1962 లో విడుదలైన గులేబకావళి కథ ఎన్.టి.ఆర్., జమున నటించిన చిత్రం. దీని నిర్మాత ఎన్.టి.ఆర్. సోదరుడైన త్రివిక్రమ రావు గారు. ఈ చిత్రం "గుల్-ఎ-బకావళి" (బకావళి అనే పుష్పం) నేపధ్యంలో కాశీమజిలీ కథల ఆధారంతో నిర్మించబడిన చిత్రం. ఈ పేరుతో పలు భాషలలో వచ్చింది ఈ సినిమా. అయితే కొన్ని మార్పులున్నాయి తెలుగులో. తెలుగు చలన చిత్ర సీమలో ఒక మైలు రాయి ఈ చిత్రం. ఎందుకంటే మనకొక రసికత గల కవి శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సి.నా.రె.) ను పరిచయం చేసింది. శ్రీ నారాయణ రెడ్డిగారు గులేబకావళి కథ తో మొదలుకుని కొన్ని వేల చక్కని గీతాలను వ్రాసారు. వారు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో పాటు, వారు వ్రాసిన విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు. చెప్పదగ్గ విషయం ఏమిటంటే తెలుగు వారిలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి తరువాత ఈ అవార్డును అందుకున్నది సి.నా.రే. గారు మాత్రమె. ఇవి కాక మరెన్నో సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. వారి ప్రముఖ రచన, బహుళ ప్రజాదరణ పొందిన "నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని" పాట యొక్క దృశ్య, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ చిత్రానికి సంగీతం నిర్వహించిన వారు శ్రీ జోసెఫ్ మరియు శ్రీ విజయా కృష్ణ మూర్తి గార్లకు సంగీత దర్శకునిగా ఇది తొలి చిత్రం.
ఘంటసాల: నన్ను దోచుకుందువటే
కలం: సి.నారాయణ రెడ్ది (సినారె)
స్వరం: జోసెఫ్, విజయ కృష్ణమూర్తి
గానం: ఘంటసాల, పి.సుశీల
ఘంటసాల: నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
సుశీల: కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి
ఘంటసాల: నన్ను దోచుకుందువటే
సుశీల: తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన | తరియింతును |
పూలదండవోలె, కర్పూర కళికవోలె, కర్పూర కళికవోలె
ఘంటసాల: ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు | ఎంతటి |
కలకాలం వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు
నన్ను దోచుకుందువటే..
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
సుశీల: కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి
ఘంటసాల: నన్ను దోచుకుందువటే..
సుశీల: నా మదియే మందిరమై, నీవే ఒక దేవతవై | నా మదియే |
వెలసినావు నాలో, నే కలసిపోదు నీలో, కలసిపోదు నీలో
ఘంటసాల: ఏనాటిదొ మన బంధం ఎరుగరాని అనుబంధం | ఏనాటిదొ |
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం, ఇగిరిపోని గంధం
నన్ను దోచుకుందువటే..
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
సుశీల: కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి
ఘంటసాల: నన్ను దోచుకుందువటే
Good song of C.Narayana Reddy as his first one.
రిప్లయితొలగించండిRadharao garu, thanks for your response.
రిప్లయితొలగించండిWhat a beauty..visually as well.
రిప్లయితొలగించండిచాలా చాలా మంచిపాట ధన్యవాదాలు
రిప్లయితొలగించండినేనుకూడా ఘంటసాల గారి అబిమానిని
adbhutam sahityam.amaram gayanam. Apatha madhuram ganam
రిప్లయితొలగించండిఛాలా మంచి ప్రయత్నం సూర్యనారాయణ గారూ ... anchorpunnamaraju@gmail.com
రిప్లయితొలగించండిఛాలా మంచి ప్రయత్నం సూర్యనారాయణ గారూ ... anchorpunnamaraju@gmail.com
రిప్లయితొలగించండి