బహుళ ప్రజాదరణ పొందిన నాటకం చింతామణి. దీనిని వ్రాసిన వారు అలనాటి సంఘ సంస్కర్త, నాటక రచయిత, కవి అయిన శ్రీ కాళ్ళకూరి నారాయణరావు (1871-1927) గారు. వీరి రచనలలో వరకట్నం కు వ్యతిరేకంగా వ్రాసిన "వర విక్రయము", వేశ్యా వృత్తిని ఖండిస్తూ వ్రాసిన "చింతామణి" నాటకాలు పేరెన్నిక గన్నవి. చింతామణి నాటకాన్ని రెండు సార్లు (1933 మరియు 1956) సినిమాగా తీసారు. ఈ చిత్రంలో కవి బిల్వ మంగళుడు గా ఎన్.టి.ఆర్., అతని భార్య గా జమున, చింతామణి అనే వేశ్య పాత్రలో భానుమతి నటించారు. గుణవతియైన భార్యకుండవలసిన లక్షణాలను, అలాగే భార్యలను బాధించే కొందరు భర్తలను గురించి బిల్వ మంగళుడు ఈ విధంగా వివరిస్తాడు.
కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో సమర్పించిన శ్రీ హరీష్ (Bank of Sri Ghantasala, Machilipatnam, A.P.)
చిత్రం: చింతామణి (1956)
మూలం: చింతామణి నాటకము
రచన: కాళ్ళకూరి నారాయణ రావు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
సంగీతం: అద్దేపల్లి రామారావు, టి.వి.రాజు
సంగీత పర్యవేక్షణ: పి.భానుమతి
పద్యం: |
కష్ట భరితంబు బహుళ దుఃఖప్రదంబు
|
సారరహితంబునైన సంసారమందు
| |
భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసె
| |
పురుషులనిమిత్తము పురాణ పూరుషుండు
| |
ఆ.. ఆ.. ఆ.. | |
వచనం: |
భార్యలను కష్టాల పెట్టె భర్తలు మాత్రం లేరా అని కదూ, యెందుకు లేరు
|
పద్యం: |
అర్ధాంగ లక్ష్మియైనట్టి యిల్లాలిని తమయింటి దాసిగా తలచువారు
|
చూడు.. | |
అర్ధాంగ లక్ష్మియైనట్టి యిల్లాలిని తమయింటి దాసిగా తలచువారు
| |
చీటికి మాటికి చిరబురలాడుచు పెండ్లాము నూరక యేడ్పించువారు
| |
పడపుగత్తెల ఇండ్ల బానిసెంచై ధర్మపత్ని యన్నను మండిపడెడివారు
| |
బయట నెల్లరచేత పడివచ్చి యింటను పొలతినూరక తిట్టి పోయువారు
| |
పెట్టుపోతల పట్లగలట్టి లోటు తిట్టుకొట్టులతోడను తీర్చువారు
| |
ఖలులు, కఠినులు, హీనులు, కలుషమతులు కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము |
What a novel idea & an innovation!!than you so much Suryanarayana Garu!Hats off to your efforts of this unique type.After listening to the poems rendered by Ghantasal all the rest accumulated in the Telugu music lover's ears gets dispelled.May GOD bless you with good health to make you give many more such video clips.
రిప్లయితొలగించండిThank you very much sir for your good words and blessings. Sure I will try to do as many as I can with your encouragement.
తొలగించండిA laudable effort worth emulation by all those interested in music!
రిప్లయితొలగించండిThank you sir. I am happy you liked it.
తొలగించండిబాగుంది.
రిప్లయితొలగించండిటైపో అనుకుంట. మొదటి పద్యము చివరి పదము "పూరుషుండు" అని ఉండాలి.
సత్యనారాయణ గారు, నిజానికది టైపో కాదండి. తాళం సరిపోవడానికి పురుషుండు అనడానికి బదులు పూరుషుండు అని పాడటం జరిగింది. అయినా మీరు సూచించిన సవరణ చేశాను. మీ స్పందనకు ధన్యవాదాలు.
తొలగించండిసూర్యనారాయణ గారూ! "కష్టభరితంబు" తేటగీతి పద్యం. చందస్సు ప్రకారం తేటగీతిలో ప్రతిపాదంలోనూ 1 సూర్యగణం, 2 ఇంద్రగణములు, చివర 2 సూర్యగణములు ఉంటాయి. చివరిపాదంలో నాల్గవది, ఐదవది అయిన సూర్యగణములు "గల"ములు (అనగా గురువు. లఘువు - అనగా దీర్ఘము, హ్రస్వము). అందుకే అక్కడ కవి "పూరుషుండు" అని వ్రాశారు. (మానవుడు, మనుష్యుడుకి పురుషుడు మాత్రమే కాక పూరుషుడు కూడావుంది. శబ్దరత్నాకరము చూడండి). జీవితంలో భార్య ప్రాముఖ్యతని తెలియచేసే ఈ పద్యాన్ని ఘంటసాల మాస్టారు చాలా చక్కగా, శ్రవణానందంగా ఆలపించారు. ఎన్ని వందలసార్లు విన్నానో, మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది. అంతేకాని వారు తాళంకోసం అలా పాడలేదు. నేనిది తప్పు పట్టాలన్న ఉద్దేశ్యంతో వ్రాయలేదు, అందరికీ తెలియాలనే ఇంతగా విశదీకరించాను. మాస్టారి ప్రాభవాన్ని తెలియచేస్తూ ఈ బ్లాగును మీరు నిర్వహిస్తున్న తీరు శతధా అభినందనీయం! కృతజ్ఞతలతో - ఎం.ఎస్.రామకృష్ణ
తొలగించండిరామకృష్ణ గారూ! తెలియని విషయాన్ని తెలిపినందుకు చాల సంతోషం. ఇందులో తప్పు పట్టడం ఏమీ లేదండి. నా బ్లాగు సందర్శించినందుకు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు సర్వదా కృతజ్ఞుడిని. నాకు తెలిసినవి నలుగురితో పంచుకోవడం తో పాటు, తెలియని విషయాలు తెలుసుకుని, లోపాలు సరిదిద్దుకోవడమే ఈ బ్లాగు ఉద్దేశం. నమస్కారం.
తొలగించండిVery appreciable collections from you.Very rare of Ghantasala.We wish more and more of such gems from you
రిప్లయితొలగించండిRadharao garu, thanks for your response. I will certainly try to bring more of Mastaru's works.
తొలగించండి