19, జనవరి 2013, శనివారం

ఘంటసాల గానంలో హిందోళ రాగ వైభవం - ఆఖరి భాగం


ఘంటసాల తన సంగీతదర్శకత్వంలో చిత్ర కథా సన్నివేశాలకు, పాత్ర స్వభావాలకు అనుగుణంగా రాగాలను ఉచితరీతిగా సంయోజించినా, తనకు ప్రియమైన రాగాలు ఎలాగో ఒక విధంగా, నేపథ్యంలో, గీతాలలో, పద్య రూపాలలో వెలువించే తీరు గమనీయం. 

          లవకుశ చిత్రసంగీతంలో మాస్టారు చేసిన హిందోళరాగ ప్రయోగాలను ఈ వ్యాసం మొదటిభాగంలో గమనించాము. ఘంటసాల సంగీతదర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలోనూ అలాంటి ప్రయోగాలు మనకి కనిపిస్తాయి.




  హిందోళ రాగాలాపన సంకలనం


"పరమానందయ్య శిష్యుల కథ" లో హిందోళ రాగం

          లవకుశ చిత్రం లాగే,  పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో రెండు పాటలు, ఒక శ్లోకం మాస్టారు హిందోళరాగంలో స్వరపరిచారు. అవి నాయిక పాడే శివకీర్తన "ఓ మహదేవ నీపదసేవ" మరియు నర్తకి-నాయిక పోటీపడి నర్తిస్తూ పాడిన "వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణ" మరియు కథానాయకుడు ఆలపించే శివస్తుతి "వందే శంభుముమాపతిం". "ఓ మహదేవ నీపదసేవ" పాటలో రాగభావం, స్వరసంచార సౌమ్యధార, ఇష్టదేవతా భావవిలీన స్థితిని ప్రతిబింబించే భక్తిరస ప్రతిపాదనకు తోడ్పడే విధంగా బాణీ కట్టారు ఘంటసాల మాస్టారు. ఈ పాటలో హిందోళరాగానికి ముందుగా మాస్టారు, తమకు ప్రియమైన మరొక ఔడవరాగం ఉదయరవిచంద్రికను జతచేశారు.

          "వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణ" ఎల్.విజయలక్ష్మి అభినయంచిన ఒక స్పర్ధాత్మకమైన నృత్యసందర్భ గీతానికి మాస్టారు చేసిన స్వరకల్పన వారి శాస్త్రీయంత్య సంగీత వైదుష్యానికి, స్వరలయవిన్యాస వైవిధ్యతా నిర్మాణ సామర్థ్యానికి తార్కాణం. ఈ పాటలో పి.లీల మరియు ఎ.పి.కోమలతో పలికించిన హిందోళరాగ స్వరాలు, ఎడుప్పుల బిగింపుతో, గమక వైవిధ్యముతో, కథాసన్నివేశంలో నందివర్ధన మహారాజు అంతఃపురంలో వుండాలా లేక బయటకు వచ్చి ప్రజలను ఆదుకోవాలా అన్న సంఘర్షణను అత్యద్భుతంగా ప్రతిబింబించారు. ముక్తాయంలోని త్రిశ్ర, పంచమ, మిశ్ర, చతురస్ర గతుల చిన్న కొలతల తాళవిన్యాస నిర్మాణంలో ఘంటసాల మాస్టారు చూపిన లయవిజ్ఞత మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. హిందోళ రాగంలో నాయకీభావప్రధాన శృంగార రసాన్ని, నిదురించిన పరిజ్ఞానాన్ని మేలుకొలుపే వీర, కరుణ రసాలను పండించిన తీరు ప్రశంసనీయం. నర్తకి విజయలక్ష్మి రెండున్నర నిమిషాల విరహ, శృంగార మనోహర భరతనృత్యభంగిమ వైవిధ్యాలొలికిస్తుండగా, మధ్యన ప్రవేశించి నాయకుని చిత్తాన్ని వెలిద్రిప్పే పోటీయేర్పడగా, దానిని నిరోధించి సంఘర్షణకు సంసిద్ధురాలైన రాజనర్తకి యొక్క వికర్షణ భావాన్ని, ఘంటసాల ఒక అద్బుతమైన తాళప్రక్రియలో ఇమిడిన ఈ హిందోళ స్వరబంధాన్ని కూర్చారు. "గసానీ దానిసా- దానీసా; నినీదా మాదనీ మాదానీ; సా,దా, నీ, మా, దా,గా-  సనిదమగసా; దనిస-దనిస-దనిస" మంచి బిగితోసాగే ఈ స్వరప్రస్తారము, దనిసా అనే పకడ్‍ పునరావర్తనంతో. "నీవు నాకు సాటికాదుపో" అనే విధంగా హస్తమును బయటకు మూడుసార్లు తిప్పే విధానము హిందోళరాగంలో విరహభావమూ దాన్ని వెనుకకు మళ్ళించే మేలుకొలుపులు ఘాతరూపంలో అప్పళించే వీరమూ, ఆ ప్రతిబంధాన్ని ఎదురించే క్రోధభావాన్ని దనిస-దనిస-దనిస స్వరావర్తనతో కోమలస్వరాలలోనూ కోపాలభావాలను చూపడం ఆయన ప్రతిభకే చెల్లు.

హిందోళరాగప్రియమైన నారద సంగీతం
          దీపావళి, సతిఅనసూయ చిత్రాలలో నారదపాత్రలకు బాణీకట్టి పాడిన పాటలకు అతి సున్నితమైన, సరళమైన స్వరాలనే సమకూర్చడం సమంజసమే. దీపావళి చిత్రంలో ఆయనే స్వరబరచి పాడిన "కరుణాచూడవయా" భక్తిరసాన్ని వెల్లడిస్తే, అదే బాణీలో పాడిన "అలుకా మానవయా" భయమూ, హాస్యమూ సమ్మిశ్రమై ఆ పాటలలో రసవత్తరమైన హిందోళరాగం మనకు వినిపిస్తుంది. "మమసా గామమమ (కరుణాచూడవయా) అంటూ ప్రారంభమై. నరకుని కోపాన్ని తగ్గించడానికి వినోదభరితంగా స్వరాల్ని జల్లించడం ఒక త్రిశ్రగతి నర్తనానికి తోడుగా ఉంటుంది.  దదని-మమద-గగమ-గమగ-సా  అలుకా మానవయా అన్నప్పుడు ఈ స్వరాలు త్రిశ్ర గతిలో మధ్యమకాలంలో ఉన్నాయి. సానిద నీదమగా, నీదమ దా మగసా, సా సానీదామాగా సా - అలుకా మానవయా అన్న త్రిశ్రగతి స్వరప్రస్తారం మూడవకాలంలో నడుస్తుంది. తరువాత తీవ్రగతి స్వరాలలో, గమదనిసా నిదనీదమగా, సగమదనీ దమదామగసా, ఇక్కడ గమదనిసా, సగమదనీ స్వరాలు నాలుగవకాలంలో అంటే ఒక దెబ్బకు ఆరు అక్షరకాల ప్రమాణంలో ఉంటాయి.  సంగీతవైదుష్యంతో పాటు హాస్య, నాట్య, లయ వైవిధ్యాలు ఇందులో మిళితమైనాయి. దీపావళి చిత్రంలోనె "సరియా నాతో సమరాన నిలువగలడా"అంటూ సత్యభామ పాడే పాటను పి.లీల గళంలో హిందోళరాగంలోనే పండించారు మాస్టారు. దనిసమగా (సరియా) సగమనిదా (నాతో) దనిసగమగసాస (సమరాన) అన్న గమకప్రయోగాలకు సంభ్రమభావాన్ని ముడివేసి, దాటు-అవరోహణ వరసలను కలిపి కల్పించడంతో ఆ పాటలో సమరోత్సాహ భావాలు కలిగింది.
ుణా: ియో

          "కృష్ణప్రేమ" చిత్రంలోని నారదగానం "మోహనరూపా గోపాల, హాతీతము నీలీల" మరొక అద్బుతమైన కృతి. "అవనిభారము అమితము కాగా" అన్న భాగంలోని ఆలాపన వినితీరవలసిన రసఖండిక.  అలాగే "మంచితరుణమురా! నారద మించిన దొరకదురా!" (శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం) అనే నారదగానం హిందోళమేయైననూ విభిన్నమైనదే. కలహబీజాప్తమైన ఉత్సాహనికి సరియైన భావాలొలికించే బాణీలో పాట సాగుతుంది.

"రహస్యం" చిత్రంలో హిందోళరాగం

          రహస్యం చిత్రం, ఘంటసాల స్వరపరచిన మహోన్నత సంగీతకావ్యం. తనకు ప్రియమైన హిందోళరాగంలో ఆ చిత్రంలోని మొదటి శ్లోకాన్ని ఆలపించారు. ఈ చిత్రంలో ఒకపాట -'ఇదియే దేవరహస్యం' మరియు మూడు పద్యాలకు -'శ్రీవిద్యాం జగతాం ధాత్ర్రీం', "ఏనొక రాజచంద్రుడ', 'ముక్తావిద్రుమ' - హిందోళరాగం కూర్చారు. సుశీల, లీల పాడిన ఇదియే దేవరహస్యం ఎక్కువగా వినిపించే పంచమంతో ఇది హిందోళరాగమా అనుకొన్నా, అతి విభిన్నశైలిలో మలచిన ఈ పాట హిందోళ రాగాధారితమైనదే. ససదా నీదగ దమమా (ఇదియే దేవరహ్యసం) అనే సంకీర్ణగమక విన్యాసంలోని అపురూపమైన  "నీదగ" ప్రయోగంతో పాట విలక్షణంగా వినిపిస్తుంది.


హిందోళరాగంలో  శృంగార గీతాలు

          "మంచిమనసులు" చిత్రానికి కె.విమహాదేవన్‍ స్వరబరచగా సుశీలతో మాస్టారు పాడిన పాట "నన్ను వదలినీవు పోలేవులే" అతిమనోహరమైన స్వరసంయోజనలతో హిందోళ రాగాన్ని ఒక యుగళగీతానికి ఎలావాడుకొన్నారో తెలుస్తుంది. ెండ్య స్వరపరచి పాడిన ప్రమీలార్జునీయం చిత్రంలోని "అతి ధీరవేగాని అపురూప రమణివే జాగ్రతా జాగ్రతా" హిందోళ సుమధురగీతమై నిలబడింది. "కలనైనా నీ తలపే" (లీల: శాంతినివాసం), "నేనె రాధనోయి" (భానుమతి: అంతామనమంచికే), "పగలే వెన్నెలా" (జానకి: పూజాఫలం), "పిలువకురా" (సుశీల: సువర్ణసుందరి), "రాజశేఖరా నీపై" (ఘంటసాల-జిక్కీ: అనార్కలి), "మనసేవికసించెరా"  (సుశీల: అమరశిల్పి జక్కన్న), "నీలేతగులాబి పెదవులతో" (ఘంటసాల: మాయింటిదేవత), "జీవనమే ఈ నవజీవనమే హాయిలే" (ఘంటసాల-భానుమతి: నలదమయంతి) మొదలైనవి మరువలేని మధురగీతాలే.


హిందోళరాగంలో పద్యాలు

          ఇక పద్యగానంలో మాస్టారు ఎన్నో శ్లోకాలను, పద్యాలను హిందోళరాగంలో సందర్భయుక్తంగా రసవత్తరంగా ఆలపించారు. తన స్వంత చిత్రం "సొంతవూరు" లో ఆయనే బాణీకట్టి పాడిన అతిమనోహర ప్రకృతి వర్ణన భావాలొలికించే "స్వాగతంబోయి" సీసపద్యంలో హిందోళరాగ స్వరమధురిమ గంగాతరంగ నాట్యానందభావాన్ని స్ఫురిస్తుంది. అలాగే  "పాదుకాపట్టాభిషేకము" చిత్రంలోని ప్రారంభిక వాల్మీకి స్తుతియించిన కందపద్యం "రామయను దివ్యనామము" నిండుభక్తితో ఎదలో మెదలే హిందోళానుసంధానం. "శ్రీకృష్ణాంజనేయ యుద్ధం" చిత్రంలోని "ఏదేవిసౌందర్య", "శాంతినివాసం"లోని "లావొక్కింతయులేదు". "జయసింహ" చిత్రంలోని స్వాప్నిక దృశ్యమైన సుభద్రార్జున ఇతివృత్తంలో "కృతక యతికి పరిచర్యు", "దేవాంతకుడు" చిత్రంలోని "ఇటుప్రక్క సూర్యుడే అటుప్రక్క ఉదయించి" మరియు "భూభువర్లోకాలపురమునందున నిన్ను".  "కంచుకోట" చిత్రంలో మత్తులో ఆలపించె "ఎచటనోగల స్వర్గమ్మునిచట ద్రించి".  "రాజకోట రహస్యం" చిత్రంలోని పద్యం "కామాంధకార కీకారణ్యమున జిక్కి". "భీష్మ" చిత్రంలోని "ఆదిపన్నగ శయనా", "శ్రీకృష్ణావతారం" చిత్రంలోని ఉద్యోగపర్వ సందర్భాన పాడిన చంపకమాల "అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాతశత్రుడే అలిగిననాడు". "శ్రీకృష్ణపాండవీయం" చిత్రంలోని రుక్మిణీకల్యాణ ఘట్టంలో ఆలపించిన బమ్మెఱపోతన ప్రణీత, భాగవతాంతర్గత మత్తేభ వీక్రీడితం, "కనియెన్‍ రుక్మిణిచంద్రమండలముఖున్" అనేది శ్రీకృష్ణ రూపాతిశయముల అంగోపాంగ వర్ణనాత్మక దృశ్యానికి శాంతమధుర స్వరవ్యాఖ్యానం.

          అలాగే స్వరబ్రహ్మ సుసర్ల  స్వరపరచిన "నర్తనశాల" చిత్రంలో ఊర్వశీప్రలోభనకు లొంగక, తన సౌశీల్యాన్ని ప్రకటించిన అర్జునుడు, ఏకారణంగా ద్రౌపదికి ఐదుగురు భర్తలు కలిగెరో వివరించే "ఆడితప్పనిమాయమ్మ అభిమతాన", గోగ్రహణ సందర్భంలో దుర్యోధనుని మందలించి పాడిన ఆంధ్రమహాభారతాంతర్గత సీసపద్యరత్నం "ఏనుంగునెక్కి పెక్కేనుంగుల" హిందోళరాగంలో పద్యాలాపనచేసే విధానానికి మరికొన్ని దృష్టాంతాలు.

          ఇంచుమించుగా మాస్టారు స్వర సారధ్యం  చేపట్టిన అన్ని చిత్రాల్లోను హిందోళరాగ ఏదో ఒక రూపంలో గోచరిస్తుంది. "పాదుకాపట్టాభిషేకం" లోని ప్రథమ శ్లోకం "రామయను దివ్యనామము", "శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం" లోని "జయజయ శ్రీమన్నారాయణా" అన్న రాగమాలికాభాగం "దానమడిగి మూడగులనేల బలిదానవునణచిన వామనావతార", అలాగే, "వాల్మీకి" చిత్రంలోని "శ్రీరామాయణ కావ్యకథా" (రావణరాఘవ సమరములోన చావడు రావణుడెంతటికైన), "రహస్యం" చిత్రంలోని గిరిజాకల్యాణం రాగమాలికలలో "సామజసాగమ సాకార", "పాండవనవాసము" చిత్రంలో భీమాంజనేయులు కలసిన సన్నివేశంలో భీముడు ఆంజనేయుని హృదయుమున శ్రీరాముని గాంచినంత పాడిన శ్లోకం "శ్రీరామచంద్రం శ్రితపారిజాతం" ఇవన్నీ హిందోళ సందోహమే.

నాట్య సన్నివేశాలలో హిందోళరాగం

          "గుండమ్మ కథ" చిత్రంలో ఎల్.విజయలక్ష్మి నృత్యానికి మాస్టారు సృజించిన వాద్యసంగీతంలో మాల్కోన్స్ ఛాయ చక్కగా వినిపిస్తుంది. అంతే ుం్మ ి్రలో ్లు (ి్స్) డేనేథ్యలో ిిింిాయిద్య  ిందోమే.
  గుండమ్మ కథ టైటిల్ మ్యూజిక్ 
బహుశా ఆయనకు బడేగులాం ఆలీఖాన్ సాహచర్యం ఆరోజులదేనేమో. "పరమానందయ్య శిష్యులకథ" లోని హిందోళరాగాధారిత నృత్యసన్నివేశాన్ని ఇదివరకే చెప్పుకొన్నాం. పెండ్యాల స్వరసారథ్యంలో "మహామంత్రి తిమ్మరుసు" చిత్రంలోని నృత్యసన్నివేశానికి పి. లీలతో పాడిన గీతం "జయవాణీ చరణకమలసన్నిధిమన సాధన" అతి రసవంతమైన సన్నివేశానికి హిందోళం వన్నెతెచ్చింది. గమమససా (జయవాణీ) దనిదమమమ (చరణకమల) గమగసనిద (సన్నిధిమన) గమగమా (సాధనా).  "సస గగ మమ గమ దాపదామమాగస పప దద నిని దద మామగాసమాగస" అనే స్వరాలలో పంచమస్వరం కలిపి నాగిన్ బాణీని ఎల్.విజయలక్ష్మి నాట్యానికి కలిపి వినూతనత్వం సాధించారు పెండ్యాల. ఘంటసాల మాస్టారు పాటమధ్యలో విశేష గమకప్రయోగాలతో త్రిస్ధాయిలో వినిపించిన ఆలాపన ఖండిక రాగసారాన్ని పట్టిచూపింది.

ఇలా ఎన్ని పాటలను ఉదహరించినా అది వొక పట్టిక ఔతుందే తప్ప, ఆ రసపట్టు పట్టడానికి పాటలను వినితీరాల్సిందే. లభ్యమైన కొన్ని హిందోళ మధురిమలను ఇక్కడ మీరు వినగలరు. మరొక ఘంటసాల ప్రియరాగ స్వరసంస్మరణంతో మళ్ళీ కలుద్దాం.
 
 ిందోళం లో ్లోం: లక్ష్మీపతే నిగమ
ి్ర: శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం
 
 ్ష్మతే ి ్ష్య ిస్వ ి దో ిహి బోాయిన్‌
త్యి ్ధదేవ్రీవేంటేశ దేహి ావమ్‌  

           ఓం నమో వేంకటేశాయ!

 
(ఈ వ్యాసరచనకు మూలస్ఫూర్తి మరియు ప్రేరణ శతావధాని డా. ఆర్. గణేశ్ గారు. ఆయన తమ కావ్యశాస్త్ర, అవధాన, యక్షగాన, నాట్య, సాహిత్య, శిల్పాది వివిధ క్షేత్రాలలో కర్ణాటకదేశంలో సుప్రసిద్ధులు. ఘంటసాల గళమన్నా, సంగీతమన్నా ఆయనకి తీవ్రమైన ప్రేమానుభూతి. ఘంటసాల గురించి ఆయన తమ "రాగానురాగ" అనే సంగీత-సాహిత్య సమన్వయ కార్యక్రమంలో ముచ్చటిస్తూ ఉంటారు. ఆయన కోరిక మేరకు ఈ సుదీర్ఘ వ్యాసలేఖనం సమకూర్చడమైనదిగాన ఇది వారికి మా స్నేహాంజలి).

(వ్యలో అం్గ భ్య ద్యు, ిిం్పు. ిం.)

16 కామెంట్‌లు:

  1. మంచి వ్యాసం వ్రాసేరు. ధన్యవాదములు.
    కొన్ని సవరణలు మరి కొన్ని సందేహాలు.

    ప్రమీలార్జునీయం చిత్రానికి సంగీతం మాస్టారు కాదు, పెండ్యాల అని నాకు గుర్తు.
    "ఏ దేవి సౌందర్యమ” అనే పద్యము శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం లోనిది.
    రాజకోట రహస్యం లోని "కామాంధకార కీకారణ్యమున జిక్కి" పద్యం "షణ్ముఖ ప్రియ" అని అనుకుంటాను, ఈ పద్యానికి, "శ్రీ శైల వాస శేషాద్రి వాస" అనే పద్యానికి పోలికలు కనిపిస్తాయి, ముఖ్యంగా చివర రాగాలాపన లో. ఆ పద్యం మరియు తరువాత వచ్చే పాట "తిరు వేంకటాధీశ జగధీశ" కూడా షణ్ముఖ ప్రియ రాగం అని విన్నాను.
    గుండమ్మ కథ 1962 లో వచ్చింది. బడేగులాం ఆలీఖాన్ తో సాహచర్యం ఘంటసాలకు 1950/51 ప్రాంతం నుంచి వుందని విన్నాను.

    రామ ప్రసాద్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామ ప్రసాద్ గారికి, మనః పూర్వక ధన్యవాదాలు. మీరు చెప్పినట్టుగా ఏదేవి సౌందర్య శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం లోనిదే. సరి చేశాను. రాగ శాల గురించి శ్రీ చంద్రమౌళి గారు స్పందిస్తారు.

      తొలగించండి
    2. అజ్ఞాతజనవరి 22, 2013

      For Prameelaarjuneeyam, It was Master Venu but not Pendyala who composed. The popular duet-'talachukunte menu pulakarinchenu' by Ghantasala, Susheela is from this film only. Ghantasala Maastaaru developed his liking for Raageshree raagam and that was the time he had a great opportunity to have Ustad Bade Ghulam Ali Khan right in front of him. Ghantasala, being fascinated for Light Music (Lalita Sangeetam), tried to establish film songs little similar to Ghazals and he aptly tried them with Rageshree. Hindolam or Malkaus was normally chosen for dance bits. However, Ghantasala Maastaaru made an excellent hindolam based Ghazal type bhavageetam-kalanainaa nee valape for the film Santinivasam.

      తొలగించండి
    3. శ్రీయుతులైన రామ ప్రసాద్ గారికి నమస్సులు. మీ రాగావగాహన ప్రశంసనీయం. "కామాంధకార కీకారణ్యమున జిక్కి" అనే సీసపద్యాన్ని పంచరాగాలతో పాడారు మాస్టారు. మొదటి పాదం: కామాంధకీకార : హిందోళం, రెండవ పాదం: క్రోధానలజ్వాల: మధ్యమావతి, మూడవ పాదం: ద్రోహ...: మోహనరాగం, నాల్గవ పాదం: మోహాంబుధిని: బిలహరి. పద్యం ముగింపునొసగే తేటగీతి : మదము... షణ్ముఖప్రియరాగం. తిరువేంకటాధీశ షణ్ముఖప్రియరాగనిబద్ధమే.

      తొలగించండి
    4. శ్రీ చంద్రమౌళి గారికి, మీ వివరణతో చాల అమూల్యమైన విషయాలు తెలిసాయి. ముఖ్యంగా పద్యంలో ప్రతి పాదానికి ఒక రాగాన్ని ఎన్నుకున్నారని తెలిసి చాల ఆనందం కలిగింది. మాస్టారు ఈ విధంగా కొన్ని పద్యాలకు ఇదివరలో బాణీ కట్టారు. "అదిగో జగన్నాధుడాశ్రితావళి" ఆ కోవకు చెందుతుంది కదా!

      తొలగించండి
    5. చంద్రమౌళి గారు, మీ వివరణకు చాలా ధన్యవాదాలు.
      నాకు సంగీతం గురించి, రాగాల గురించి తెలిసింది చాలా తక్కువ. కాని కొన్ని కొన్ని చోట్ల పాటలకి, పద్యాలకి మధ్య ఉన్న పొలికలను గుర్తు పట్టగలను.
      మీ వివరణ తరువాత ఆ పద్యాన్ని మళ్ళీ విన్నాను, మీరు వివరించిన రాగాలను కొంతవరకు గ్రహించ గలిగాను. నా కున్న సంగీత ఙానమంతా మీలాంటి వాళ్ళు వ్రాసే ఇటువంటి వ్యాసాల ద్వారా సంపాదించిందే.
      మీ నుంచి ఇలాంటి మరిన్ని వ్యాసాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
      రామ ప్రసాద్

      తొలగించండి
  2. మంచి వ్యాసం వ్రాసేరు. ధన్యవాదములు.
    కొన్ని సవరణలు మరి కొన్ని సందేహాలు.

    ప్రమీలార్జునీయం చిత్రానికి సంగీతం మాస్టారు కాదు, పెండ్యాల అని నాకు గుర్తు.
    "ఏ దేవి సౌందర్యమ” అనే పద్యము శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం లోనిది.
    రాజకోట రహస్యం లోని "కామాంధకార కీకారణ్యమున జిక్కి" పద్యం "షణ్ముఖ ప్రియ" అని అనుకుంటాను, ఈ పద్యానికి, "శ్రీ శైల వాస శేషాద్రి వాస" అనే పద్యానికి పోలికలు కనిపిస్తాయి, ముఖ్యంగా చివర రాగాలాపన లో. ఆ పద్యం మరియు తరువాత వచ్చే పాట "తిరు వేంకటాధీశ జగధీశ" కూడా షణ్ముఖ ప్రియ రాగం అని విన్నాను.
    గుండమ్మ కథ 1962 లో వచ్చింది. బడేగులాం ఆలీఖాన్ తో సాహచర్యం ఘంటసాలకు 1950/51 ప్రాంతం నుంచి వుందని విన్నాను.

    రామ ప్రసాద్

    రిప్లయితొలగించండి
  3. Mallaiah Anchooriజనవరి 20, 2013

    మనసును డోళలాడిస్తుంది గనుకనే దీన్ని "హిందోళం" అన్నారేమో!! నా భాష, పరిగ్యానము సరిపోదు దీని గురించి వ్రాయడానికి!!

    రిప్లయితొలగించండి
  4. Mallaiah Anchooriజనవరి 20, 2013

    We feel as if there should not have been any end for publishing such educative & researched artlcles presentations as this.The author needs to be thanked profusely.The presentation has two beauties embedded in it..one is the very description detailing the greatness of the Ragaa & the secong hearing such songs in Hindola through the voice of Maastaaru!!I am sure that this weekly off is sure to make us very very meaningful & blessed with listening to all songs in this Raaga which I like most,as I submitted earlier itself.

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాతజనవరి 22, 2013

    మల్లయ్య గారూ .. ఏ రాగమైనా మనసును ఆనంద డోలికలు ఊపి, ఆ స్వరకర్త విన్యాసానికి తల తిరిగేలా చేస్తుంది. తల తిరిగితే లత- కనుక ఎన్నో ఉదాహరణలు లతలా అల్లుకు పోతాయి. అలా అలా అల్లుకుపోతూ ఏ తుప్పలోనో పడిపోయే ప్రమాదమూ ఉంది. సినిమాల్లో హిందోళం రెండు భావ ప్రకటనల కోసం వాడుతారని నా పరిశీలన. ఒకటి - నిజమో కాదో, అవునో కాదో, నేనో, తానో, నచ్చుతానో, నచ్చనో, మెచ్చుతుందో, మెచ్చదో వంటి సందిగ్ధావస్థ లో పడినప్పుడు- దీన్నే డోలాయమాన స్థితి అని అనవచ్చు. రెండోది - నాకేం తక్కువ, చూపిస్తే నా మీదే చూపించాలి మక్కువ - అనే ఆత్మ విశ్వాసం (పొగరు అని కొందరు వక్రీకరిస్తారు) వ్యక్తం చేసే స్థితి (మొదటిదానికి పూర్తిగా విరుద్ధం). తీగ లాగుదాం- ఇదీ ఉదాహరణల డొంక : వనిత తనంతట ..పాట లో రెండు స్థితులూ ఉన్నాయి. కరుణా చూపవయా /అలుకా మానవయా - మొదటి స్థితి, ఈ వీణ పైన పలికిన రాగం (కలిమి,లేమి డోలాయమాన స్థితిలోనే ఆత్మ విశ్వాసం), మనసే అందాల బృందావనం (రాధ,సత్యభామల డోలాయమాన స్థితి), అనురాగరాశీ ఊర్వశీ (ఆత్మవిశ్వాసం), వీణ వేణువైన సరిగమ విన్నావా (వీణ,వేణువు,తీగ,రాగం అనే డోలాయమానం ఏకం చేసే ఆత్మవిశ్వాసం), ఎన్నో ఎన్నెనో. ఎవరైనా నవ్వుకోవచ్చు- మరి మనసా తుళ్ళిపడకే అనే పాటలో నచ్చాడో,లేదో, వస్తుందో,రాదో వంటి డోలాయమానం ఉందే, మరి హిందోళంలో స్వరపరచలేదేం? అని! అది 'కళ్యాణ' తరుణంలో తరుణి సందిగ్ధం కదండీ. అంచేత 'కల్యాణి' వాడారు రమేష్ నాయుడు గారు.

    చాలామటుకు పాటలు హిందోళంలో ఉండడానికి కారణం -ఆ పాటల్లో ఎక్కడో ఒకచోట 'ఊయల/ఉయ్యాల' అనే పదం రావడం. మళ్ళీ మరో డొంక: పగలే వెన్నెల జగమే ఊయల, నాకంటి పాపలో నిలిచిపోరా (వలపుటుయ్యాలలో), నన్ను వదలి నీవు (హృదయాలు ఉయ్యాల). అందుకు పూర్తిగా విరుద్ధం ఉయ్యాల పదం ఉన్నా కల్యాణి రాగంలో కొన్ని పాటలు రావడం- ఊయల లూగినదోయి మనసు, మావారు శ్రీవారు మామంచి వారు, ఊహల ఉయ్యాల నాలో ఊగెను ఈవేళ.

    చిత్రమైన సీమ కనుక సినిమా రంగం 'చిత్ర సీమ' అయింది. పాట బాగా పాడితే పదికాలాలు అది చెవులకింపు, పాట సన్నివేశం బావుంటే పదికాలాలు అది చూపులకింపు. రాగం కన్నా అనురాగం సినిమా పాటకి కొలమానం-ఇదీ నా ముగింపు.

    రిప్లయితొలగించండి
  6. tatiraju venugopalజనవరి 22, 2013

    మల్లయ్య గారూ .. ఏ రాగమైనా మనసును ఆనంద డోలికలు ఊపి, ఆ స్వరకర్త విన్యాసానికి తల తిరిగేలా చేస్తుంది. తల తిరిగితే లత- కనుక ఎన్నో ఉదాహరణలు లతలా అల్లుకు పోతాయి. అలా అలా అల్లుకుపోతూ ఏ తుప్పలోనో పడిపోయే ప్రమాదమూ ఉంది. సినిమాల్లో హిందోళం రెండు భావ ప్రకటనల కోసం వాడుతారని నా పరిశీలన. ఒకటి - నిజమో కాదో, అవునో కాదో, నేనో, తానో, నచ్చుతానో, నచ్చనో, మెచ్చుతుందో, మెచ్చదో వంటి సందిగ్ధావస్థ లో పడినప్పుడు- దీన్నే డోలాయమాన స్థితి అని అనవచ్చు. రెండోది - నాకేం తక్కువ, చూపిస్తే నా మీదే చూపించాలి మక్కువ - అనే ఆత్మ విశ్వాసం (పొగరు అని కొందరు వక్రీకరిస్తారు) వ్యక్తం చేసే స్థితి (మొదటిదానికి పూర్తిగా విరుద్ధం). తీగ లాగుదాం- ఇదీ ఉదాహరణల డొంక : వనిత తనంతట ..పాట లో రెండు స్థితులూ ఉన్నాయి. కరుణా చూపవయా /అలుకా మానవయా - మొదటి స్థితి, ఈ వీణ పైన పలికిన రాగం (కలిమి,లేమి డోలాయమాన స్థితిలోనే ఆత్మ విశ్వాసం), మనసే అందాల బృందావనం (రాధ,సత్యభామల డోలాయమాన స్థితి), అనురాగరాశీ ఊర్వశీ (ఆత్మవిశ్వాసం), వీణ వేణువైన సరిగమ విన్నావా (వీణ,వేణువు,తీగ,రాగం అనే డోలాయమానం ఏకం చేసే ఆత్మవిశ్వాసం), ఎన్నో ఎన్నెనో. ఎవరైనా నవ్వుకోవచ్చు- మరి మనసా తుళ్ళిపడకే అనే పాటలో నచ్చాడో,లేదో, వస్తుందో,రాదో వంటి డోలాయమానం ఉందే, మరి హిందోళంలో స్వరపరచలేదేం? అని! అది 'కళ్యాణ' తరుణంలో తరుణి సందిగ్ధం కదండీ. అంచేత 'కల్యాణి' వాడారు రమేష్ నాయుడు గారు.

    చాలామటుకు పాటలు హిందోళంలో ఉండడానికి కారణం -ఆ పాటల్లో ఎక్కడో ఒకచోట 'ఊయల/ఉయ్యాల' అనే పదం రావడం. మళ్ళీ మరో డొంక: పగలే వెన్నెల జగమే ఊయల, నాకంటి పాపలో నిలిచిపోరా (వలపుటుయ్యాలలో), నన్ను వదలి నీవు (హృదయాలు ఉయ్యాల). అందుకు పూర్తిగా విరుద్ధం ఉయ్యాల పదం ఉన్నా కల్యాణి రాగంలో కొన్ని పాటలు రావడం- ఊయల లూగినదోయి మనసు, మావారు శ్రీవారు మామంచి వారు, ఊహల ఉయ్యాల నాలో ఊగెను ఈవేళ.

    చిత్రమైన సీమ కనుక సినిమా రంగం 'చిత్ర సీమ' అయింది. పాట బాగా పాడితే పదికాలాలు అది చెవులకింపు, పాట సన్నివేశం బావుంటే పదికాలాలు అది చూపులకింపు. రాగం కన్నా అనురాగం సినిమా పాటకి కొలమానం-ఇదీ నా ముగింపు.

    రిప్లయితొలగించండి
  7. అజ్ఞాతజనవరి 22, 2013

    మల్లయ్య గారూ .. ఏ రాగమైనా మనసును ఆనంద డోలికలు ఊపి, ఆ స్వరకర్త విన్యాసానికి తల తిరిగేలా చేస్తుంది. తల తిరిగితే లత- కనుక ఎన్నో ఉదాహరణలు లతలా అల్లుకు పోతాయి. అలా అలా అల్లుకుపోతూ ఏ తుప్పలోనో పడిపోయే ప్రమాదమూ ఉంది. సినిమాల్లో హిందోళం రెండు భావ ప్రకటనల కోసం వాడుతారని నా పరిశీలన. ఒకటి - నిజమో కాదో, అవునో కాదో, నేనో, తానో, నచ్చుతానో, నచ్చనో, మెచ్చుతుందో, మెచ్చదో వంటి సందిగ్ధావస్థ లో పడినప్పుడు- దీన్నే డోలాయమాన స్థితి అని అనవచ్చు. రెండోది - నాకేం తక్కువ, చూపిస్తే నా మీదే చూపించాలి మక్కువ - అనే ఆత్మ విశ్వాసం (పొగరు అని కొందరు వక్రీకరిస్తారు) వ్యక్తం చేసే స్థితి (మొదటిదానికి పూర్తిగా విరుద్ధం). తీగ లాగుదాం- ఇదీ ఉదాహరణల డొంక : వనిత తనంతట ..పాట లో రెండు స్థితులూ ఉన్నాయి. కరుణా చూపవయా /అలుకా మానవయా - మొదటి స్థితి, ఈ వీణ పైన పలికిన రాగం (కలిమి,లేమి డోలాయమాన స్థితిలోనే ఆత్మ విశ్వాసం), మనసే అందాల బృందావనం (రాధ,సత్యభామల డోలాయమాన స్థితి), అనురాగరాశీ ఊర్వశీ (ఆత్మవిశ్వాసం), వీణ వేణువైన సరిగమ విన్నావా (వీణ,వేణువు,తీగ,రాగం అనే డోలాయమానం ఏకం చేసే ఆత్మవిశ్వాసం), ఎన్నో ఎన్నెనో. ఎవరైనా నవ్వుకోవచ్చు- మరి మనసా తుళ్ళిపడకే అనే పాటలో నచ్చాడో,లేదో, వస్తుందో,రాదో వంటి డోలాయమానం ఉందే, మరి హిందోళంలో స్వరపరచలేదేం? అని! అది 'కళ్యాణ' తరుణంలో తరుణి సందిగ్ధం కదండీ. అంచేత 'కల్యాణి' వాడారు రమేష్ నాయుడు గారు.

    చాలామటుకు పాటలు హిందోళంలో ఉండడానికి కారణం -ఆ పాటల్లో ఎక్కడో ఒకచోట 'ఊయల/ఉయ్యాల' అనే పదం రావడం. మళ్ళీ మరో డొంక: పగలే వెన్నెల జగమే ఊయల, నాకంటి పాపలో నిలిచిపోరా (వలపుటుయ్యాలలో), నన్ను వదలి నీవు (హృదయాలు ఉయ్యాల). అందుకు పూర్తిగా విరుద్ధం ఉయ్యాల పదం ఉన్నా కల్యాణి రాగంలో కొన్ని పాటలు రావడం- ఊయల లూగినదోయి మనసు, మావారు శ్రీవారు మామంచి వారు, ఊహల ఉయ్యాల నాలో ఊగెను ఈవేళ.

    చిత్రమైన సీమ కనుక సినిమా రంగం 'చిత్ర సీమ' అయింది. పాట బాగా పాడితే పదికాలాలు అది చెవులకింపు, పాట సన్నివేశం బావుంటే పదికాలాలు అది చూపులకింపు. రాగం కన్నా అనురాగం సినిమా పాటకి కొలమానం-ఇదీ నా ముగింపు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేణుగోపాల్ గారు మీ విశ్లేషణ అద్భుతంగా వుంది. చాల చక్కని విషయాలు తెలిపారు. మీ వివరణ చదువుతుంటే నిజంగా మనసు ఆనంద డోలికలలో ఊగింది. మీ స్పందనకు శత సహస్ర ధన్యవాదాలు.

      తొలగించండి
  8. అజ్ఞాతజనవరి 23, 2013

    శ్రీ రామ్ ప్రసాద్ గారూ,

    క్షమించాలి. మీరన్నట్టు ప్రమీలార్జునీయం చిత్రానికి పెండ్యాల మాస్తారుగారే సంగీత దర్శకులు. మాస్టర్ వేణు ప్రతిజ్ఞాపాలన చిత్రానికి. రెండు 'ప్ర'కారాలు నన్ను తికమకలో పడేశాయి.
    సూనా గారూ , చంద్రమౌళి గారూ ...
    కృష్ణప్రేమ బ్లాగులో బందిపోటు చిత్రంలోని మల్లియలో మల్లియలో పాట చేర్చా కదా.. చూడబోతే అందులో పల్లవిలోనే ఊయల ప్రసక్తి వచ్చింది. అయితే రాగం హిందోళం కానే కాదు. అంతెందుకు, ఘంటసాల మాస్టారు 'అభిమానం' కోసం 'ఊయలలూగీ నా హృదయం' యుగళ గీతం హిందోళంలో కాక ఆయనకిష్టమైన రాగేశ్రీ లో చేశారు.
    అసలు జవాబు దొరకని ప్రశ్న- మహానుభావులు త్యాగయ్య ఒక్కొక్క రాగం అనుకునీ కీర్తన అల్లారా, లేక కీర్తన మొత్తం కుదిరాక రాగం అనుకున్నారా? అన్నది.
    మనసు కవి గొప్పగా అన్నాడు - ' ఏ రాగమో ఇది ఏ తాళమో ..అనురాగానికనువైన శృతి కలిపినామో'. ప్రారంభంలో ట్రైన్ నడుస్తున్న శబ్దం ఉంటుంది. సత్యం ఎంచక్కా తిలంగ్ రాగం ఎంచుకున్నారు.

    ట్రైన్ అనగానే జోక్ గుర్తొచ్చింది. ఒకరు రాజేశ్వరరావు గారిని రైల్వ్ స్టేషన్ లో కలిసి సంభాషిస్తున్నారట. ఇంతలో ఒక ఇంజన్ కుయ్ అని కూ సి వెళ్ళిపోయిందట. ఆ మిత్రుడు, 'గురువుగారూ, ఈ ఇంజను కూత ఏ రాగమంటారూ? అని అడిగితే 'స్వర'రాగేశ్వరులు తడుముకోకుండా,'ఈ ఇంజనులు చిత్తరంజన్ లో తయారౌతాయి కదా, అందుచేత ఇంజను కూతది చిత్తరంజని రాగం' అని అన్నారట.

    ఏక స్వరంలో రాగం కట్టాను అంటారు పండితులు బాలమురళీ కృష్ణ గారు. కోయిలది ఒకే ఒక్క పంచమ స్వరమే. 'ఏక రాగిణి' అని పిలవలేమా కోయిలని?

    కోయిల, నెమలి అనగానే ఇటీవల రేగిన దుమారం గుర్తొస్తోంది. బొంబాయి జయశ్రీ మేడం గారికి ఆస్కార్ దక్కే ఆస్కారముంది అని వార్త వచ్చింది. ఆమె ఓ పాట రాశారు. అయితే అది మా పూర్వీకుల రచనని పోలి ఉంది అని అడ్డు తగిలారు కొందరు. అందులో కోయిల,నెమలి ఉంటాయి. అరరె.మన డా సి.నా.రె అరవైల కాలంలో పూజాఫలం సినిమా కోసం 'పగలే వెన్నెల' వ్రాసినప్పుడు కోయిల(పికము),నెమలి వచ్చాయే! పాటకి రాగం హిందోళం (అదీ కొంత హిందీలోని ఆధా హై చంద్రమా.. నుంచి గ్రహించినదే)! అంటే ఇవాళ కోయిల,నెమలి పదాలు వేస్తే జాగర్తగా ఉండాలన్నమాట. ఆస్కార్ వస్తుందో రాదో అనే డోలాయమాన పరిస్థితి!

    -తాతిరాజు వేణుగోపాల్

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాతజనవరి 23, 2013

    నాలుగు పాదాల సీసం, తరువాత వచ్చే తేటగీతి వెరసి వచ్చిన 'కామాంధకార' పద్యానికి అయిదు రాగాలు అని గమనించిన చంద్రమౌళి గారికి జోహారు. మదమత్సర మోహ మనే మకార పంచమం కనుక అటువైపు పడే ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాగం ఉపయోగించి ఉంటారు. ఇక రాజకోట రహస్యం చిత్రానికి విజయా కృష్ణమూర్తి సంగీతదర్శకులు. వీరిపై తోటకూర వెంకటరాజు అనబడు టి వి రాజు గారి ప్రభావం ఉంది. 'ఈశ్వరీ జయము నీవే' ఈ చిత్రం లోని పాటే. కనుక ఆ ఈశ్వరి తనయుడు షణ్ముఖ పరంగా ఆ పద్యాన్ని ముగించి చెడ్డవారికి కనువిప్పు కలిగేలా చేసి ఉంటారు. నిజంగా ఇది దాచుకోదగ్గ పద్యం. -తాతిరాజు వేణుగోపాల్, పుణే

    రిప్లయితొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (2) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (4) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (2) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (4) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (2) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కధ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (3) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (6) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (87) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (55) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (36) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఓగిరాల (2) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (85) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (33) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (40) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (15) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (20) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (41) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (2) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (4) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (27) ర-బమ్మెఱ పోతన (2) ర-బలిజేపల్లి (1) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (29) ర-సదాశివ బ్రహ్మం (8) ర-సదాశివబ్రహ్మం (1) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (44) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)