18, మార్చి 2012, ఆదివారం

గులేబకావళి కథ నుండి గుబాళించే మరొక స్వర కుసుమం - ఘంటసాల, జానకి గళాలలో

1962 లో నిర్మించ బడిన గులేబకావళి కథ కల్పిత కథ. గులేబకావళి (గుల్-ఎ-బకావళి) పుష్పం పై గల ఒక కథను జానపద చిత్రంగా  పలు భాషలలో నిర్మించబడింది. అయితే తమిళంలో ఎం.జి.ఆర్. నటించిన కథకు, తెలుగు లో ఎన్.టి.ఆర్., జమున నటించిన చిత్ర కథకు కొంత వ్యత్యాసం వుంది. ఈ చిత్రం తో సినీ అరంగేట్రం చేసిన శ్రీ సి.నారాయణ రెడ్డి గారు "నన్ను దోచుకొందువటే" పాటతో బాగా ప్రసిద్ధి పొందారు. వారి మరొక అద్భుతమైన గీతం "కలల అలలపై తేలెను. దీనిని ఘంటసాల మాస్టారు, ఎస్. జానకి గానం చేసారు. ఈ పాట గులేబకావళి పాత్ర ధారిణి నాగరత్నం మరియు ఎన్.టి.ఆర్.లపై చిత్రీకరించారు. ఎంతో ఆహ్లాదంగా, సుమధురంగా  సాగే ఈ పాట యొక్క దృశ్య, శ్రావణ, సాహిత్యాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.
  

ఆడియో ఫైలు: కలల అలలపై తేలెను


         చిత్రం:             గులేబకావళి కథ (1962)
         కలం:             డా.సి.నారాయణ రెడ్డి
         సంగీతం:         జోసెఫ్ కృష్ణమూర్తి
         గానం:            ఘంటసాల, ఎస్.జానకి

ప:       జానకి:            కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై
          ఘంటసాల:      ఎగసిపోదునో చెలియా నీవే ఇక నేనై
          జానకి:            కలల అలలపై

చ.       జానకి:            జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు              | జలకమాడు |
          ఘంటసాల:      తడిసీ తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు        | తడిసీ |
          జానకి:            చూపుతోనె హృదయవీణ ఝుమ్మనిపించేవెందుకు         | చూపుతోనె |
          ఘంటసాల:      విరిసీ విరియని పరువము
          జానకి:            ఆ.. ఆ
          ఘంటసాల:      మరులు గొలుపుతున్నందుకు  
          జానకి:            ఆ.. ఆ..
          ఘంటసాల:      విరిసీ విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు
          జానకి:            కలల అలలపై

చ.       జానకి:            సడి సవ్వడి వినిపించని నడి రాతిరి ఏమన్నది               | సడి సవ్వడి|
          ఘంటసాల:      జవరాలిని చెలికానిని
          జానకి:            ఊ.. ఊ..
          ఘంటసాల:      జంటగూడి రమ్మన్నది
          జానకి:            ఊ.. ఊ..
          ఘంటసాల:      జవరాలిని చెలికానిని జంటగూడి రమ్మన్నది
 
ప.       ఘంటసాల:      విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది           | విరజాజులు |
          జానకి:            అగుపించని ఆనందము
          జానకి:            ఆ.. ఆ..
          ఘంటసాల:      బిగి కౌగిట కలదన్నది
          జానకి:            ఆ.. ఆ..
          ఘంటసాల:      అగుపించని ఆనందము బిగి కౌగిట కలదన్నది
          జానకి:            కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై
          ఘంటసాల:      ఎగసిపోదునో చెలియా నీవే ఇక నేనై
          జానకి:            కలల అలలపై

10 కామెంట్‌లు:

  1. NaakU Chaala Istamaian Paata ee Chitram Lo ..., Manchi Melody SOng ..

    Dhanyavadhalu Mastaru

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Prince గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. నిజంగా ఇది చాల శ్రావ్యమైన పాట.

      తొలగించండి
  2. ' నన్నుదోచుకొందువటే'ఎక్కువ పాపులారిటీ పొందిన పాట.బాగుంటుంది కూడా.కాని 'కలల అలలపై'పాట ఇంకా శ్రావ్యంగా ఉంటుంది.బహుశా low key లో ఉండటం వలన అంత పాపులార్ కాలేదనుకొంటాను.ఇంత మంచి సంగీతం అందించిన జోసెఫ్ కృష్ణ మూర్తి మళ్ళీ ఏ తెలుగు సినిమాకీ సంగీత దర్శకత్వం వహించి నట్లు లేదు.కారణమేమిటో.చక్కని ,మధురమైన సాహిత్యం,సంగీతం ఉన్న పాటను అందించినందుకు మీకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రమణ గారికి నమస్కారం. మీరు చెప్పింది నిజం. ఈ పాట చాల శ్రావ్యమైనది. అందులో మాస్టారు, ఎస్.జానకి ల కాంబినేషన్‌ అద్భుతం. జోసెఫ్ వి.కృష్ణమూర్తిగారు ఎందుకు తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగలేదో తెలియదు. మీ స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. ఘంటసాల గారన్నను ,వారి పాటలన్నను నాకెంతో ఇష్టం.వారి పాటలే నేను ఎప్పుడు విన్టూ వుంటాను.న దో ఎన్నిసార్లు విన్న ఆనందంగానే వుంటుంది.ఘంటసాల గారి పై మీకెంత అభిమానమో! ఏకంగా అయన పేరుపైనే ఓ బ్లాగును నడపడం రియల్లీ గ్రేట్.
    మీ ద్వార మేము మంచి మంచి పాటలు వింటున్నాము.మెనీ మెనీ థాంక్స్. అలాగే "ఓ దేవి ఏమి సొగసులు నీవి" పాటను లక్ష్మి కటాక్షము నుండి వినపించగలరని విన్నపము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. మాస్టారే నా ప్రపంచం. మీరు కోరిన పాట త్వరలో వినిపిస్తాను. అయితే ఆ పాట లక్ష్మీ కటాక్షం లోనిది కాదండి. అది రామారావు, బి.సరోజ గార్లు నటించిన, మాస్టారు సంగీత దర్శకత్వం వహించిన 1970 చిత్రం "విజయం మనదే". యూ ట్యూబ్ లో దానిని "జయం మనదే" అని పొరపాటుగా సూచించారు.

      తొలగించండి
  4. సూనా గారు,మీ ప్రత్యుత్తరానికి థాంక్స్.ఆ పాట కోసం వేచి ఉన్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరిగారు, ధన్యవాదాలు. మీరు అడిగిన పాట త్వరలో పోస్టు చేస్తాను.

      తొలగించండి
  5. This is one of the excellent songs-more to tell about Janaki-rather than Masataaru Gaaru about whom any amount of vocabulary proves inadequate.Though the song "Nannu Dochukonduvate"in the cinema has become more popular-more so as the first one written by Narayana Reddy for cinemas,in terms of melody,only this song should rank first.But,unfortunately,as the proverb that "the "Marri" tree does not allow any other plant to grow beneath it, since the song "Nannu Dochukonduvate" was a heroine oriented one & Jamuna the heroine was at the zenith of her fame those days,this song got shadowed by it.It is just on the similar lines of Narayana Reddy's previous song "Mabbulo Yemundi Maa Manasulo Yemundi" written for his musical ballad "Ramappa" which,however, was used in the film "Lakshadhikaari" later,it is in the form of question & answers.However,to be brutally frank & in good humour & without offence if I say that the element of "semiporno" attempted with the new herione also enters into the song invoking inquisiteness not only in the audience but also in the listeners,I may not be mistaken.After all,the ever attraction in the tone of Janaki is always an allurement!!We do know that she makes the after noon light as moon light (Pagale Vennela).Kudos to her!!!

    రిప్లయితొలగించండి
  6. Mallaiah Anchooriజూన్ 24, 2012

    This is one of the excellent songs-more to tell about Janaki-rather than Masataaru Gaaru about whom any amount of vocabulary proves inadequate.Though the song "Nannu Dochukonduvate"in the cinema has become more popular-more so as the first one written by Narayana Reddy for cinemas,in terms of melody,only this song should rank first.But,unfortunately,as the proverb that "the "Marri" tree does not allow any other plant to grow beneath it, since the song "Nannu Dochukonduvate" was a heroine oriented one & Jamuna the heroine was at the zenith of her fame those days,this song got shadowed by it.It is just on the similar lines of Narayana Reddy's previous song "Mabbulo Yemundi Maa Manasulo Yemundi" written for his musical ballad "Ramappa" which,however, was used in the film "Lakshadhikaari" later,it is in the form of question & answers.However,to be brutally frank & in good humour & without offence if I say that the element of "semiporno" attempted with the new herione also enters into the song invoking inquisiteness not only in the audience but also in the listeners,I may not be mistaken.After all,the ever attraction in the tone of Janaki is always an allurement!!We do know that she makes the after noon light as moon light (Pagale Vennela).Kudos to her!!!

    రిప్లయితొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)