ఈ పద్యం 1972 లో శ్రీ బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సంపూర్ణ రామాయణం" చిత్రం లోనిది. హనుమంతుడు సీతాన్వేషణలో లంకను జేరి, ఏ పరిస్థితుల్లో ఆ మహాసాధ్వి ప్రత్యర్థియైన రావణుని లంకలో శ్రీరాముని ఎడబాసి విలపిస్తుందో గ్రహించాడు. తిరిగి రాముని చేరి, తను చూసిన వివరాలు, ఆ వైనం వివరిస్తూ కనుగొంటిని సీతామతల్లిని అని వివరిస్తాడు. శ్రీ గబ్బిట వెంకటరావు గారు వ్రాయగా, మామ మహదేవన్ గారు బాణీ కట్టగా ఘంటసాల మాస్టారు అద్భుతంగా గానం చేసారీ పద్యాన్ని. శ్రీ అర్జా జనార్ధనరావు గారు ఆంజనేయునిగా నటించారు.
ఆడియో ఫైలు: అంతర్జాలం
చిత్రం: సంపూర్ణ రామాయణం (1972)
రచన: గబ్బిట వెంకటరావు
సంగీతం: కె.వి.మహదేవన్
గానం: ఘంటసాల
కనుగొంటిన్ కనుగొంటి జానకిని శోకవ్యాకుల స్వాంతనా
జననిన్ రావణు లంకలో, వనములో, ప్రత్యర్ధి కూటంబులో
అనిశంబున్ భవదీయ దివ్య పదపద్మారాధనా దీక్షయై
దినముల్ లెక్కిడుచుండె మిమ్ముగన తండ్రీ! రామచంద్ర ప్రభూ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి