"సలలిత రాగ సుధారస స్ఫూర్తి", తెలుగు చిత్ర సీమలో సజీవమూర్తి, "స్వర బ్రహ్మ" శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు క్రొత్త గాయనీ గాయకులను ప్రోత్సహించి, పాడించేవారు, వారి మాతృ భాష తెలుగు కాకపోయినా సరే. సుసర్ల వారి మరొక మరపురాని బాణీ 1955 లో విడుదలైన సంతానం చిత్రంలో హిందీ చిత్ర రంగానికి చెందిన ప్రముఖ గాయని, భారతరత్న శ్రీమతి లతా మంగేష్కర్ పాడిన నిదురపోరా తమ్ముడా పాట. లత గారు ఒక ఆంగ్ల చిత్రానికి పాడటానికి వచ్చినపుడు, సంతానం చిత్ర నిర్మాత, దర్సకులైన రంగనాథ దాసు గారు ఆమెతో తెలుగు పాట పాడించమని కోరగా తాను "నిదురపోరా తమ్ముడా" పాటను పాడించినట్లు శ్రీ సుసర్లగారు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. ఈ పాటను శ్రీమతి లత గారు సోలోగా పాడారు. ఇది లతగారి మొదటి తెలుగు చిత్ర గీతం. అయితే చిత్రీకరణలో చిత్రం రెండవ సగంలో ఘంటసాల గారి చరణంతో కలసి యుగళ గీతంగా వినిపిస్తుంది. కొన్ని పరిస్థితుల కారణంగా చిన్నప్పుడు విడిపోయిన తోబుట్టువులు ఒకరికొకరు దూరమై, తిరిగి చిన్ననాటి పాటతో గుర్తు పట్టి కలుస్తారు. సంతానం చిత్రంలో మాస్టారు కొన్ని పద్యాలు (పోకన్ మానదు, బావా ఎప్పుడు వచ్చితీవు మొదలయినవి), నాలుగు పాటలు పాడారు.
ఘంటసాల లతా మంగేష్కర్ |
చిత్రం: సంతానం (1955)
రచన: అనిసెట్టి-పినిసెట్టి
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
లతా: ఊ... ఊ... ఊ...
నిదురపో... నిదురపో... నిదురపో (2)
నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా
నిదురలోన గతమునంతా నిముషమైనా మరచిపోరా | నిదుర |
కరుణలేని ఈ జగాన కలత నిదురే మేలురా
నిదురపోరా తమ్ముడా
ఘంటశాల : ఆ..ఆ..
కలలు పండే కాలమంతా కనుల ముందే కదలిపోయే.. ఆ.. | కలలు |
లేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే
నిదురపోరా తమ్ముడా ఆ.. ఆ..
జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే.. | జాలి |
చితికిపోయిన జీవితమంతా చింతలో చితియాయె
నీడచూపే నెలవు మనకు నిదురయేరా తమ్ముడా
నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా
సూరిగారూ, నేను లత పాడిన పాటే విన్నాను కానీ, ఈ యుగళ గీతం వినలేదు. ఇద్దరు హేమాహేమీలు పాడిన గొప్ప పాట! ధన్యవాదాలు!
రిప్లయితొలగించండిసత్యం మందపాటి
సత్యం గారు, ధన్యవాదాలు. ఇది రెండవ భాగంలో వస్తుంది. సన్నివేశానికి అనుగుణమైన యుగళగీతం.
రిప్లయితొలగించండినాకు లత కన్నా ఘంటసాలగారే బాగా పాడినట్లు తోస్తున్నది
రిప్లయితొలగించండిఇద్దరూ బాగా పాడారండి. అయితే బేస్ లో మాస్టారి గొంతు అద్భుతం. మీ స్పందనకు ధన్యవాదాలు.
తొలగించండిచిన్నప్పుడు రేడియోలో విన్న ఈ పాటను మరోసారి మా ముందుకు తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు సూరి గారూ !
రిప్లయితొలగించండిరావు గారు, ధన్యవాదాలు.
తొలగించండిచాలా బాగుందండి, ఘంటసాల ఈపాటను పాడారని కూడా నాకు తెలియదు. వినడం ఇదే మొదటి సారి.
రిప్లయితొలగించండిSNKR గారు, ధన్యవాదాలు. ఈ పాట ఇంత అరుదని పోస్టు చేసిన తరువాతే తెలిసింది. మీకు నచ్చినందుకు సంతోషం.
రిప్లయితొలగించండిఈ పాట లత పాడారని తెలుసు.విన్నాను కూడా .కాని ఘంటసాల గారు కూడా పాడేరని ఇదే మొదటి సారి తెలుసుకోడం ,వినడం.ఈ పాట సేకరించి వినిపించినందుకు ధన్యవాదాలు.మాస్టారి కంఠంలో విషాదం అద్భుతంగా పలుకుతుందని తెలిసిందే కదా .
రిప్లయితొలగించండిరమణ గారు, మీకు నచ్చినందుకు సంతోషం. ఈ సినిమా చాల సంవత్సరాల క్రితం చూశాను. అప్పుడే గమనించాను మాస్టారు కూడ పాడారని. అయితే ఈ పాటను రెండు చోట్ల చిత్రీకరించడం జరిగినా సినిమాలో ఒకదాని తరువాత ఒకటి వీడియోలో చూపించినట్లు వస్తాయి.
తొలగించండిVery unique one...a duet with Latha..we think lyricist was Anisetty
రిప్లయితొలగించండిRadharao
Beautiful song. I must have heard this song quite a number of times.Still a unique one. Both Ghantasala & Latha Mangshakar sang well.
రిప్లయితొలగించండిApparao
నాగభైరు గారు, ధన్యవాదాలు.
తొలగించండిHow shall I type in Telugu?
రిప్లయితొలగించండిYou can use www.lekhini.org for typing in Telugu. Open this in a different browser. In the top box type in transliterated text in English. As you type you can see the Telugu text forming in the bottom box. Copy the Telugu script and paste in the comment box. You also have a Guide on your right side for English to Telugu conversion. Hope this helps.
తొలగించండిwow
రిప్లయితొలగించండిthank you for gathering rare collection
రిప్లయితొలగించండిDear PMRao garu, you are welcome
రిప్లయితొలగించండిమేము ఆ రోజులలో విన్న విషయం. ఎంత మటుకు నిజమో తెలియదు.
రిప్లయితొలగించండిఅంత హై పిచ్ లో లతగారు తప్ప మరెవ్వరూ పాదలేరని అనేవారు.
ముఖ్యంగా జాలితలచి కన్నీరు తుడిచే దాతలే కనరారే అన్న దగ్గర అత్యంత హెచ్చు స్థాయిలో పాడారు.
ఘంటసాలగారు అది ఒక చాలెంజ్ గా తీసుకొని తాను కూడా పాడారని, మొదట్లో ఆ సినిమాలో ఆయన పాతలేదని అనుకొనేవారు.
ఇద్దరు మహాగాయకుల నోట ఒకటెపాటకు పోటీనా అని కూడా అనుకొనేవాళ్ళం
మేము ఆ రోజులలో విన్న విషయం. ఎంత మటుకు నిజమో తెలియదు.
రిప్లయితొలగించండిఅంత హై పిచ్ లో లతగారు తప్ప మరెవ్వరూ పాడలేరని అనేవారు.
ముఖ్యంగా జాలితలచి కన్నీరు తుడిచే దాతలే కనరారే అన్న దగ్గర అత్యంత హెచ్చు స్థాయిలో పాడారు.
ఘంటసాలగారు అది ఒక చాలెంజ్ గా తీసుకొని తాను కూడా పాడారని, మొదట్లో ఆ సినిమాలో ఆయన పాటలేదని అనుకొనేవారు.
ఇద్దరు మహాగాయకుల నోట ఒకటె పాటకు పోటీనా అని కూడా అనుకొనేవాళ్ళం.ఏదేమైనా ఈ నాటికి కూడా అది ఒక అద్భుతమైన పాట.
ఈరోజు చాలా మంచిరోజు. ఘంటసాలవారి పాటలంటే పడి చావనివాడు ఎప్పటికీ తెలుగువాడు కాలేడు. అలాంటి ఘంటసాలగారు లతా మంగేశికార్ తో కలిసి పాడిన ఈ పాట వినిపించిన మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
రిప్లయితొలగించండిజొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
సూర్యనారాయణ గారూ, ఎందరికో తెలియని ఘంటసాల గారి పాటలని ఈ బ్లాగ్ ద్వారా అందించటానికి మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం.
రిప్లయితొలగించండిMany thanks...ఇద్దరూ ఇద్దరే... ఇద్దరికీ పోటీలేదు...
రిప్లయితొలగించండిoka manchi theliyani vishayam chepparu ... thanks for the info
రిప్లయితొలగించండిLyrics in Telugu