1926 వ సంవత్సరం నవంబరు 23 న శ్రీ సత్యసాయి జన్మించారు. అమర గాయకులు శ్రీ ఘంటసాల గారు బాబా భక్తులు. బాబాగారి పై కొన్ని మధుర గీతాలు వ్రాసి, స్వరపరచి, గానం చేసారు. ఈ గీతాలు "ఘంటసాల గాన చరిత" మరియు ఇంకొన్ని వెబ్ సైట్లలో లభ్యమవుతున్నాయి. ఈ రోజు శ్రీ సత్యసాయి 85 వ జన్మదినం సందర్భంగా మాస్టారు పాడిన ఈ పాటను ఆడియో, వీడియో, మరియు సాహిత్యం తో ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ పాటను ఇదివరలో నా "స్వగతం" బ్లాగులో పోస్టు చేసాను. ఇది బాబా గారిపై మాస్టారి పాట కనుక శ్రీ సత్యసాయి పుట్టినరోజు సందర్భంగా మరల ఈ బ్లాగులో పునః ప్రచురించడం సముచితం అనిపించింది.
ఆడియో లింకు: నమో సత్య సాయి బాబా.. (ఘంటసాల గాన చరిత నుండి)
ఘంటసాల: బోలో! శ్రీ సత్యశాయి బాబాజీ కి
బృందం: జై!
ఘంటసాల: బోలో! శ్రీ సత్యశాయి బాబాజీ కి
బృందం: జై!
సాకీ. ఘంటసాల: నమో! సత్య శాయి బాబా..
నమో! నమో! సత్యశాయి
ప. ఘంటసాల: నమో! సత్యశాయి బాబా నమో! సత్యశాయి
బృందం: నమో! సత్యశాయి బాబా నమో! సత్యశాయి
ఘంటసాల: నమో! విశ్వతేజా జ్యోతి స్వరూపా
బృందం: నమో! విశ్వతేజా జ్యోతి స్వరూపా
అందరు: నమో! సత్యశాయి బాబా నమో! సత్యశాయి
నమో! విశ్వతేజా జ్యోతి స్వరూపా
నమో! సత్యశాయి బాబా నమో! సత్యశాయి
చ. ఘంటసాల: అరుణ కాంతులలోన అగుపించే నీ మోము
ఆ మోము కాంచిన అంతరంగము పొంగే
బృందం: అరుణ కాంతులలోన అగుపించే నీ మోము
ఆ మోము కాంచిన అంతరంగము పొంగే
ఘంటసాల: ఈనాటి ఈ సుఖము ఏనాడు పొందము
బృందం: ఈనాటి ఈ సుఖము ఏనాడు పొందము
ఘంటసాల: ఏ నోము నోచామో ఇపుడు కనుగొన్నాము
బృందం: ఏ నోము నోచామో ఇపుడు కనుగొన్నాము
అందరు: నమో! సత్యశాయి బాబా నమో! సత్యసాయి
నమో! విశ్వతేజా జ్యోతిస్వరూపా
నమో! సత్యశాయి
చ. ఘంటసాల: విరులూ తరులూ వికసించినవి
మనసూ తనువూ పులకించినవి
బృందం: విరులూ తరులూ వికసించినవి
మనసూ తనువూ పులకించినవి
ఘంటసాల: వరుసగ నిలచి ఒడలను మరచి
బృందం: వరుసగ నిలచి ఒడలను మరచి
ఘంటసాల: తరియించ కోరేము నీ చెంత నిలచి
బృందం: తరియించ కోరేము నీ చెంత నిలచి
అందరు: నమో! సత్యశాయిబాబా నమో! సత్యసాయి
నమో! విశ్వతేజా జ్యోతిస్వరూపా
నమో! సత్యశాయిబాబా నమో! సత్యసాయి
నమో! సత్యశాయిబాబా నమో! సత్యసాయి
నమో! సత్యశాయిబాబా నమో! సత్యసాయి
ఘంటసాల: బాబా..
అందరు: ఓం శాంతి శాంతి శాంతిః
Chala santhoshamu
రిప్లయితొలగించండిSairam
Jai Baba
?!