1966
సంవత్సరంలో విడుదలైన శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన అగ్గిబరాటా చిత్రం నుండి
ఘంటసాల మాస్టారుపి.సుశీల తో పాడిన మబ్బులు తొలిగెనులే అనే ఈ యుగళగీతం రచన డా.సినారె, స్వరపరచినది విజయా కృష్ణమూర్తి. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.
రామారావు, రాజశ్రీ,రామదాసు, మిక్కిలినేని, ముక్కామల, వాణిశ్రీ.
| చిత్రం: | అగ్గి బరాటా (1966) | ||
| రచన: | సి.నారాయణ రెడ్డి | ||
| సంగీతం: | విజయా కృష్ణమూర్తి | ||
| గానం: | ఘంటసాల, సుశీల | ||
| నిర్మాణం: | శ్రీ విఠల్ ప్రొడక్షన్‌స్ వారి | ||
| పల్లవి: | ఘంటసాల: | మబ్బులు తొలగెనులే, మనసులు వెలిగెనులే | |
| సుశీల: | ఇన్ని దినాలుగ కన్నుల కాచిన పున్నమి పూచెనులే | ||
| మబ్బులు తొలగెనులే, మనసులు వెలిగెనులే | |||
| ఘంటసాల: | ఇన్ని దినాలుగ కన్నుల కాచిన పున్నమి పూచెనులే | ||
| చరణం: | ఘంటసాల: | అటు నీవు, ఇటు నేను ఒకరై మనమున్నాము -2 | |
| ఎటులైనా, ఏమైనా ఇక ఎన్నడు విడిపోము | |||
| సుశీల: | చెంతగా చేరనీ | ||
| ఘంటసాల: | వింతగా చూడనీ (వచనం) | ||
| సుశీల: | పూలలో ఊగనీ, గాలినై సాగనీ | ||
| ఘంటసాల: | మబ్బులు తొలగెనులే, మనసులు వెలిగెనులే | ||
| సుశీల: | ఇన్ని దినాలుగ కన్నుల కాచిన పున్నమి పూచెనులే | ||
| చరణం: | సుశీల: | కలలన్నీ, కథలన్నీ పులకించెను నాలోనే -2 | |
| నీ చేయీ విడనోయీ, పయనించెద నీతోనే | |||
| ఘంటసాల: | నిండుగా నవ్వనీ | ||
| సుశీల: | చంద్రునీ నువ్వనీ (వచనం) | ||
| ఘంటసాల: | అందమే దూయనీ, గంధమే పూయనీ | ||
| ఇద్దరు: | మబ్బులు తొలగెనులే, మనసులు వెలిగెనులే | ||
| ఇన్ని దినాలుగ కన్నుల కాచిన పున్నమి పూచెనులే | |||
| మబ్బులు తొలగెనులే |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి