జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని సాక్షాత్ పరమ శివుని అవతారంగా అభివర్ణిస్తారు. శ్రీ శంకర భగవత్పాదుల వారు మనకెన్నో అమూల్యమైన స్తోత్రాలు, అష్టకాలు అందించారు. అంతేకాదు సర్వ మానవ కల్యాణం కోసం శ్రీ చక్ర స్థాపన చేసారు. వారు వ్రాసిన శివస్తుతిలోని విశ్వనాథ అష్టకం మరియు శివ పంచాక్షరి లోని చెరొక శ్లోకాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను. "వీరాంజనేయ" చిత్రం కోసం విశ్వనాథ అష్టకం లోని కాశీ విశ్వేశ్వరుని స్తుతించే శ్లోకం "గంగా తరంగ కమనీయ జటా కలాపం" మరియు "స్వర్ణమంజరి" చిత్రం కోసం శివ పంచాక్షరి లోని "మ"కార శ్లోకాన్ని, మాస్టారు భక్తి పారవశ్యంతో గానం చేసారు. ఈ శ్లోకాలకు తెలుగు వారికి గర్వకారణమైన చిత్రకారులు శ్రీ వడ్డాది పాపయ్య ("వపా") గారు చందమామ , యువ మొదలయిన మాస పత్రికలకు వేసిన తైలవర్ణ చిత్రాలను శ్రీ సోము శ్రీనివాసమూర్తి గారు, శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారు శ్లోకంలో భావానికి అనుగుణమైన బొమ్మలను ఎన్నుకుని సృజనాత్మకంగా తయారు చేసిన వీడియో ద్వారా కన్నుల విందుగా ప్రదర్శించారు. వారికి కృతజ్ఞతలు. ఆ చిత్రాలను, నేపథ్యంలో మాస్టారి గానాన్ని విని ఆనందించండి.
శ్లో: |
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
గానం: ఘంటసాల
గంగాతరంగ కమనీయ జటాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియం అనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం
ఆ.. ఆ.. ఆ.. భజ విశ్వనాథం
| శ్లో: |
చిత్రం: స్వర్ణ మంజరి (1962)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
గానం: ఘంటసాల
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ"కారాయ నమః శివాయ
ఆ.. ఆ.. ఆ.. ఆ.. |
బాలు పాడిన స్టయిలే బాగా కుదిరినట్టనిస్తోందండి.
రిప్లయితొలగించండిSNKR గారు, మీతో పూర్తిగా ఏకీభవించలేను. ఎందుకంటే బాలు గారు కూడ బాగా పాడారు. అయితే అది ప్రైవేట్ ఆల్బంకోసం పాడిన పూర్తి స్తోత్రం. మాస్టారు సినిమా కోసం పాడినది ఒకే ఒక శ్లోకం. సందర్భాన్ని బట్టి, నిడివిని బట్టి ఆయా టెంపో సరే అని నా అభిప్రాయం. అయితే మాస్టారిది తిరుగులేని గంభీర కంఠం. వారికి వారే సాటి.
రిప్లయితొలగించండిసూర్యనారాయణ గారు,
రిప్లయితొలగించండిగాత్రం గురించి కాదు గాని, సంగీతం, ఆ టెంపో బాలు గారు పాడినదాన్లోనే నాకు బాగున్నట్టనిపించింది. ఘంటసాల పాడలేరు అంటే నా కళ్ళు పోతాయ్... మరువను శివమంత్రం మదిలో మరువకె ఓ మనసా... అని ఘంటసాల లాగా బాలు పాడగలరా? వూహూ... పాడినా న్యాయం చేకూర్చలేరు.
పోల్చిచూచినా పోల్చిచూడకపోయినా ఘంటసాల గారిదే చాలా బాగుంది.
రిప్లయితొలగించండిగోపీకృష్ణ
మీరు పంపిన గంటశాలగారి శ్లోకములు విని అందం పొందెను.గంటశాలగారి ఏ పాట నైన బాగుండును
రిప్లయితొలగించండి-యల్లాపంతుల సుర్యనారాయణముర్తి
Sirs
రిప్లయితొలగించండిFor Any song, I feel we shall listen with out comparison. Any song/sloka/padyam any thing come out of Ghantasala gari voice, is excellent and 'Gaandharvam".
At the same time, Sri SPB had also to his credit, theses Siva Stuti as his Private album, which was and is a great hit to for ever.
pvs rao
Ghantasaala garu gana gandharvudu.
రిప్లయితొలగించండిAthani tharvathe evaraina.SKNR garu tune gurinchi maathrame cheppaaru.
Kaalaniki thaginagtlu tune maarpu luntaayi.Aa vidhanga jana ranjakamaina tune baalu gaaru aalapinchinadhi.
Balu gaaru kooda great.I love Ghanta sala mastaaru and SP.Baalu garu