చిత్రం: విజయం మనదే (1970)
రచన: సి.నారాయణ రెడ్డి
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల, పి. సుశీల
1970 లో జానపద బ్రహ్మ శ్రీ బి.విఠలాచార్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., బి.సరోజాదేవి నటించిన జానపద చిత్రం విజయం మనదే. ఇందులో ఘంటసాల మాస్టారు ఆరు పాటలు పాడారు. అయితే అందులో ఎక్కువ పాపులర్ అయినది "ఓ! దేవి, ఏమి కన్నులు నీవి". మాస్టారే సంగీత దర్శకులు ఈ చిత్రానికి. ఈ పాట రచన శ్రీ సినారె గారు. పి.సుశీలతో పాడారు మాస్టారు. ఈ పాట దృశ్య, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.

పల్లవి: | ఘంటసాల: | ఓ!...... దేవి, ఏమి కన్నులు నీవి | |
ఓ! దేవి, ఏమి కన్నులు నీవి | |||
కలకల నవ్వే కలువలు .. అవి | |||
కాముని పున్నమి చలువలు | | ఓ! దేవి | | ||
సుశీల: | వాడిపోయే, వీడిపోయే కొలనులోని | ||
కలువపూలు నా నయనాలా.. | |||
చాలు.. చాలు.. చా..లు.. | |||
ఘంటసాల: | ఓ! దేవి, ఏమి కన్నులు నీవి | ||
చరణం: | ఘంటసాల: | ఏమని అందును ఎర్రని పెదవుల అందాలు | |
అవి ఎంతో వింతగ మెరిసే నున్నని పగడాలు | | ఏమని | | ||
సుశీల: | రూపమే కాని రుచియేలేని పగడాలు | | రూపమె | | |
తేనియలూరే తీయని పెదవికి సరిరావు | |||
సరిరావు చాలు.. చాలు.. చాలు.. | |||
ఘంటసాల: | ఓ! దేవి, ఏమి కన్నులు నీవి | ||
చరణం: | సుశీల: | ఆ.. ఆ. ఆ.. ఆ.. | |
ఘంటసాల: | కులుకుల నడకల కలహంసలు కదలాడెనా.. | ||
నల్లని జడలో నాగులు ఊగిసలాడెనా.. | | కులుకుల | | ||
దివికు భువికి వంతెన వేసెను మీ మనసు | | దివికి | | ||
సుశీల: | అల్లరి పిల్లకు కళ్ళెం వేసెను నీ మనసు | ||
నీ మనసు చాలు.. చాలు.. చాలు.. | |||
ఘంటసాల: | ఓ!.. దేవి.. ఏమి సొగలులు నీవి | ||
సుశీల: | ఓ!.. రాజా.. రసికతా రతి రాజా.. | ||
ఐద్దరు: | ఆహ హా హా హ హా హా |
ఓ! దేవి ఏమి కన్నులు నీవి?
రిప్లయితొలగించండిమెల్ల కన్నులు నావి
అని పూరించేవాళ్ళం :))
ఆహా అంత అందమైన పాట
రిప్లయితొలగించండిపోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు
Where can I find chronological listing of all movies that have Master gari Music direction?
రిప్లయితొలగించండి