చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
రచన: కొసరాజు
గానం: ఘంటసాల, బృందం
సంగీతం: టి.చలపతి రావు
ఘంటసాల: ఏటేటా వస్తుంది సంక్రాంటి పండగా.. ఆ...ఆ...ఆ..
బీదసాదలకెల్ల ప్రియమైన పండగా ..ఆ..ఆ..ఆ
బృందం: ఈనాటి సంక్రాంతి అసలైన పండగా, సిసలైన పండగా
కష్టజీవులకు అది యెంతో కన్నుల పండగా, అది కన్నుల పండగా | ఈనాటి |
ఘంటసాల: ఎవ్వరేమి అనుకున్నా, ఎంతమంది కాదన్నా | ఎవ్వరేమి |
ఉన్నవాళ్ళ పెత్తనమ్ము ఊడుతుందిలే, సోషలిజం వచ్చేరోజూ దగ్గరుందిలే
బృందం: ఈనాటి సంక్రాంతి అసలైన పండగా, సిసలైన పండగా
కష్టజీవులకు అది యెంతో కన్నుల పండగా, అది కన్నుల పండగా
ఘంటసాల: గుడిశె కాఫురాలు మాకు ఉండబోవులే
మగవారు: ఆ.ఆ.ఆ.ఆ
ఘంటసాల: ఈ కారులు, మేడలు కొద్దిమందికే స్థిరము కావులే
ఆడవారు: ఆ.ఆ.ఆ.ఆ
మగవారు: గుడిశె కాఫురాలు మాకు ఉండబోవులే
ఆడవారు: కారులు, మేడలు కొద్దిమందికే స్థిరము కావులే
ఘంటసాల: ఓడలు బండ్లై
మగవారు: ఆ.ఆ.ఆ.
ఘంటసాల: బండ్లు ఓడలై
ఆడవారు: ఆ.ఆ.ఆ.
బృందం: ఓడలు బండ్లై, బండ్లు ఓడలై
తారు మారు ఎపుడైనా తప్పదులే తప్పదులే | ఈనాటి |
ఘంటసాల: ఎగిరిపడే పులిబిడ్డలు పాపం ఏమై పోతారూ?
మగవారు: ఏమై పోతారూ?
ఘంటసాల: పిల్లుల్లాగా తోక ముడుచుకుని
ఆడవారు: మ్యావ్ మ్యావ్ అంటారూ..
ఘంటసాల: కిక్కురు మనకా
మగవారు: ఆ.ఆ.ఆ
ఘంటసాల: కుక్కిన పేనై
ఆడవారు: ఆ.ఆ.ఆ
బృందం: కిక్కురు మనకా, కుక్కిన పేనై
చాటుగా నక్కుతారూ, చల్లగా జారుకుంటారూ
బృందం: ఈనాటి సంక్రాంతి అసలైన పండగా, సిసలైన పండగా
కష్టజీవులకు అది యెంతో కన్నుల పండగా, అది కన్నుల పండగా
ఘంటసాల: ఎవ్వరేమి అనుకున్నా, ఎంతమంది కాదన్నా | ఎవ్వరేమి |
ఉన్నవాళ్ళ పెత్తనమ్ము ఊడుతుందిలే
సోషలిజం వచ్చేరోజూ దగ్గరుందిలే
బృందం: ఈనాటి సంక్రాంతి అసలైన పండగా, సిసలైన పండగా
కష్టజీవులకు అది యెంతో కన్నుల పండగా, అది కన్నుల పండగా
ఏమి శోషలిజమో! ఏమి కమ్యూనిజమో!
రిప్లయితొలగించండి1947 నుంచి పాటలు, డాన్సులు, డప్పులు మాత్రం మారుమోగాయి కాని,
వున్న చోట్లంతా కమీనేఇజం వూడిపోయింది
అజ్ఞాత గారు, మీరు అన్నది కరక్టు. అప్పటికీ, ఇప్పటికీ తిరోగమనమేగాని, పురోగమనం లేదు దేశ ప్రగతిలో. మీ స్పందనకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి