
చిత్రం: రాము (1968)
రచన: దాశరధి
సంగీతం: ఆర్.గోవర్ధనం
గానం: ఘంటసాల
ప. మంటలురేపే నెలరాజా! ఈ తుంటరితనము నీకేల? | మంటలు |
వలపులురేపే విరులారా! ఈ శిలపై రాలిన ఫలమేమి? | మంటలు |
చ. ఆకాశానికి అంతుంది, నా ఆవేదనకు అంతేది? | ఆకాశానికి |
మేఘములోనా మెరుపుంది, నా జీవితమందున వెలుగేది? | మంటలు |
చ. తీగలు తెగినా వీణియపై యిక తీయనిరాగం పలికేనా? | తీగలు |
ఇసుక యెడారిని యెపుడైనా ఒక చిన్న గులాబీ విరిసేనా? | మంటలు |
చ. మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేశాడు | మదిలో |
సుఖము, శాంతి, ఆనందం నా నొసటను వ్రాయుట మరచాడు
మంటలురేపే నెలరాజా! ఈ తుంటరితనము నీకేల?
వలపులురేపే విరులారా! ఈ శిలపై రాలిన ఫలమేమి
మంటలురేపే నెలరాజా! ఈ తుంటరితనము నీ..కేల?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి