గులేబకావళి కథ చెప్పి యాభై సంవత్సరాలు అయింది -అయితే అసలు కథ ఏమిటి?
1962 లో వచ్చిన ఎన్.ఏ.టి.వారి గులేబకావళి కథ కు యాభై సంవత్సరాలు నిండాయి. దీనిలో ఎన్.టి.ఆర్., జమున నాయికా నాయకులుగా నటించారు. ఒక గులేబకావళి అనేది ఒక బకావలి అనే పుష్పం పేరు. ఇది శ్రీ మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కథలు నుండి తీసుకున్నదంటారు. నిజానికిది హిందీ/ఉర్దూ లో "గుల్ ఎ బకావలి". ఇందులో హీరో ముస్లిం వేషంలో కనిపిస్తాడు. అతనికి అనువుగా ఉర్దూ పదాలను తెలుగు చిత్ర సాహిత్యంలో తీసుకు రావడానికి తెలుగు, ఉర్దూ భాషలలో కవియైన శ్రీ సి. నారాయణ రెడ్డి గారిని బహుశా ఆహ్వానించి ఉండవచ్చు. సి.నా.రే. గారు వ్రాసిన పాటలలో ఘంటసాల, సుశీల గార్లు పాడిన "నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని" సూపర్ హిట్. ఈ చిత్రం యొక్క విశేషాలను NTV సమర్పించిన క్రింది మూడు భాగాలలో చూడగలరు.
మొదటి భాగం
రెండవ భాగం
ఆఖరి భాగం
అయితే ఈ గులేబకావళి కథకు అసలు కథ ఏమిటి? ఈ అంశాన్ని వనితా టీవీ వారు రెండు భాగాలలో సమర్పించారు. దీనిని చెబుతున్నవారు శ్రీ MBS ప్రసాద్ గారు. ముఖ్యంగా తెలుగు సినిమా కథ ఒక మూలమైన ఎం.జి.ఆర్. నటించిన అదే పేరుగల చిత్రంతో పోలిస్తే ఏయే తేడాలు వున్నాయి అన్నది తెలుస్తుంది.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
i like this movie very much thank q
రిప్లయితొలగించండి