ఘంటసాల బలరామయ్య గారి ప్రసిద్ధి చెందిన చిత్ర సంస్థ ప్రతిభ ఫిలింస్ 1950 లో నిర్మించిన జానపద చిత్రం "స్వప్న సుందరి". ఒకానొక రాజ కుమారుడు ఒక స్వప్న సుందరిని ఊహించుకోవడం, ఆమె కోసం వెతకడం, అనుకోకుండా ఆమె కనిపించడం, ఆమె లోకానికి తను వెళ్ళడం, ఒక మాంత్రికుని దుష్ట చర్యలకు లోనవడం ఆఖరికి మాంత్రికుని చంపడం వగైరా గల సగటు జానపద చిత్రం స్వప్న సుందరి. ఈ చిత్రానికి సంగీతం అలనాటి మేటి దర్శకులు సి. ఆర్. సుబ్బురామన్ మరియు గీత కర్త సముద్రాల రాఘవాచార్యులు. ఈ చిత్రానికి దర్శక-నిర్మాత ఘంటసాల బలరామయ్య. నాయికా నాయకులు అంజలీదేవి, ఎ.ఎన్.ఆర్. ఈ చిత్రంలో మాస్టారు కొన్ని యుగళగీతాలతో పాటు సాగుమా సాహిణీ (గుఱ్ఱపు రౌతు) అనే చక్కని భావ గీతాన్ని పాడారు. ఆలకించి ఆనందించండి.
చిత్రం: | స్వప్న సుందరి (1950) | |
గానం: | ఘంటసాల | |
సంగీతం: | సి.ఆర్.సుబ్బురామన్ | |
రచన: | సముద్రాల రాఘవాచార్య | |
పల్లవి: | సాగుమా..ఆ..ఆ.. సాగుమ సాహిణీ | |
సాగుమా..ఆ..ఆ.. సాగుమ సాహిణీ | ||
ఆగని వేగమె జీవితము, ఆగని వేగమె జీవితము | ||
ఎవరికోసమో ఏ దరికో ఎరుగక, అడుగక, వేసరక | ||
ఎవరికోసమో ఏ దరికో ఎరుగక, అడుగక, వేసరక | ||
జీవకోటి తరలే..ఏ..ఏ.. జీవకోటి తరలే ఏ.. | ||
మధుర మహాప్రస్థానములో | ||
సాగుమా సాహిణీ, ఆగని వేగమె జీవితము | ||
చరణం: | ఆ..హా..ఆ..హా | |
కనుపడువరకే కాదీ లోకం, కలదింకెంతో సౌందర్యం | ||
కనుపడువరకే కాదీ లోకం కలదింకెంతో సౌందర్యం | ||
దారిపొడుగునా పందిళ్ళే, ఆటలు పాటలు పెళ్ళిళ్ళే | ||
దారిపొడుగునా పందిళ్ళే, ఆటలు పాటలు పెళ్ళిళ్ళే | ||
సాగుమా సాహిణీ, ఆగని వేగమె జీవితము | ||
చరణం: | వెలుగునీడ జలతారు తెరలలో ఓ..ఓ, ఆశనిరాశల అల్లికలో ఓ..ఓ | |
వెలుగునీడ జలతారు తెరలలో, ఆశనిరాశల అల్లికలో | ||
వేసే పిలుపుల మూసే తలుపుల కలకలములుగల కలలో | ||
కలకలములుగల కలలో ఓ.. | ||
సాగుమా సాహిణీ, ఆగని వేగమె జీవితము | ||
ఆగని వేగమె జీవితము, సాగుమా.. |
మంచి పాట గుర్తు చేసారు...
రిప్లయితొలగించండిసినిమా కూడా బాగుంటున్నది..
పాట వీడియో కానీ ఆడియో ఉంటె బాగుండును.
అప్పారావు గారు, ధన్యవాదములు. వీడియో లభించలేదు. ఆడియో ఇచ్చాను గదా. గమనించలేదేమో మీరు.
తొలగించండిthanks for giving audio of a fine song by gaanagandharva
రిప్లయితొలగించండిYou are welcome sir.
తొలగించండిఒక అద్భ్తుమైన పాట.
రిప్లయితొలగించండిపాట లాండింగ్ (ముగింపు) ఎంతో బాగుంది.
నేను ఈ మధ్యనే ఈ సినిమా చూసాను.
శ్రీ .C R సుబ్బరామన్ గారి మార్క్ కనిపిస్తుంది ఈ పాటలో.
స్వచ్చంగా ప్రతి మాట వినిపిస్తుంది, మాస్టారి గళంలో
అది ఒక ఘంటసాల గారికే చెల్లు.. ఈ పాటకు 64 సంవత్సరాలు అంటే
ఎవరు నమ్ముతారు. అది నిత్య నూతనం.
వెంకోబ రావు కాశి
వెంకోబారావు గారికి నమస్కారం. చాల చక్కగా వివరించారు. అలనాటి పాట అయినా ఆపాత మధురం నిజంగా.
తొలగించండిhttp://www.youtube.com/watch?v=mj26VS2zEtc - ఈ సైట్ నుండి సినిమాను చూడవచ్చును
రిప్లయితొలగించండి