1957 లో జానపద కథ ఆధారంగా మినర్వా పిక్చర్స్ పతాకంపై విడుదలైన చిత్రం సారంగధర. ఇందులో ఎన్.టి.ఆర్., భానుమతి, రాజసులోచన నటించారు. సంగీతం ఘంటసాల మాస్టారు, గీత, పద్య రచన శ్రీ సముద్రాల రాఘవాచార్యులు (సీనియర్) గారు. ఇందులో మాస్తారు ఏకగళ పద్యాలు, భానుమతి గారితో సంవాద పద్యాలు, ఒక చక్కని యుగళ గీతం పాడారు. సముద్రాల గారు వ్రాసిన "గగన సీమంతిని" అనే పద్యం యొక్క దృశ్య, శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ వీడియోను సమకూర్చినది శ్రీ కె.వి.ఆర్.హరీష్ (Bank of Sri Ghantasala, Machilipatnam) గారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
చిత్రం: సారంగధర (1957)
కలం: సముద్రాల రాఘవాచార్యులు
స్వరం, గళం: ఘంటసాల వెంకటేశ్వర రావు
గగన సీమంతిని కంఠ హారములోన దనరారు నాయకమణి యనంగ | |
హాయిగా నందనోద్యాన సీమనుకుల్కు అందాల కొదమ రాయంచయనగ | |
అమరులైరావత హస్తాగ్రమున వేయ చెలువారు మల్లె పూచెండనంగ | |
గంగాధరుని మౌళి రంగుగా కొలువై పసలు నించెడు చంద్రవంకయనగ | |
చూడుడదిగో నిక్కి చుక్కలలో నిల్చి రెక్కలార్పకుండ చొక్కకుండ | |
ఆకసాన తేలియాడుచున్నది నాదు పావురమ్ము రాచఠీవి మెఱయ | |
ఆ..ఆ..ఆ.. |
అద్భుతమైన గాన విన్యాసం, ఆహా!
రిప్లయితొలగించండిVery fine poem and Ghantasala rendered well
తొలగించండిGod song rendered well
రిప్లయితొలగించండిSuperbly rendered poem
రిప్లయితొలగించండి