చిత్రం: శ్రీకృష్ణ పాండవీయం (1966)
రచన: బమ్మెర పోతన (భాగవతం నుండి)
గానం: ఘంటసాల
సంగీతం: టి.వి.రాజు
వచ్చెద విదర్భ భూమికి
చొచ్చెద భీష్మకుని పురము సురుచిర లీలన్
తెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చిన పోరన్!
wonderful composition with a perfect diction by Mastaaru. A voice to be remembered for ever & ever.
రిప్లయితొలగించండిమీ స్పందనకు ధన్యవాదాలు.
తొలగించండిilaaMTi panulu dEvuDu chEstE oppu..manaM chEstE tappu..
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. మీ సందేహానికి రమణ రావు (కమనీయం) గారి వివరణ చూడండి. శ్రీకృష్ణుడు చేసినది శాస్త్ర సమ్మతమే. యుగధర్మం బట్టి పద్ధతిలో మార్పు రావచ్చును.
తొలగించండిఈ పద్యం విన్నాక రెండు వ్యాఖ్యలు 1.మా అమ్మాయి మంచి నర్తకి(విద్యార్థి దశలో)అప్పుడు కృష్ణుడి వేషంలో ఈ పద్యం చదువుతూ అభినయించేది.ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది.2.అజ్ఞాతగారి కామెంట్ గురించి ;అష్టవిధ వివాహాల్లో ' రాక్షస వివాహం 'కూడా ఒకటి .ఇప్పటికీ కొన్ని తెగల్లో ఆచారంగా ఉంది.ఐనా రుక్మిణి కోరిక ,సమ్మతితోనే ఆమెను తీసుకొని వచ్చాడు.యుగ ధర్మాలు మారుతూ ఉంటాయి.ఒకప్పుడు బహుభార్యత్వం తప్పులేదు.ఇప్పుడది చట్టవిరుద్ధం.శిక్షార్హం.కాని స్త్రీని ఆమె ఇష్టానికి విరుద్ధంగా బలాత్కారం చేయడం మాత్రం అప్పుడూ ,ఇప్పుడూ కూడా తప్పే .
రిప్లయితొలగించండిపాటకు చక్కటి అభినయం చేశారు, నా అభిమాన నటుడు ... వంగర వెంకట సుబ్బయ్య గారు. :)
రిప్లయితొలగించండిSNKR గారు, చక్కగా చెప్పారండి. చిన్నపాత్రైనా వంగర గారి నటన సన్నివేశానికి మరింత ఇంపు కలిగిస్తుంది. మాయాబజార్ లో వారి నటన అద్భుతం. మీ స్పందనకు ధన్యవాదాలు.
తొలగించండిఈ పద్యం వింటే నేను మైమరచి పోతానండి కృష్ణభగవానుడు పద్యం విన్నతసేపు కళ్లలో మెదులుతూ ఉంటాడు కృష్ణం వందే జగద్గురుమ్
రిప్లయితొలగించండి