1957 లో విడుదలైన సతీ అనసూయ చిత్రంలో అంజలీదేవి, గుమ్మడి, జమున, కాంతారావు నటించారు. అనసూయ పతివ్రతా శిరోమణి. ఆమెను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను తన పాతివ్రత్యంతో శిశువులుగా చేసి లాలిస్తుంది. ఆవిధంగా ఆమె లోక మాతలైన వాణీ, గౌరీ, లక్ష్మి లకు అత్తగారిగ మారింది. త్రిమూర్తులు ఆమెను కరుణించి దత్తాత్రేయుడనే పుత్రునిగా జన్మిస్తాడు. ఈ చిత్రానికి పద్యాలు, పాటలు శ్రీ సముద్రాల రామానుజాచార్య (సముద్రాల జూనియర్) వ్రాసారు.
చిత్రం: సతీ అనసూయ (1957)
కలం: సముద్రాల జూనియర్
కలం: సముద్రాల జూనియర్
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల, పి.లీల
ఆదౌ బ్రహ్మా, హరిర్మధ్యే, అంత్యే దేవస్సదాశివః
మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే!
కర్పూరకాంతి దేహాయ, బ్రహ్మమూర్తి ధరాయక
వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే!
దత్తాత్రేయ నమోస్తుతే!
సూరి గారు బాగున్నారా?
రిప్లయితొలగించండిమీరు పెట్టిన క్లిప్పింగ్ లో శ్రీ దత్తాత్రేయ స్తోత్రం మొత్తం లేదా?
అది రోజూ చదివినా, అధవా విన్నా మంచిదన్న విషయం ప్రస్తావించ వద్దా?
Nice clip. Can be chanted daily as discussed above.
రిప్లయితొలగించండి