చిత్రం:జయభేరి రచన: శ్రీశ్రీ సంగీతం: పెండ్యాల గానం: ఘంటసాల |
ఒక భక్తి గీతంలో కూడా తన సంతకపు మార్కును, కలం పవరును చూపించిన ఘనత మహాకవి శీశ్రీది అనడానికి నిదర్శనం 1959 లో విడుదల అయిన "జయభేరి" చిత్రం లోని ఈ పాట. సమ సమాజ స్థాపన ధ్యేయంగా శ్రీశ్రీ ఎన్నో చక్కని రచనలు చేసారు. జయభేరి లోని పాటలో, "శివ భక్తులలో అధికులు, అధములు అనే వ్యత్యాసం లేదు. ఈ భేదాలు మనిషి దృష్టిలో తప్ప భగవంతుని చరాచర సృష్టిలో లేవు" అని ప్రబోధించిన పరమ శివ భక్తుడు "భక్త నందనార్" హృదయ నివేదన ఈ పాట. ఈ సాహిత్యానికి పెండ్యాల గారు కట్టిన బాణీ పది కాలాలు గుర్తుంటుంది అందరికీ. అయితే అన్నిటికీ మించి ఒక భక్తుడు పొందే ఆవేదనను, ఇచ్చే సందేశాన్ని తన గాత్రంలో పై స్థాయిలో కూడా పట్టు జారకుండా అద్భుతంగా చిరస్థాయిగా ఉండేట్లు పాడారు మన ఘంటసాల మాస్టారు. ఆయన గొంతులో తారా స్థాయిలో "పరంజ్యోతిగా వెలయించే" అన్నప్పుడు మనకు నిజంగా పరమ శివుడు ప్రత్యక్షమై ఆ భక్తుని కోరిక తీర్చాడా అన్నంత అనుభూతి, ఉద్వేగం కలుగుతాయి. తెలుగువారు చేసుకున్న పూర్వ జన్మ సుకృతం ఘంటసాల గారిని వరం గా పొందటం. ఈ పాట వీడియో, ఆడియో మరియు సాహిత్యం ఇక్కడ పొందు పరుస్తున్నాను.
వీడియో పొందుపరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
నరుని దృష్టిలోనే భేదాలు
శివుని దృష్టిలో అంతా సమానులే
ఏ.. ఏ.. ఏ.. ఏ..
ప. నందుని చరితము వినుమా..
పరమానందము గనుమా ఆ.ఆ.ఆ
పరమానందము గనుమా
నందుని చరితము వినుమా..
పరమానందము గనుమా ఆ.ఆ.ఆ
పరమానందము గనుమా
చ. ఆదనూరులో మాలవాడలో |ఆదనూరులో|
పేదవాడుగా జనియించీ..
చిదంబరేశుని పదాంబుజములే
మదిలో నిలిపీ కొలిచేను
నందుని చరితము వినుమా..
పరమానందము గనుమా ఆ.ఆ.
పరమానందము గనుమా
చ. తన యజమానుని ఆనతి వేడెను
శివుని చూడగా మనసుపడీ.. |తన యజమానుని|
పొలాల సేద్యం ముగించి రమ్మని |పొలాల సేద్యం|
గడువే విధించె యజమా..ని
యజమాని ఆనతిచ్చిన గడువులో
యే రీతి పొలము పండించుటో
ఎరుగక అలమటించు తన భక్తుని కార్యము
ఆ శివుడే నెరవేర్చే...ఏ...ఏ..
పరుగున పోయెను చిదంబరానికి
భక్తుడు నందుడు ఆత్రమున.. |పరుగున|
చిదంబరంలో శివుని దర్శనం
చేయగరాదనె పూజారి
ఆశాభంగము పొందిన నందుడు
ఆ గుడి ముందే మూర్ఛిల్లే..
అంతట శివుడే అతనిని బ్రోచి
పరంజ్యోతిగా వెలయించే..
నిజంగా ఘంటసాల మాస్టర్ ఆ పరమ శివుని
రిప్లయితొలగించండిసాక్షత్కారం మన అందరకి అందచేసారు ఈ పాట ద్వార.
మీకు కూడా కృతజ్ఞతలుమరొక్కసారి ఆ పాటని వినే భాగ్యం కలగ
చేసినందుకు.
నమస్కారం. నిజంగా మాస్టారి కొన్నిపాటలు వింటుంటే ఎంతో ఉద్వేగంగా వుంటుంది. పాడిన ప్రతి పాటకు జీవం పోసారు ఆయన. ఆ మహానుభావుని కీర్తి ఆచంద్ర తారార్కం. మీ స్పందనకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసూర్యనారాయణ గారూ! ఇన్నాళ్ళూ మీ బ్లాగు గురించి వినక, తెలియక చాలా కాలం వృధా అయిపోయిందే అని విచారిస్తున్నాను. ఎంతో శ్రమకోర్చి ఇంత చక్కగా విశదంగా, వివరణలతో ఘంటసాల మాస్టారి గానమాధుర్యాన్ని గురించి తెలియచేస్తున్నందుకు మాస్టారి అభిమానిగా మీకు నా కృతజ్ఞతలు! వారి కచేరీ మొదటిసారి 1957 ప్రాంతాల్లో కన్నాను, విన్నాను తెనాలి తాలూకా బోడపాడు లో! ఆ తరువాత మరో రెండుసార్లు గుంటూరు, హైదరాబాదుల్లో - ఈ జీవితం ధన్యమైంది! మీరన్నట్లు, తెలుగువారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఘంటసాల వారిని వరంగా పొందటం!! - ఎం.ఎస్.రామకృష్ణ
రిప్లయితొలగించండిశ్రీ రామకృష్ణ గారికి నమస్కారములు. నేను ఈ బ్లాగు ప్రారంభించి ఇంకా ఒక సంవత్సరం కూడ పూర్తి కాలేదు. ఇంకా వ్రాయవలసినవి ఎన్నో ఉన్నాయి. అయితే మాస్టారి పాటల సాహిత్యంతో పాటు వీలైనన్ని వివరాలు సేకరించి ఒక చోట పొందుపరచాలన్న తలంపుతో ఈ బ్లాగు ప్రారంభించాను. ఇది ప్రారంభించాక నాకు తెలియని ఎన్నో విషయాలను పలువురు అభిమానులు, రసజ్ఞుల నుండి తెలుసుకోగలుగుతున్నందుకు, మీ వంటి వారి సద్విమర్శలు, సలహాలు లభిసున్నందుకు చాల సంతోషంగా వుంది. నాకు తెలిసిన విషయాలు లేశమంత. అయితే తెలుసుకుని వ్రాయాలనేది నా తాపత్రయం. రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇదంతా మాస్తారి చలవ. నేను వారిని ఎప్పుడూ చూడలేదు. వారిని దర్శించిన మీ వంటి వారంతా ధన్యులు, చరితార్థులు. మీవంటి పదుగురి ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష. శలవు.
రిప్లయితొలగించండి