ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలో చక్కగా వివరించి చెప్పే అలనాటి మేటి పాట ఇది. భర్తను సంతోష పెడుతూ, "భోజ్యేషు మాతా" అని అన్నట్టు భోజనం తినిపించే విషయంలో తల్లిలా వ్యవహరించాలి. అత్త మామలకు సేవ చేయాలి. కుమారుని విద్యపై శ్రద్ధ వహించి వీరకుమారునిగా తీర్చిదిద్దాలి. ఈ భావాలను చక్కగా ప్రతిబింబించే విధంగా వ్రాసారు ఈ గీతాన్ని శ్రీ వీటూరి గారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు శ్రీ శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి (ఎస్.పి.కోదండపాణి) గారు. తెలుగు తెరకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేసినది వీరే. వీరు అతి చిన్న వయసులో (42 సంవత్సరాలు) పరమపదించారు.
Thanks to pachipulusu95 for sharing the You Tube
చిత్రం: దేవత (1965)
రచన: వీటూరి
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
గానం: ఘంటసాల
ప. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి | ఆలయాన |
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
చ. పతిదేవుని మురిపించే వలపుల వీణా
జీవితమే పండించిన నవ్వుల వానా
కష్ట సుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ | కష్ట సుఖాలలో |
మగువేగా మగవానికి మధుర భావనా | ఆలయాన |
చ. సేవలతో అత్త,మామ సంతసింపగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా | సేవలతో |
తనయుని వీరునిగా, పెంచే తల్లిగా | తనయుని |
సతియే గృహసీమను గాచే దేవతగా
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా | ఆలయాన |
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
చాలా మంచి పాట
రిప్లయితొలగించండి