"ఏకవీర" చిత్రం నుండి మహదేవన్ మధురబాణి "తోటలో నారాజు"
కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో తొలి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని రామాయణ కల్ప వృక్షము అన్న రచనకు అందుకున్నారు. విశ్వనాథ వారు సాహితీ ప్రక్రియలలో ఉపయోగించని ప్రయోగము లేదు. వారికి ఎంతో సంతృప్తి తెచ్చిన రచన రామాయణ కల్పవృక్షం అయితే బహుళ జనాదరణను తెచ్చిన రచన వేయిపడగలు. వారు మదురై ప్రాంతపు నేపథ్యం లో వ్రాసిన నవల ఏకవీర. దీనిని తెలుగులో అదే పేరుతో ఏకవీర చలనచిత్రం గా రూపొందించారు. అయితే ఈ చిత్రానికి మాటలు, పాటలు వ్ర్రాసినది మరొక జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సి.నారాయణ రెడ్డి. సినారె వ్రాసిన విశ్వంభర కావ్యానికి యీ పురస్కారం లభించింది. ఇందులో ఇద్దరు ఆప్తమిత్రులు ప్రతికూల పరిస్థితులలో ఒకరు ప్రేమించిన ప్రేయసిని వేరొకరు పెండ్లాడడం జరిగి విపరీతమైన మానసిక సంఘర్షణకు లోనవుతారు. ఈ ఇరు జంటల ప్రేమ కథలో కలిగే అనూహ్య పరిణామాలకు ఫలితంగా విషాదాంతమైన ఈ చిత్రానికి జనాదరణ లబించలేదు. ఈ చిత్రం కోసం సినారె వ్రాసిన తోటలో నారాజు మామ మహదేవన్ కూర్చిన చక్కని బాణీ కల్యాణి రాగం లో ఘంటసాల, పి.సుశీల ఆలపించిన మధుర యుగళ గీతం. యవ్వనవతియైన యువతిని ఎలనాగ అన్న చక్కని పదంతో అభివర్ణించారు సినారె ఈ పాటలో. మరొక విషయం ఏమిటంటే పాటను ఎక్కువ భాగం అంత్యానుప్రాసలో వాసారు. అంటే ఇంచుమించు ప్రతి రెండు పంక్తులకు ఆఖరి అక్షరం ఒకటే అవుతుంది. ఉదా. నాడు-నేడు; పారిజాతాలు-రమ్యగీతాలు; ఇలా చాల చోట్ల కనిపిస్తుంది. ఇక ఆస్వాదించండి ఈ గీతాన్ని.
Thanks to TeluguOne for posting the video to You Tube
చిత్రం:
ఏకవీర (1969)
రచన:
సి.నారాయణ రెడ్డి
సంగీతం:
కె.వి.మహదేవన్
గానం:
ఘంటసాల, పి.సుశీల
పల్లవి:
సుశీల:
తోటలో నారాజు తొంగి
చూచెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
| తోటలో నారాజు |
చరణం:
సుశీల:
నవ్వులా అవి? …... కావు!
నవ్వులా అవి?
కావు! నవ పారిజాతాలు
నవ్వులా అవి?
కావు! నవ పారిజాతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
| రవ్వంత |
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా?
| ఆ రాజు |
అపరంజి కలలన్ని చివురించునా?
| తోటలో నారాజు |
చరణం:
ఘంటసాల:
చాటుగా పొదరింటి మాటుగా వున్నాను
| చాటుగా |
పాటలాధర రాగభావనలు కన్నాను
ఎలనాగ నయనాల కమలాలో దాగి
| ఎలనాగ |
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
| ఎదలోన |
ఆ పాట నాలో తీయగ మ్రోగనీ
| ఆ పాట |
అనురాగ మధు ధారయై సాగనీ
ఊహూహు…ఊ..హూ..
సుశీల:
తోటలో నారాజు తొంగి చూచెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడూ..ఊ..ఊ..
కృతజ్ఞతలు: సమాచారాన్ని పొందుపరచిన వికి పీడియాకు, వీడియో లభ్యం చేసిన తెలుగు వన్ కు మరియు యూ ట్యూబ్ వారికి ధన్యవాదములు.
సూర్యనారాయణ గారూ, ఎలనాగ అంటే? చాలా అందమైన పాట ఈ పాట. ఎలనాగ నయనాలు అంటే something about, "eyes like those of ___ belonging to the earth" ??
One other phrase that I always puzzle about in this song: పాటలాధర రాగభావనలు... Sounds beautiful. I think the poet is saying something about the dance/music coming out of the lips of the woman who is singing?
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసూర్యనారాయణ గారూ, ఎలనాగ అంటే? చాలా అందమైన పాట ఈ పాట. ఎలనాగ నయనాలు అంటే something about, "eyes like those of ___ belonging to the earth" ??
రిప్లయితొలగించండిOne other phrase that I always puzzle about in this song: పాటలాధర రాగభావనలు... Sounds beautiful. I think the poet is saying something about the dance/music coming out of the lips of the woman who is singing?
Regards.