1971 లో విడుదలైన "అందం కోసం పందెం" చిత్రం కోసం డా. సి. నారాయణ రెడ్డి మరియ్ మహాకవి శ్రీశ్రీ వ్రాసిన పద్యాలకు సంగీత దర్శకులు ఎస్.పి. కోదండపాణి స్వరపరచగా ఘంటసాల మాస్టారు ఆలపించారు.
| చిత్రం: | అందం కోసం పందెం (1971) | |
| రచన: | సి.నారాయణ రెడ్డి | |
| సంగీతం: | ఎస్.పి. కోదండపాణి | |
| గానం: | ఘంటసాల |
| నందనము తలదన్ను మందారవనమందు | ||
| వెన్నెలలు విరజిమ్ము విరిమంటపము ముందు | ||
| జీవకళలొలికించు శిల్పసుందరివీవు | ||
| ఏ మధురకవి కల్పనామూర్తివో నీవు ఆ.. | ||
| అంత సన్నని నడుము అలసిపోవునొ ఏమో | ||
| ఎంతసేపని అటులనే నిలిచిపోయేవూ | ||
| ముద్దులను గురిపించు ముఖచంద్రబింబమ్ము | ||
| మేలిముసుగున నీవు ఏలదాచేవూ? | ||
| ఓ శిల్పసుందరీ - ఓ.. నా మనోహరీ.. | ||
| విరబూసెడు పువ్వులనెవ్వరు కాదనగలరూ? | ||
| రివ్వుమనెడి యవ్వనమునెవ్వరాపగలరూ? | ||
| కలుసుకొన్న నయనమ్ములు కలనైనా విడిపోవు | ||
| వలపులొలుకు హృదయాలే కలకాలం నిలచిపోవూ.. | ||
| కలకాలం నిలచిపోవూ | ||
| రచన: | శ్రీ శ్రీ | |
| పదములు లేజివుళ్ళ చెలువమ్ముల సొమ్ముల కాలయమ్ములో | ||
| ముదిత పిరుందులందముల మూటలుకట్టెడు సైకతమ్ములో | ||
| వదనము పారిజాతమో సువాసనలీనెడు పారిజాతమో | ||
| మదనుని బంతియో, చెలియ మల్లెలదొంతియో, వైజయంతియో | ||
| ఆహా… వదనము వారిజాతమో |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి