1969 లో విడుదలైన చిత్రం జరిగిన కథ. ఇందులో కృష్ణ, కాంచన, జగ్గయ్య మొదలగువారు నటించారు. ఈ చిత్రానికి ఘంటసాల గారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీ సి.నారాయణ రెడ్డి గారు వ్రాసిన బలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు" అనే పాటను పియానో వాయిస్తూ జగ్గయ్య పాడతారు. ఈ సన్నివేశంలో కృష్ణ, కాంచన కూడ కనిపిస్తారు. ఘంటసాల గారు రెండు యుగళ గీతాలు కూడ పాడారీ చిత్రానికి. ఒకటి పి.సుశీలతో "తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే", మరొకటి ఎల్.ఆర్.ఈశ్వరితో "లవ్ లవ్ లవ్ మి నెరజాణా" ఈ పాటంటే మాస్టారికి చాల ఇష్టం. ప్రతి కచేరిలోను, కార్యక్రమం లోను ఈ పాటను విధిగా పాడే వారు. అది వారి మాటలలోనే వినండి. జనరంజని రేడియో కార్యక్రమంలో ఒకసారి ఘంటసాల మాస్టారు ఈ పాట గురించి ఇలా అన్నారు.
మాస్టారి ముందుమాట, తరువాత ఆడియో ట్రాక్ : ఘంటసాల గాన చరిత నుండి
అందరికీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు!
Thnaks to Trinidad526 for up loading the video to You Tube
న్యూయార్క్ కచేరీలో మాస్టారు పాడిన పాట : ఘంటసాల గాన చరిత నుండి
ప. బలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు
ఆ..ఆ..ఆయ్
వసంతాలు పూచే నేటి రోజు | బలేమంచి |
చ. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు | గుండెలోని |
నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు
బలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు
చ. చందమామ అందిన రోజు, బృందావనై నవ్విన రోజు
తొలివలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు | చందమామ |
కన్నతల్లి ఆశలన్ని సన్నజాజులై విరిసిన రోజు
భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు
ఆ..ఆ..ఆయ్
వసంతాలు పూచే నేటి రోజు
ఆ ఆ అహ ఆ ఆ ఆ - ఆ అహ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ అహ ఆ ఆ ఆ - ఆ అహ ఆ ఆ ఆ ఆ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి