గానం: ఘంటసాల
రచన: బమ్మెఱ పోతన
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
పోకన్మానదు దేహమే విధమునన్ పోషించి రక్షించినన్
రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యంబులో దాగినన్
గాకన్మానదు పూర్వజన్మ కృతమున్ గాగల్గు నర్ధంబులున్
ఏకన్మానునె యెంత జాలిపడినన్ లేముల్ సిరుల్ రాఘవా
పోకన్మానదు
ఆడియో: "ప్రాజక్టు ఘంటసాల" సౌజన్యంతో
చాలా బాగుందండి. ఘంటసాల గారిపై మీ కున్న అభిమానం, పాటలు సెలెక్ట్ చేయడంలో మీ అభిరుచి నాకు చాలా నచ్చింది. చాలామార్లు ఇటుగా వెళ్ళినా, అదోలా అనుభూతికలిగి కామెంటు పెట్టకుండానే మరిచి వెళ్ళిప్పోయేవాడిని. ఈరోజు కామెంటు పెట్టాలనుకున్నా ... హరిహర బ్రహ్మాదులు వచ్చినా ఈరోజు ఈ జయధ్రధుని ఈరోజు ఎవ్వరూ ఆపలేరు. :)
రిప్లయితొలగించండినాకు బాగా నచ్చిన మొదటిశ్రేణి బ్లాగుల్లో మీది ఒకటి.
శంకర్ గారికి, ధన్యవాదాలు. నాకు మాష్టారి పాటలంటే చాల యిష్టం. అరుదైన ఈ పాటల సాహిత్యం అందించడమే నా ప్రయత్నం. మీ ప్రోత్సాహమే నాకు శ్రీరామ రక్ష. నా బ్లాగు నచ్చిందందుకు ధన్యుడ్ని.
రిప్లయితొలగించండి