అలనాటి ప్రముఖ సంగీత దర్శకులు స్వర బ్రహ్మ శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారికి నవంబరు 11, 2011 నాటికి తొంభై వసంతాలు నిండాయి. ఈ సందర్భంగా శ్రీ సుసర్ల వారితో టీవీ-1 చేసిన ఇంటర్వ్యూను యూ ట్యూబ్ లో చూసాను. ఆ మహామహుని గురించి, వారి సంగీత సారధ్యంలో శ్రీ ఘంటసాల మాస్టారి పాటలకు గల అనుబంధాన్నిగురించి నాలుగు ముక్కలు వ్రాయాలనిపించింది.
వాయులీన విద్వాంసులైన శ్రీ సుసర్ల వారు అలనాటి ప్రముఖ సినీ సంగీత దర్శకులు శ్రీ సి.ఆర్.సుబ్బరామన్ గారి వద్ద అసిస్టెంట్ గా పనిచేసి, 1946 లో విడుదలైన "నారద నారది" చిత్రం (నటి సూర్యకాంతం తొలి చిత్రం కూడ) ద్వారా సంగీత దర్శకునిగా మారారు. సుసర్ల వారి అద్భుత స్వర సృష్టిలో చెప్పుకోదగ్గ చిత్రాలు - సంసారం (1950), సంతానం (1955), అన్నపూర్ణ (1960), నర్తనశాల (1963). క్రొత్త గాయనీ గాయకులను ప్రోత్సాహపరచి సినీ రంగంలో మంచి స్థాయిని కలుగజేసిన వారిలో శ్రీ సుసర్ల వారొకరు. తెలుగు చిత్రాలలో సుసర్ల వారు పరిచయం చేసిన మధుర గాయనీ గాయకులు శ్రీమతి లతా మంగేష్కర్ (సంతానం-నిదురపోరా తమ్ముడా), శ్రీమతి ఎం.ఎల్.వసంత కుమారి (వచ్చిన కోడలు నచ్చింది - ఘంటసాల, జిక్కీ తో పాడిన -శరణంటినమ్మా కరుణించవమ్మా), శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ (నర్తనశాల - సలలిత రాగ సుధారస సారం), శ్రీ రఘునాథ్ పాణిగ్రాహి (ఇలవేల్పు - చల్లని రాజా ఓ చందమామ). ప్రముఖ నటి లక్ష్మీరాజ్యం స్వంత బ్యానర్ అయిన రాజ్యం పిక్చర్స్ పై తిక్కన విరచిత మహాభారతంలోని విరాటపర్వం ఆధారంగా నిర్మించబడిన "నర్తనశాల" కు సుసర్ల వారు పాటలకు, ఉత్తర గోగ్రహణం లోని పద్యాలకు కూర్చిన బాణీలు, వాటికి జీవం పోసిన ఘంటసాల గారి గానమాధుర్యం ఇప్పటికీ మరచిపోలేము. అది వొక రసమయ సంగీతభరిత దృశ్యకావ్యం.

మొదటి భాగం
గాయకులతో ప్రయోగాలు చేయడం దక్షిణామూర్తి గారి స్టయిల్. వీర కంకణం (1957) చిత్రంలో ఎన్.టి.ఆర్. కు ఎ.ఎమ్.రాజా తో, జగ్గయకు ఘంటసాల తో పాడించారు. ఈ చిత్రంలో మాస్టారు జిక్కీతో పాడిన "రావే రావే పోవు స్థలమ్మది చేరువయే", "తేలి తేలి నా మనసు" చక్కని పాటలు. అలాటిదే మరొక ప్రయోగం ఎ.ఎన్.ఆర్. కు “ఇలవేల్పు” చిత్రంలో ఒరియా గాయకులు శ్రీ రఘునాథ్ పాణిగ్రాహి గారితో "చల్లని రాజా ఓ చందమామ" పాడించారు. ఆపాట సూపర్ హిట్ అయింది. తమిళం నుండి తెలుగులోకి డబ్బింగ్ చేయబడ్డ "ఆలీబాబా 40 దొంగలు" లో ఏ.ఎం.రాజా-భానుమతి పాడిన "ప్రియతమా మనసు మారునా" అలనాటి సూపర్ డూపర్ హిట్ సాంగ్. (పైన గల వీడియోలో పొరపాటుగా ఎన్.టి.ఆర్. నటించిన, 1970 లో విడుదలైన, అదేపేరుగల చిత్రం గురించి ప్రస్తావించారు. దీనికి ఘంటసాల గారు సంగీత దర్శకులు అని గమనించవలెను).
రెండవ భాగం
ఎన్.టి.ఆర్. కు శ్రీ సుసర్ల గారంటే ప్రత్యేక గౌరవం. తన స్వంత చిత్రాలయిన "శ్రీమద్విరాట పర్వము", "శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర" కు సుసర్లగారినే యెన్నుకున్నారు. శ్రీ సుసర్ల వారు గడ్డు పరిస్థితుల కారణంగా ప్రముఖ తెలుగు సంగీత దర్శకులు చక్రవర్తి గారి వాద్య బృందంలో 80 లలో వయొలిన్ వాయిద్య సహకారాన్ని అందించారు. మధుమేహం (డయాబిటీస్) మూలంగా శ్రీ సుసర్ల వారికి దృష్టిలోపం కలిగింది. అయినా మొక్కవోని విశ్వాసంతో తన సంగీతయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు చెన్నైలో కుమార్తె వద్ద వుంటున్నారట.
మూడవ భాగం
శ్రీ సుసర్ల వారి విశేషాలను ఇటీవల ఒక శీర్షికలో ప్రజాశక్తి అనే పత్రికలో ప్రచురించారు. ఆ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. ఎన్నో అద్భుతమైన బాణీలను కూర్చి మన మనసులను రంజింప జేసిన మహానుభావులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారికి శత సహస్ర నమస్సుమాంజలులు.
సంగీత దర్శకుల్లో ఎంతో సీనియర్ అయిన సుసర్ల దక్షిణామూర్తి గారి గురించిన విశేషాలు తెలిపినందుకు కృతజ్ఞతలు. శ్రమ తీసుకుని వీడియో, ప్రజాశక్తి ఆర్టికిల్ లింకులు కూడా ఇచ్చారు మీరు.
రిప్లయితొలగించండిఆయన పేరు వినగానే ‘నర్తనశాల’ గుర్తొస్తుంది. ముఖ్యంగా ‘సలలిత రాగసుధారస’ తో పాటు ‘జననీ శివకామినీ’, ‘సఖియా వివరించవే’ పాటలు..! చాలా విరామం తర్వాత స్వరాలు కూర్చిన ‘శ్రీమద్విరాటపర్వము’ బాణీలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. దక్షిణామూర్తి గారు చక్రవర్తి సంగీత బృందంలో పనిచేయాల్సొచ్చింటే.. పరిస్థితుల ప్రాబల్యమే!
సుసర్ల వారు తక్కువ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించినా మంచి సంగీతం సమకూర్చేరు.అన్నిటి కన్నా ' నర్తనశాల ' కి ఆయన ఇచ్చిన సంగీతం ఉత్తమం.ఇప్పటికీ ఆ పాటలు సంగీత పోటీల్లో ,టీ.వీ.చానల్సు లో యువతరం వాళ్ళు కూడా పాడుతూ ఉండడం అందుకు నిదర్శనం.
రిప్లయితొలగించండినా వ్యాఖ్యలో చిన్న సవరణ... బాణీలు ప్రాచుర్యం పొందిన సినిమా..‘శ్రీమద్విరాట్’ వరకూ మాత్రమే కరెక్టు. నేను కోట్ చేయదల్చిన సినిమా ‘.. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’!
రిప్లయితొలగించండివేణు గారు, నిజమేనండి. సుసర్ల వారు అంటే వెంటనే గుర్తు వచ్చేది "నర్తనశాల". "ఆ చిత్రం పాటలు, పద్యాలు వినని తెలుగు వారుండరు" అంటే అది అతిశయోక్తి కాదు, అక్షరాల నిజం. వారి ఇంటర్వ్యూ వీడియో చూసే వరకు వారు మన మధ్య వున్నారన్న సంగతి నాకు తెలియదు. బహుశ చాల మంది అభిమానులకు తెలియదేమో. ఆనాటి కళాకారులు కళపరంగా సుశాస్త్రీయతకు, వ్యక్తి పరంగా నిజాయితీకి, కళాకారునిగా వినయానికి ప్రతీకలు. వారికి కళపై తప్ప కాసుపై అభిమానం, మమకారం లేనట్టి నిగర్వులు. నిజానికి శ్రీ సుసర్ల వారి గురించి వ్రాయగలిగేంత అనుభవం నాకు లేదు. అయినా ఉడతా భక్తి గా నాకు తెలిసిన విషయాలు నలుగురికీ తెలియజేయాలని చిన్న ప్రయత్నం చేశాను. మీకు నచ్చినందుకు, మీ స్పందనకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిరమణ గారు (కమనీయం), మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. సుసర్ల వారి స్వరకల్పనలో "నర్తనశాల" తలమానీకం. వారెందఓ యువ గాయనీ గాయకులకు స్ఫూర్తి. మీ స్పందనకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిvery rare info about Susarla Thank you for sharing with us.Value of good links increase
రిప్లయితొలగించండిwith sharing
radharao
Its a great & worth posting the valuable in fornmation about the legendary Mysic director Sri "SUSARLA DAKSHINAAMURTY GARU" in this blog. I felt happy to have seen the TV1 interview in YOutube."
రిప్లయితొలగించండిI opin that Musically, 'NArtanasala' is the out come of two great legends " Ghantasala & Sri susarla" sirs.
pvs rao, Visakhapatnam
రాధా రావు గారు, ధన్యవాదాలు. లింకులు మీకు నచ్చినందుకు సంతోషం.
రిప్లయితొలగించండిPVS రావు గారు, ధన్యవాదాలు. నా బ్లాగు నచ్చినందుకు సంతోషం. మీరు విశాఖపట్నం వాస్తవ్యులా! అంటే మాకు పొరుగూరి వారన్నమాట. నా స్వస్థలం శ్రీకాకుళం.
రిప్లయితొలగించండి