1972 లో బాపు దర్సకత్వం లో విడుదలైన సంపూర్ణ రామాయణం చిత్రంలో శోభన్ బాబు శ్రీరామునిగా, చంద్రకళ సీతగా, ఎస్.వి.రంగారావు రావణునిగా, అర్జా జనార్ధన రావు అంజనేయుడుగా నటించారు. ఆరోజుల్లో ఆంజనేయుని పాత్ర అంటే అది కేవలం అర్జా జనార్ధనరావు గారే వేసి నప్పించగలిగే వారు. ఈ చిత్రంలోని ఎక్కువ పద్యాలు శ్రీ గబ్బిట వెంకట రావు గారు వ్రాసారు. పద్యాలు ఘంటసాల మాస్టారు, మాధవపెద్ది సత్యం గార్లు పాడారు. మాధవపెద్ది గారు చిత్ర సీమలో మాస్టారి తరువాత పద్యాలు పాడటంలో చక్కని శైలి కనబరిచేవారు. ముఖ్యంగా ఎస్.వి.ఆర్.కు పద్యాలు, రేలంగి కి పాటలు ఎన్నో చిత్రాలలో పాడారు.
రచన: గబ్బిట వెంకటరావు
గానం: ఘంటసాల, మాధవపెద్ది
సంగీతం: కె.వి.మహదేవన్
ఘంటసాల: ఠంఠం ఠమ్మను భీషణ ధ్వనుల వింటన్నారి సారించి వై
కుంఠుండా రఘురామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ
కంఠంబుల్ భువి కూల్చునాడు తరమే కాపాడ ఫాలాక్షుకున్
శుంఠ! మొండితనంబుమాని శరణంచున్ రాము ప్రార్థించరా..
మాధవపెద్ది: అరరే దుర్మతి! హహ్హహ్హహ్హ కోతి చాలునిక యేలా యీ ప్రగల్భంబు దు
ష్కర, గంధర్వ, సుపర్వులన్ గెలిచి సాక్షాత్ శ్రీ మహాదేవుచే
వరముల్ గాంచి నవగ్రహమ్ముల గతిన్ బంధించు లంకేశ్వరున్
నరుడా రాముడు గెల్చుట (2) రణమటన్నన్ కోతి కొమ్మచ్చులా
ఘంటసాల: కోతియే గంభీర వారిధి కుప్పిగంతుగ దాటెరా!
కోతియే రాకాసి లంకిణి గుండెలదరగ గొట్టెరా!
కోతి నీదు అశోక వటమును గూల్చి ధ్వంసము సల్పెరా!
కోతియే ఎదిరింప వచ్చిన కుమతి అక్షయు జంపెరా!
కోతియే లంకాపురము గగ్గోలొనర్చెను నేడురా!
కోతికీ ఘనశక్తి వచ్చిన గూఢ మర్మము చూడరా!
రాతి నాతిగ మారజేసిన రామపాద రజమ్మురా!
రామనామ స్మరణే ముక్తికి రాజమార్గము నమ్మరా | రామనామ |
రామ్ రామ్ రామ్ రామ్
రామరామ రఘురామ పరాత్పర రాక్షస సంహర రణధీర
రథాంగ ధరజన పతంగ వాహన రమారమణ నారాయణ
రామరామ రామసీతా రామరామ రామ్ | రామరామ |
రాం రాం రాం సీతా రాం రాం రామ్ (5 సార్లు)
great song
రిప్లయితొలగించండిఅశోక్ గారు, ధన్యవాదాలు.
తొలగించండిvilasamga sivananda laharee aMTE bAdha paDDAM ..kaani ee pATalO guDA deerghAkSharaanni hrasvaMgaa maarchAru.. saMhAra ki badulu saMhara annADu chivarlO
రిప్లయితొలగించండిభాస్కర్ గారు, మీరు ఉదహరించిన శివానంద లహరి ప్రస్తావన నాకు అర్ధం కాలేదు. ఐతే ఈ పద్యం లో "సంహర" అని అనడానికి కారణం అది తాళం సరిపోవడానికి అలా అని వుండవచ్చును.
తొలగించండిధన్యవాదాలు గురువుగారు !
రిప్లయితొలగించండిస్వాగతం.
తొలగించండి