రచన: ఘంటసాల
గానం: ఘంటసాల
ప. పర్తిశాయి పుట్టినరోజు పండుగ
రోజు మనకు పండుగ రోజు
పావనమౌ నీ నామము తలచిన
పాపములు నశించే రోజు | పర్తిశాయి |
చ. హాయిని గొలిపే లీలలా
మైమరపించే చూపులా
మధువులు చిందే మాటలా
అభయము నొసగే చేతలా | పర్తిశాయి |
చ. పిలిచినంతనే పలుకుచు రాగా
తలచినంతనే దరిశన మిడగా
భక్తుల పాలిట బాధలు తీర్చగ
భువిలో శాయి వెలిసిన రోజు | పర్తిశాయి |
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి