1964 లో విడుదలైన పూజా ఫలం చిత్రంలో ఎ.ఎన్.ఆర్., జమున నాయికా నాయకులు. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు ఒకే ఒక ఏకగళ గీతం పాడారు. అది శ్రీ సి.నారాయణ రెడ్డి గారి రచన అయిన "నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో". సుప్రభాత సమయంలో హీరో పూల తోటలో తిరుగుతూ ప్రకృతి అందాలకు మైమరచి, సూర్య కాంతికి స్ఫూరితితో విరిసిన పూల బాలలను చూస్తూ, పరవశంతో పాడిన పాట. ఈ పాట వినడానికి ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. దీనిని శుద్ధ సావేరి రాగంలో చిరకాలం మనకు గుర్తుండే రీతిలో బాణీ కట్టారు స్వర కర్త అయిన సాలూరు రాజేశ్వర రావు గారు. ఈ పాట దృశ్య, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
సాలూరు సినారె ఘంటసాల |
చిత్రం: పూజా ఫలము (1964)
రచన: డా.సి.నారాయణ రెడ్డి
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
గానం: ఘంటసాల
ప. నిన్నలేని అందమేదో
నిదురలేచెనెందుకో.. | నిదుర |
తెలియరాని రాగమేదో
తీగె సాగెనెందుకో..
తీగెసాగెనెందుకో, నాలో | నిన్నలేని |
చ. పూచిన ప్రతి తరువొక వధువు
పువు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో.. | నిన్నలేని |
చ. తెలి నురుగులె నవ్వులు కాగా
సెలయేరులు కులుకుతు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే..ఏ.. | నిన్నలేని |
చ. పసిడి అంచు పైట జారా..ఆఆ..ఓఓ..
పసిడి అంచు పైట జార
పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే
పరవశించెనే..ఏ.. | నిన్నలేని |
పూచిన ప్రతి తరువొక వధువు
రిప్లయితొలగించండిపువు పువ్వున పొంగెను మధువు
సినారె పాటలో ఏదో తాజాదనం
ఘంటసాల గొంతులోని తియ్యదనం
సాళ్ళూరి సంగీతంలోని కమ్మదనం
కలిసిన పాట అజరామరం
చక్కని పాట గుర్తుచేశారు.
SNKR గారు, ధన్యవాదాలు. నిజంగా చక్కని రచన,బాణీ, వెరసి మధురగానం.
తొలగించండి