1961 లో విడుదలైన సీతారామ కల్యాణం చిత్రం శ్రీ ఎన్.టి.ఆర్. స్వీయ దర్శకత్వంలో అతని సోదరుడైన త్రివిక్రమరావు గారు ఎన్.ఏ.టి. పతాకంపై నిర్మించిన పౌరాణిక దృశ్య కావ్యం. సంగీతం శ్రీ గాలి పెంచల నరసింహారావు గారు. ఈ చిత్రంలోనిదే "సీతారాముల కల్యాణము చూతము రారండి" అనే పాట ఈ నాటికీ ప్రతి పెళ్ళిలోనూ వినబడుతుంది. ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, ఎన్.టి.ఆర్. నటన, గాలి పెంచల నరసింహారావు గారి సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు. అయితే నిజానికి ఈ పాట, స్తోత్రం శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు స్వరపరచి కారణాంతరాల వలన తప్పుకున్నారట. ఈ చిత్రంలో శివుడు, పార్వతి కైలాసంలో తాండవం చేసే సమయంలో రావణుడు వస్తాడు. నంది శివదర్శనానికి అనుమతించకపోతే లంకేశ్వరుడు పర్వత సానువులో కూర్చుని స్వయం విరచిత శివతాండవ స్తోత్రాన్ని గానం చేస్తాడు. మూల స్తోత్రంలో 15 చరణాలున్నాయి. కాని సినిమాలో కొద్ది భాగం మాత్రమే ఉపయోగించారు. అది మాస్టారు అద్భుతంగా గానం చేసారు. అయితే కొన్ని పదాలను కూడ కారణాంతరాల వలన మార్చినట్లు కనబడుతుంది. ఈ స్తోత్రం యొక్క మొత్తాన్ని ఇక్కడ చూడవచ్చును. సినిమాలో ఈ స్తోత్రం "కానరార కైలాస నివాస" అనే సముద్రాల సీ. వ్రాసిన పాట తరువాత వస్తుంది. ఈ చిత్రంలో దాదాపు 26 వరకు పాటలు, పద్యాలు వున్నాయి.
చిత్రం: | సీతారామ కల్యాణం (1958) | ||
పాట రచన: | సముద్రాల రాఘవాచార్య | ||
స్తోత్రం: | రావణాసుర విరచితము | ||
సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు (గాలి పెంచల) | ||
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు |
పాట: | పల్లవి: | కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా హరా | |
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా | |||
కానరార | |||
భక్తజాల పరిపాల దయాళా | | భక్తజాల | | ||
హిమశైల సుతా ప్రేమలోలా | |||
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా | |||
కానరార | |||
చరణం: | నిన్ను చూడ మది కోరితిరా.. | ||
నిన్ను చూడ మది కోరితిరా నీ సన్నిధానమున చేరితిరా | | నిన్ను చూడ | | ||
కన్నడ సేయక కన్ను చల్లగ మన్నన సేయర గిరిజారమణా | |||
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా | |||
కానరార | |||
చరణం: | సర్ప భూషితాంగ, కందర్ప దర్పభంగ | | సర్ప | | |
భవ పాశనాశ, పార్వతీ మనోహర | |||
హే! మహేశ, వ్యోమకేశ, త్రిపురహర | |||
కానరార కైలాస నివాస బాలేందుధరా జటాధరా | |||
కానరార |
స్తోత్రం: | జయత్వదభ్ర విభ్రమత్ భ్రమద్భుజంగమస్ఫురత్ | |
ధగద్ధగద్వినిర్గమత్ కరాళఫాల హవ్యవాట్! | ||
ధిమిద్ధిమిద్ధిమిద్ద్వనన్ మృదంగ తుంగ మంగళ | ||
ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః | ||
ఓం నమః శివాయ | ||
అగ(ఖ)ర్వ సర్వ మంగళా కళాకదంబ మంజరీ | ||
రసప్రవాహ మాధురీ విజృంభణా మధూవ్రతం | ||
స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం | ||
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే | ||
ఓం నమః హరాయ | ||
ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలి మఝ్ఝటా | ||
విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం | ||
స్మరచ్ఛిదం, పురచ్ఛిదం, భవచ్ఛిదం, మఖచ్ఛిదం | ||
గజచ్ఛికాంధకచ్ఛిదం తమంత కచ్ఛిదం భజే |
ఈ స్తోత్రంలో కొద్ది భాగాన్ని 1972 లో శ్రీ బాపు దర్శకత్వంలో విడుదలయిన సంపూర్ణరామాయణం చిత్రంలో మాధవపెద్ది పాడగా, రావణపాత్రధారి శ్రీ ఎస్.వి.ఆర్. పై చిత్రీకరించారు.
ఋషి పీఠం నుంచి పద్యాల వివరణ:
(కొన్ని పదాలలో మార్పులున్నాయని గమనించగలరు)
మొదటి పద్యం: జయతు - సర్వోత్కృష్టుడై రాజిల్లు గాక!; అదభ్ర - అధికమైన; విభ్రమభ్రమత్ - వేగంగా తిరుగుతున్న; భుజంగమశ్వశత్ - బుసకొట్టు పాములచేత (సినిమాలో భుజంగమస్ఫురత్ అని వుంది); వినిర్గమత్ - వెలికి వస్తూ; క్రమస్ఫురత్ - క్రమంగా మెరుస్తున్న; కరాల(ళ) - భయంకరమైన; ఫాల -నుదుట; హవ్యవాట్ - అగ్ని కలవాడు; ధిమిద్ధిమిద్ధ్వనత్ - ధిమి ధిమి ధ్వనులు మ్రోగుతున్న; మృదంగ - మద్దెల యొక్క; తుంగ - మిక్కిలియైన; మంగళ ధ్వని క్రమ - మంగళమయ ధ్వనులననుసరించి; ప్రవర్తిత - సాగించబడిన; ప్రచండ తాండవ - ప్రచండంగా తాండవిస్తున్న; శివః - శివుడు.
తాత్పర్యం: అధికమైన వేగంతో తిరుగుతున్న సమయంలో పాములు బుసలు కొడుతుండగా, వెలికి కాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తున్న ఫాలనేత్రంతో, ధిమిధిమి ధ్వనుల ఉన్నతమైన మంగళనాదాలకు అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రచండంగా తాండవిస్తున్న శివుడు సర్వోన్నతుడై రాజిలుగాక!
రెండవ పద్యం: అఖర్వ - పరిపూర్ణురాలైన (అగర్వ అని వాడారు సినిమాలో); సర్వ మంగళా - గౌరీదేవి యొక్క; కలాకదంబ - విలాస సమూహములనెడి; మంజరీ - గుత్తిలోని; రసప్రవాహ మాధురి - మకరంద మాధుర్యాల తీయదనానికై; విజృంభణ - చెలరేగు; మధువ్రతం - తుమ్మెద వంటివాడై; అంతకం - నశింపజేయువాడు; స్మర - మన్మధుడు; పుర - త్రిపురాసురుడు; భవ - సంసారం; మఖ - యజ్ఞం (దక్ష); గజ - గజాసురుడు; అంధక - అంధకాసురుడు; అంతక - నాశనము; అంతకాంతక - యముడు; భజే - ఆశ్రయిస్తున్నాను.
తాత్పర్యం: గొప్పదైన సర్వమంగళాదేవి కళావిలాసాల తీయదనపు ఒరవడిలో గండు తుమ్మెదలా ఆసక్తితో చెలరేగేవాడు (శివుడు) - మన్మథునీ, పురాసుర-అంధకాసురులను, సంసారాన్నీ, గజాసురునీ, యముడినీ సంహరించిన స్వామిని ఆశ్రయిస్తున్నాను.
మూడవ పద్యం: ప్రఫుల్ల - విరబూసిన; నీల పంకజ - నల్ల కలువల; ప్రపంచకాలిమప్రభా - గుంపుయొక్క నల్లని కాంతులను (సినిమాలో "ప్రచండ కాలి మఝ్ఝటా" అని వుంది); అవలంబి (విడంబి) - దాల్చియున్న; కంఠ కందలీరుచి - నడుమ భాగములోని కాంతితో; ప్రబద్ధ (ప్రబంధ) - బాగా ప్రకాశిస్తున్న; కంధరం - కంఠముగలవానిని; స్మరచ్ఛిదం - మన్మథుని దునిమినవాడు; పురచ్ఛిదం - త్రిపురాసురుని ఛేదించినవాడు; భవచ్ఛిదం - సంసార బంధములను తొలగించువాడు; మఖచ్ఛిదం - దక్ష యజ్ఞ ధ్వంసకుని; గజచ్ఛిత్ + అంధకచ్ఛిదం - గజాసురుని, అంధకాసురుని ఛేదించిన వానిని; తం అంతకచ్ఛిదం - యముని సంహరించిన శివుని; భజే - ఆశ్రయిస్తున్నాను.
తాత్పర్యం: నల్లకలువల గుంపుల నడుమనున్న గాఢమైన నల్లదనంతో పోలిన కంఠం గలవానిని, మన్మథునీ, త్రిపురాసురునీ, సంసార బాధలను, దక్ష యజ్ఞాన్నీ, గజాసురునీ, అంధకాసురునీ, యముణ్ణీ హరించే ఆ పరమశివుని ఆశ్రయిస్తున్నాను.
కృతజ్ఞతలు: పరోక్షంగా దోహద పడిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శుభచరణాలకు నమస్సులతో. ఈ సమాచారం నలుగురితో పంచుకోవాలనే సంకల్పంతో ఈ వివరాలు సేకరించి వ్రాయడమైనది. ఏవైనా పొరపాట్లు దొర్లివుంటే చదువరులు సవరణలు, సూచలను తప్పక నా దృష్టికి తీసుకురాగలరు.
A gem of songs and glad about the info given about this song.No parallel to Ghantasala
రిప్లయితొలగించండిరాధారావు గారు, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసూర్య నారాయణ గారు,
రిప్లయితొలగించండిఈ సినిమాలో అసలు చూడాల్సింది, మిస్ కాకూడనిది రావణుని దర్పం చూపించే అతిముఖ్యమైన పద్యం/ఘట్టం:
"దానవ కుల వైరి దర్పంబు వర్ణించు చదువులెవ్వరు గాని చదువరాదు
సుర పక్షపాతి విష్ణు ... యజ్ఞగుండమ్ముల నగ్ని మండరాదు
హర నామమే గాని, హరినామముజ్జగాల నెవరు స్మరింపరాదు
అమర లోక విజేత, లంకాధినేత హ్వా హ్వా హ్వా..
అమర లోక విజేత, లంకాధినేత
శాసనము నిరాకరించిన
విష్ణుదాసుల చేల్ విరచి కట్టి
చెరను నెట్టుడీ దానవ శ్రేష్టులారా ఆ..ఆ..ఆ.." :))
సముద్రాల రాఘవచార్య గారు ఎంత బాగా రాశారో! :) ;) ఇది చూశాక రావణుడి ఫేన్ అయిపోయానంటే నమ్మండి.
SNKR గారు, నిజంగా రామారావుగారు ఈ పాత్రకు ప్రాణం పోసారు. పద్యం, సంగీతం, నటన అన్నీ మేళవించి మనకు అద్భుతమైన దృశ్యకావ్యం రూపొందించారు.
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసనీయం !
రిప్లయితొలగించండిఅద్భుతమైన అభినయానికి అమరగానం తోడయితే ఎలా ఉంటుందో
యీ దృశ్యంలో వీక్షింపవచ్చు ! అనన్యం ! అసామాన్యం !
రామారావుకు రామారావే సాటి !
ఘంటసాలకు సాటి ఘంటసాలే !
మీ కృషికి ధన్యవాదములు !
వసంత కిశోర్ గారు అప్పుడే పునర్దర్శనమిచ్చారే! ధన్యవాదాలు.
తొలగించండిచాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు సూర్యనారాయణ గారూ, అభినందనలు!
రిప్లయితొలగించండిరామకృష్ణ గారూ! ధన్యవాదాలు. అయితే వివరణ యిచ్చినవారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. నేను కేవలం వారి వివరణను సేకరించి, ఇంచుమించు యథాతథంగా నా బ్లాగులో పొందుపరచాను. శ్రీ శర్మగారికి నమస్సుమాంజలులు.
తొలగించండిE yokka stotra bhavanni sekarinchi, andaru telusu kovalane nishkama vancha to, ikkada pondu parichina meeku na namassulu.
రిప్లయితొలగించండిఅఖిల్ గారు, మీ స్పందనకు, నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు.
తొలగించండిThank you sir
రిప్లయితొలగించండిసర్....పరమశివాచార పరులలో అత్యంత ప్రియుడన్న యశము కల్పించినావు పద్యం లిరిల్ కావాలి సర్. Plse.
రిప్లయితొలగించండి