ప్రముఖ బెంగాలీ రచయిత శ్రీ శరత్ బాబు (శరత్ చంద్ర చటర్జీ) వ్రాసిన "నిష్కృతి" నవల ఆధారంగా 1957 లో అన్నపూర్ణా వారి బ్యానరుపై తెలుగులో నిర్మించ బడిన చిత్రం తోడికోడళ్ళు. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు పాడిన పాటలలో ఒక చెప్పుకోదగిన పాట "కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడితాన". అయితే సాహిత్య పరంగా చూస్తె "కడుపు కాలే కష్టజీవులు", "చిరుగు పాతల, బరువు బ్రతుకుల నేతగాళ్ళు, "చాకిరొకరిది సౌఖ్యమొకరిది" అనే పదాల వాడుక గమనిస్తే ఇది తప్పకుండ మహాకవి శ్రీశ్రీ గారిది అనిపిస్తుంది. కాని నిజానికి దీనిని వ్రాసినది ఆచార్య ఆత్రేయ గారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చినది శ్రీ "మాస్టర్ వేణు" అనబడే "మద్దూరి వేణుగోపాల్" గారు. సినీ నటుడు శ్రీ "భాను చందర్" వీరి కుమారుడే. వేణు గారు బొంబాయిలో ని "స్కూల్ ఆఫ్ మ్యూజిక్" లో ఆరు నెలలలో నే సంగీతం లో మాస్టర్ డిగ్రీ తీసుకుని, అప్పటి నుండి "మాస్టర్ వేణు" అయ్యారు. కారు ప్రేరణగా వచ్చిన ఈ కుర్ర కారు పాటను ఘంటసాల మాస్టారు ఎంతో సునాయాసంగా, సుమధురంగా పాడారు. ఈ పాట దృశ్య, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
మాస్టర్ వేణు ఆచార్య ఆత్రేయ ఘంటసాల |
చిత్రం: తోడికోడళ్ళు (1957)
కలం: ఆచార్య ఆత్రేయ
స్వరం: మాస్టర్ వేణు
గళం: ఘంటసాల
ఈ పాట యొక్క ఆడియో ఫైలు ను ఘంటసాల గాన చరిత నుండి వినండి.
ప. కారులో.. షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడితాన
బుగ్గ మీద గులాబి రంగు ఎలావచ్చెనో చెప్పగలవా? | కారులో |
అ.ప. నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే | నిన్ను |
వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో | కారులో |
చ. చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా | చలువ |
మేడ కట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా?
కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి | కడుపు |
చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో | కారులో |
చ. గాలిలోన తేలిపోయే చీరకట్టిన చిన్నదానా | గాలిలోన |
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా?
చిరుగుపాతల, బరువుబ్రతుకుల నేతగాళ్ళే నేసినారు | చిరుగు |
చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో | కారులో |
aatreya gaaru sahaja kavi kaabatti sri sri laaga vraaya galigaadu. sri sri sahajatwaanni nagnanga,elaanti maarpulu lekunta pacchi vachana kaviva doaranini manandariki andinchina MAHA KAVI,aatreya hridayaanni yedameeda pratishtinchina oka prakriti prateeka.
రిప్లయితొలగించండిmee prayatnam baagundandi. manchi pani chestunnaaru
రిప్లయితొలగించండిThe lyrics were written in the year 1957 but the life of many people in India are as such as written in the above song.
రిప్లయితొలగించండిWho is responsible ? Whether the rulers or the people who are selling their votes for wine and money.
Thanks Nageswara rao garu fro visiting my blog. Things remain the same even today.
తొలగించండి