ఓ చందమామ! | |||
ఘంటసాల: | ఓ..ఓ..జాబిల్లి నీలి కలువ విడరాని జంట | ||
ఊరేల? పేరేల? ఓ కలువ బాల | |||
ఊగేటి తూగేటి ఓ కలువ బాల | |||
చరణం: | పి.లీల: | ఆ..ఆ..ఆ.. | |
విరిసిన రేకుల చెలువనురా..ఆ..ఆ.. | (వకుళాభరణం) | ||
కురిసే తేనెల కలువనురా | |||
కలికి వెన్నెలల దొర రారా ఆ..ఆ..ఆ.. | (రేవతి) | ||
మరుగేలనురా నెలరాజ తెర తీయర చుక్కల ఱేడా | (చారుకేశి) | ||
రావోయి రావోయి ఓ చందమామ | |||
చరణం: | ఘంటసాల: | పరువము లొలికే విరిబోణి (2) | (వకుళాభరణం) |
బృందం: | ఆ..ఆ..ఆ.. | ||
స్వప్నసరసిలో సుమరాణి ఆ..ఆ.. | (రేవతి) | ||
కొలనంతా వలపున తూగే అలలై పులకింతలు రేగే | (చారుకేశి) | ||
నీవాడ నేగానా ఓ కలువ బాల | |||
చరణం: | పి.లీల: | తరుణ మధుర మొహనా హిమకర | (మాయామాళవ గౌళ) |
గరళ యవ్వనాంబురాశి కనర | |||
సురుచిర మదనా నివాళి ఇదిగో (2) | (సావేరి) | ||
వలచిన నా హృదయమె గైకొన రారా | |||
పి.లీల: | నీదాననే గానా ఓ కలువ ఱేడా | ||
ఘంటసాల: | నీవాడనే గానా ఓ కలువ బాల | ||
ఇద్దరు: | ఊహూ..హు..హూ..హూ..హు. హూ..హూ..హు.. |
కృతజ్ఞతలు: పాట వివరాలను, రాగాల సమాచారాన్ని ఘంటసాల గాన చరిత వెబ్ సైట్ లో పొందుపరచిన శ్రీ నూకల ప్రభాకర్ గారికి. అంతేకాక, పాటలోని సాహిత్యానికి సవరణలు, ఆయా పంక్తులకు నిర్దేశించబడిన రాగాలను సూచించిన శ్రీ శ్రీనివాస్ పరుచూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
Very melodious one.We like Leela's songs well
రిప్లయితొలగించండిThanks Radharao garu.
తొలగించండిAdbhutamayina Paata Thnks Suryanarayana Vulimiri Garu
రిప్లయితొలగించండిKonni Paatalu Gurinchi Entha Cheppina Thakkuve
prince మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు సరిగ్గా చెప్పారు. అంతటి మధురగీతం యిది.
తొలగించండిI need to chat with you tomorrow.
రిప్లయితొలగించండిWhen is the best time to reach you Sir and at what what phone #?
Mohan Devaraju
317-873-8777
Mohan garu, you can call me in the afternoon around 1 pm at 919-481-6707.
రిప్లయితొలగించండిమనోహరంగా ఉందండీ పాట !
రిప్లయితొలగించండిధన్యవాదాలు ఫణీ.
తొలగించండిi enjoy your blogs esp ghantasala
రిప్లయితొలగించండిdr d chiranjeevi visakhapatnam
Dr Chiru garu, thanks for visiting my blog
తొలగించండిమరొక మంచి పాట వినిపించినందుకు మల్లి మల్ల ధన్యవాదాలు అండి సూనా గారు.మరి ణా పాట?
రిప్లయితొలగించండిహరి గారు, ధన్యవాదాలు. మీ పాట పోస్ట్ చేసి మూడు రోజులయిందండీ. మీరు చూడలేదా. ప్రక్కన విషయసూచికలో "విజయం మనదే" లో చూడగలరు.
తొలగించండిDear Sri.Suryanarayana gAru,
రిప్లయితొలగించండిThanks for this post, enriched with rAga details
You are welcome sir.
తొలగించండిDear Sri.Suryanarayana gAru,
రిప్లయితొలగించండిGreat post, enriched with rAga details.
Best Regards,
Sreenivasa
Sreenivasa garu, Thanks for your response and visiting my blog
తొలగించండిసూర్య నారాయణ గారూ,
రిప్లయితొలగించండిమరొక్క సారి ధన్య వాదాలు.పాట మాత్రమే విని సాహిత్యం అందుబాటులో ఉంటే ఆ ఆనందమే వేరు.
పాటను విని సాహిత్యం వ్రాయాలంటే,అమ్మో,ఒక గాయకునిగా అందులోని కష్టం బాగా ఎరిగిన వాడిని.
మాస్టారు గారి పాటలు ఎన్ని మార్లు విన్నా తనివి తీరదు.
సర్వేశరుడు మిమ్ము చల్లగా చూడాలి.
ఎమ్.ఆర్.సుబ్రహ్మణ్యమ్
శ్రీ ఎమ్.ఆర్.సుబ్రహ్మణ్యమ్ గారికి, ధన్యోస్మి సార్ మీ స్పందనకు.
తొలగించండిసూర్య నారాయణ గారూ,
రిప్లయితొలగించండిమరొక్క సారి ధన్య వాదాలు.పాట మాత్రమే విని సాహిత్యం అందుబాటులో ఉంటే ఆ ఆనందమే వేరు.పాటను విని సాహిత్యం వ్రాయాలంటే,అమ్మో
ఒక గాయకునిగా అందులోని కష్టం బాగా ఎరిగిన వాడిని. మాస్టారు గారి పాటలు ఎన్ని మార్లు విన్నా తనివి తీరదు.
సర్వేశరుడు మిమ్ము చల్లగా చూడాలి.
ఎమ్.ఆర్.సుబ్రహ్మణ్యమ్