1965 లో విడుదలైన ఇతిహాసిక-పౌరాణిక చిత్ర రాజం పాండవ వనవాసం. ఎందరో మహామహులు శ్రమించి తయారు చేసిన మణిహారం ఈ చిత్రం. ఇందులో గుమ్మడి (ధర్మరాజు), ఎన్.టి.ఆర్. (భీముడు), బాలయ్య (అర్జునుడు), సావిత్రి (ద్రౌపది), ఎస్.వి.ఆర్. (ధుర్యోధనుడు), కాంతారావు (శ్రీకృష్ణుడు) నటించారు. ఈ చిత్రానికి దర్శకులు "పౌరాణిక బ్రహ్మ" అని పేరుపొందిన శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో 23/30 పౌరాణిక-జానపద-చారిత్రకాలు. పాండవులు శకుని నిర్వహించిన మాయా జూదంలో చిత్తుగా ఓడిపోతారు. ధర్మరాజు రాజ్యాన్నీ, తమ్ములనూ ఫణంగా పెట్టి అన్నిటినీ కోల్పోతాడు. ద్రౌపదిని దుశ్శాసనుడు సభలోకి ఈడ్చుకొచ్చి ఘోరంగా అవమానిస్తాడు. విధి ఆడిన నాటకంలో ప్రాభవం కోల్పోయిన పాండవులు కట్టు బట్టలతో, పురవీధులగుండా నడుస్తూ, పరాభవాన్ని దిగమింగుకుంటూ జనవాసాన్ని వీడి వనవాసానికి బయలుదేరుతారు. ఈ సన్నివేశానికి తగిన పాటను శ్రీ సముద్రాల రాఘవాచార్య గారు వ్రాయగా, మాస్టారు కరుణరసం ఉట్టిపడేలా చక్రవాక రాగంలో బాణీకట్టి గానం చేసారు. ఈ పాట దృశ్య, శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
Thanks to KVR Harish of "Bank of Sri Ghantasala" Machilipatnam, AP
for loading the You Tube Video.
మహానుభావులు
ఆడియో మూలం: అంతర్జాలం
సాకీ: | ఘంటసాల: | న్యాయానికే పరాజయమా! | |
వంచనకే ధర్మము తలవంచేనా! | |||
బృందం: | ఆ.. ఆ.. ఆ.. ఆ.. | ||
పల్లవి: | ఘంటసాల: | విధి వంచితులై విభవము వీడి | |
అన్నమాట కోసం అయ్యో! అడవి పాలయేరా! | | విధి వంచితులై | | ||
చరణం: | ఘంటసాల: | నీ మది రగిలే కోపానలము | |
ఈ మహినంతా దహియించేనని | |||
మోమును దాచేవ ధర్మరాజా! | |||
బృందం: | అయ్యో!.. అడవి పాలయేరా! | ||
చరణం: | ఘంటసాల: | సభలో చేసిన శపథముదీరా | |
పావుల నదిలో త్రుంచెదనేనని | |||
బాహువులూచేవా భీమసేనా! | |||
బృందం: | ఆహా….. అడవి పాలయేరా! | ||
చరణం: | ఘంటసాల: | ఆలములోన కౌరవసేన | |
అమ్ములవానా ముంచెదనేనని | |||
ఇసుమును చల్లేవ సవ్యసాచి | | విధి వంచితులై | | ||
చరణం: | ఘంటసాల: | ఏ యుగమందూ ఏ ఇల్లాలు | |
ఎరుగదు తల్లీ ఈ అవమానం | | ఏ యుగమందూ | | ||
నీ పతి సేవయె నీకు రక్ష | |||
బృందం: | ఆహా….. |
Good song as a back-ground one..very pathetic high lighting the injustice done to Pandavas
రిప్లయితొలగించండిరాధారావు గారు, ధన్యవాదాలు. మంచి నేపథ్యగీతం ఇది.
రిప్లయితొలగించండి