1953 లో విడుదలైన "పరోపకారం" అనే చిత్రం మాస్టారి స్వంత చిత్రం. ఇదేకాక మరొక రెండు చిత్రాలు - సొంతవూరు (1956) మరియు భక్త రఘునాథ్ (1960) కూడ మాస్టారే నిర్మించారు. ఇవి మంచి చిత్రాలు. మంచి పాటలున్నాయి. కాని ఆర్ధిక పరంగా విజయవంతం కాలేదు. అందుకు మాస్టారు "పరులకు ఉపకారం చేయటం కోసమే పరోపకారం తీసాను" అన్నారట. తద్వారా మాస్టారు ఋణగ్రస్తులయ్యారు. దానితోపాటు ఆరోగ్యం కూడ దెబ్బతింది. "పరోపకారార్ధం ఇదం శరీరం" అన్నట్లు, తన ఆరోగ్యం కూడ పట్టించుకోకుండా మాస్టారు అందరికీ పరోపకారమే చేశారు, మహానుభావులు. పరోపకారం చిత్రం తెలుగు, తమిళ భాషలలో డబ్బింగ్ తో విడుదల అయింది. ఈ చిత్రానికి మాస్టారి స్వీయ సంగీత దర్శత్వం, గీత రచన ఆరుద్ర గారు. నాలుగు పాటలు పాడారు. ముక్కామల, సావిత్రి, జి.వరలక్ష్మి గార్లు నటించిన ఈ చిత్రానికి టి.ప్రకాశరావు గారు దర్శకులు. ఈ పాట చిత్రీకరించినది బి.గోపాలం గారి మీద. అతని వెనక సిగరెట్ కాలుస్తూ ముక్కామల గారిని చూడవచ్చు.
చిత్రం; | పరోపకారం (1953) | ||
రచన: | ఆరుద్ర | ||
సంగీతం: | ఘంటసాల | ||
గానం: | ఘంటసాల | ||
పల్లవి: | హృదయమా సాగిపొమ్మా | ||
భావ వేగాన సాగిపొమ్మా | | హృదయమా | | ||
హృదయమా! | |||
చరణం: | కొసరి వీచేను గడుసరి గాలి | ||
ఆదమరిచేవు సుఖముల తేలి | | కొసరి వీచేను | | ||
చాలు చాలించు సోమరి నడక | | చాలు చాలించు | | ||
సాగిపోవాలి తడబడక | | సాగిపోవాలి | | ||
హృదయమా సాగిపొమ్మా | |||
భావ వేగాన సాగిపొమ్మా | |||
హృదయమా! | |||
చరణం: | మురళి నూదేడు కోనారి* కూన | | మురళి | | |
ముదము కురిసేను జగములోన | | ముదము | | ||
ఆల మందలు ఇలు చేరబోయె | | ఆల మందలు | | ||
వేగమెత్తించు కడు జాలమాయె! | | వేగమెత్తించు | | ||
హృదయమా సాగిపొమ్మా | |||
భావ వేగాన సాగిపొమ్మా | |||
హృదయమా! |
కృతజ్ఞతలు:
1. శ్రమపడి తమిళ చిత్ర సన్నివేశానికి తెలుగు ధ్వనిముద్రణ చేసి ఘంటసాల అభిమానులకు యూట్యూబ్ ద్వారా అందించిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి,
2. చిత్రం వివరాలు సమకూర్చిన ఘంటసాల గళామృతము-పాటల పాలవెల్లి బ్లాగు కు,
*కోనారి - రైతు (ఎక్కువగా శ్రీకాకుళం ప్రాంతంలో వాడతారు).
3. దృశ్య ఖండికలో నటులను గుర్తుపట్టడంలో సవరణ సూచించిన శ్రీ పట్రాయని వేణుగోపాలకృష్ణ గారికి ధన్యవాదములు.
Very old song and a beautiful one.The title itself shows the intention of Ghasala to be selfless
రిప్లయితొలగించండిThanks Radharao garu. I agree with you.
తొలగించండిyentho chakka undi sekarna.
తొలగించండిee cinima nenu choosanu.
indulo joddedula naduma jodena ragada inka baguntundi.
aa pata dorakaduga. cinima bagunna dabbulu chesokoledu.
Ulimiri garu,as far as I know the the relentless effort in identifying the American source through Malaysia, the technological expertise in posting the audio of this song on the available Tamil video, time, energy, money everything that resulted in the endless happiness of the fans of Ghantasala, belong to Sri Nookala Prabhakar of ghantasala.info. I am privileged to be one of those he shares his video presentations with. I came across your this valuable post now searching for the meaning of the word కోనారులు. Hope you appreciate the purport of this correction in its true spirit.
రిప్లయితొలగించండిధన్యవాదాలు వేణుగోపాలకృష్ణ గారు. మీ సూచననుసరించి మార్పు చేశాను. శ్రీ నూకల ప్రభాకర్ గారు మంచి మిత్రులు. వారు ఎంతో సమయాన్ని వెచ్చించి అమూల్యమైన మాస్టారి దృశ్య ఖండికలను అందించారు. అయితే ఈ పాటకు సంబంధించి శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారు తమిళ దృశ్యానికి తెలుగు పాట ధ్వని ముద్రణం చేశారు.
తొలగించండిMy name is not appearing in full. I am Patrayani Venu Gopalakrishna. pvgk010101@gmail.com.
రిప్లయితొలగించండిధన్యవాదాలు వేణుగోపాలకృష్ణ గారు.
తొలగించండిమా నాన్నగారు, శ్రీ సంగీతరావుగారు, ఆ పాట video లో ఉన్నది శ్రీ B. గోపాలంగారని అన్నారు. ముక్కామల doubt లేదు.
రిప్లయితొలగించండినిజమే. ఈపాటను చిత్రీకరించింది గాయకుడు, సంగీతదర్శకుడు అయిన బి.గోపాలంగారి మీదే. సందేహంలేదు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
తొలగించండినిజమే. ఈపాటను చిత్రీకరించింది గాయకుడు, సంగీతదర్శకుడు అయిన బి.గోపాలంగారి మీదే. సందేహంలేదు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు ప్రణవ స్వరాత్ గారు.
తొలగించండిపరోపకారం సినీమా దర్శకుడు తాతినేని ప్రకాశరావు కాదు. కెమేరామెన్ కమల్ ఘోష్ యీ చిత్రానికి దర్శకుడు. ఆయన యీ చిత్రానికి నిర్మాణ భాగస్వామి కూడా.
రిప్లయితొలగించండిధన్యవాదాలు ప్రణవ స్వరాత్ గారు.
తొలగించండి