చిత్రం: సంతానం (1955)
గానం: ఘంటసాలరచన: తిరుపతి వెంకట కవులు (పాండవ ఉద్యోగ పర్వము నుండి)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి
బావా....
బావా ఎప్పుడు వచ్చితీవు? సుఖులే, భ్రాతల్, సుతుల్, చుట్టముల్?
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
నీ వంశోన్నతి గోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమముమై చెలంగుదురె, నీ తేజంబు హెచ్చించుచున్
బావా..ఆ..ఆ..ఆ
చచ్చిరి సోదరుల్ సుతులు చచ్చిరి, చచ్చిరి రాజులెల్ల రీ-
కచ్చకు మూలకందమగు కర్ణుడు మామయు చచ్చిరీ గతిన్
పచ్చని కొంప మాపితివి బాపురే? కౌరవనాథ! నీ సగం
బిచ్చెద జీవితేచ్ఛ కలదేని బయల్పడుమయ్య గ్రక్కునన్
ఆ..ఆ..ఆ..
ఆహా! వహ్వా! వహ్వా! ... కంచు ఘంటసాల.
రిప్లయితొలగించండిశంకర్ గారికి, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఈ పద్యాలు ఘంటసాల వారి గాత్రము నుండి జాలు వారిన సంగీత ఝరులు అజరామరమయిన మాధుర్య రస ప్రవాహాలు
రిప్లయితొలగించండిna duradrushtamkoddi Sri Padmasri Ghantasala garu kavulapai padina patanu vinalekapoyinanu. Meeru chesina krushiki dhanyavadamulu.
రిప్లయితొలగించండిశంకర్ గారికి, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి