ఒక విదేశీ వనిత (షీలా) భారతీయుడిని (శొభన్‌బాబు) పెండ్లి చేసుకుని వివాహానంతరం విహారయాత్రకు వెళితే, ఆ భర్త తన భార్యకు తన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలకు దర్పణం పట్టే నదీనదాలను, చారిత్రక కట్టడాలను పరిచయం చేస్తూ పాడిన అద్భుతమైన గీతం 1969 లో శ్రీరాజ్ ఆర్ట్ ఫిలింస్ పతాకంపై విడుదలైన విచిత్ర కుటుంబం చిత్రం లోని "ఆడవే జలకమ్ములాడవే". ఇటువంటి ఇతివృత్తం గల గీతాన్ని ప్రేక్షక శ్రోతలకు సినీ మాధ్యమం ద్వారా అందంగా అందించిన కవి, విశ్వనాథ సత్యనారాయణ వంటి మేటి కవుల తరువాత జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకొన్న 'విశ్వంభర' కావ్యకర్త సింగిరెడ్డి నారాయణరెడ్డి అయిన మన సినారె. ఆయన ఈ పాటలో ఆదికవి నన్నయ్యను, ఆంధ్ర సంస్కృతి తియ్యదనాన్ని, మహాయాన బౌద్ధమతాన్ని వ్యాపింపజేసిన ఆచార్య నాగార్జునుని, నదీనదాలైన గోదావరి తరంగాలను, కృష్ణవేణి తరంగిణిని, తుంగభద్ర తోయమాలికలను చక్కగా అభివర్ణించారు. అంతేకాదు "దేశభాషలందు తెలుగులెస్స"యని నొక్కి వక్కాణించి, ఆంధ్రభోజునిగా విఖ్యాతిగాంచిన శ్రీకృష్ణదేవరాయల ఘనతను, పాలనను చిరకాలం గుర్తుండేలా విరచించారు. మాస్టారి మధుర కంఠంతో కోకిల కూజితం వంటి సుశీల ఆలాపన ఈ పాటకు ఎంతో మాధుర్యాన్ని తెచ్చి మన మనసులలో చిరస్థాయిగా నిలిపాయి. ఈ పాటకు స్వరరచన చేసినది టి.వి.రాజు (తోటకూర వెంకట రాజు). విశేషమేమంటే ఎన్.టి.ఆర్., సావిత్రి లతో అగ్ర నటులు కృష్ణ, శోభన్‌బాబు కూడ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించారు.
Thanks to TeluguOne for providing the You Tube video clip
ఆడియో: ఆడవే జలకమ్ములాడవే (విచిత్ర కుటుంబం)
చిత్రం: | విచిత్ర కుటుంబం (1969) | |
రచన: | సి.నారాయణ రెడ్డి | |
సంగీతం: | టి.వి.రాజు | |
గానం: | ఘంటసాల, సుశీల, బృందం | |
సాకీ: | ఘంటసాల: | రష్యాలో పుట్టి, భారతావనిలో మెట్టి |
తెలుగువారి కోడలివై వలపులొలుకు జాజిమల్లీ..ఈ.. | ||
వలపులొలుకు జాజిమల్లి | ||
పల్లవి: | ఘంటసాల: | ఆడవే…ఆడవే |
ఆడవే జలకమ్ములాడవే..ఏ.ఏ. ఆడవే జలకమ్ములాడవే | ||
కలహంసలాగ, జలకన్యలాగ | ||
కలహంసలాగ, జలకన్యలాగ ఆడవే…ఏ..ఏ..ఆడవే | ||
చరణం: | ఘంటసాల: | ఆదికవి నన్నయ్య అవతరించిన నేల |
సుశీల: | ఆ…ఆ…ఆ…ఆ…ఆ.. | |
ఘంటసాల: | తెలుగుభారతి అందియలు పల్కె యీ నేల | |
ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై | ||
జీవకళలొల్కు గోదావరి తరంగాల ఆడవే..ఏ…ఏ…ఆడవే | ||
చరణం: | ఘంటసాల: | నాగార్జునుని బోధనలు ఫలించిన చోట |
సుశీల: | ఆ…ఆ…ఆ…ఆ…ఆ.. | |
ఘంటసాల: | బౌద్ధమత వృక్షమ్ము పల్లవించిన చోట | |
బృందం: | బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి | |
ఘంటసాల: | కృష్ణవేణీ తరంగిణి జాలి గుండెయే | |
సాగరమ్మై రూపు సవరించుకొను నీట ఆడవే..ఏ..ఏ..ఆడవే | ||
చరణం: | ఘంటసాల: | కత్తులును ఘంటములు కదను దొక్కినవిచట -2 |
అంగళ్ళ రతనాలు అమ్మినారట యిచట | ||
నాటి రాయలపేరు నేటికిని తలపోయు | ||
తుంగభద్రానదీ తోయమాలికలందు ఆడవే..ఏ..ఏ..ఆడవే | ||
ఆడవే జలకమ్ము లాడవే..ఏ..ఏ..ఆడవే జలకమ్ములాడవే |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి